పెళ్లి కోసం జబర్దస్త్ నటుడు తిప్పలు.. ఎదురు కట్నం కూడా ఇస్తానంటూ..

జబర్దస్త్‌ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు నరేష్‌. బుల్లితెరపై తనదైన టైమింగ్‌, కామెడీ స్టైల్‌తో అలరిస్తూ.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాంటి కామెడియన్ నరేష్‌ తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. అలాగే, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నరేష్‌ పెళ్లి ప్రొమో చూపించడంతో, అతడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే?

ఇటీవల జబర్థస్ ఫేమ్ నరేష్‌.. యాంకర్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్‌ టాక్స్‌ షోకు అతిథిగా హాజరయ్యారు. యాంకర్‌ వర్ష మాట్లాడుతూ.. "ఈ మధ్య గ్లామర్‌ ఎక్కువైంది కదా.." అంటూ ఆటపట్టించగా, నరేష్‌ కూడా సరదాగా "పెళ్లీడు వచ్చిందేమో" అని నవ్విస్తూ స్పందించాడు. 'అదేంటీ? నరేష్ కి పెళ్లి అయింది.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రోమోలో చూశారు కాదా?' వర్ష అనగా.. ' ప్రోమోలు చూస్తే అలానే ఉంటుంది ' అన్నాడు. "ఆ స్కిట్‌ చూసి నిజంగానే పెళ్లి సెట్ అయిందంటూ రాసేశారు. అంతే కాకుండా నరేష్ ఓ ఇంటి వాడు అవుతున్నాడని రాసేశారని చెప్పారు.

Jabardasth Fame Naresh Clears the Air on Wedding Rumors I Still Don t Have a Bride

'నరేష్ ఏ ఇంటి వాడు కాలేదు.. మీరు ఒప్పుకుంటే మీ ఇంటి వాడిని అవుతా.. కానీ అది కేవలం స్కిట్‌ మాత్రమే. నిజం పెళ్లి కాదు. నాకు వధువు ఇంకా దొరకలేదు" అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. అసలు పెళ్లి ఎప్పుడు అని వర్ష అడగ్గా, "ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు" అని చెప్పారు. కట్నంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, "నాకు కట్నంపై ఆశలు లేవు. అసలు కట్నం తీసుకోవాలని లేదు. అవసరమైతే.. నేనే ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

ఆ తరువాత వర్ష 'నీకు ఎంత ఆస్తి ఉంది?'అని ప్రశ్నించగా, నరేష్ "అంత కాదు... ఏదో కొంత" అని నవ్వుతూ బదులిచ్చాడు. వెంటనే వర్ష,'అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు... నీ ఇష్టం' అనగా.. నరేష్ కూడా వెనకాడకుండా "పుట్టనివ్వు ఎవరు పుట్టినా సంతోషమే... ముందు పెళ్లి కావాలి కదా?" అంటూ ఫన్నీ రిప్లే ఇచ్చారు. ఈ సరదా సంభాషణతో స్టూడియోలో నవ్వులు పూశాయి.

వర్ష మరో ప్రశ్నతో నరేష్‌ను ఆటపట్టిస్తూ "అరే అంత తొందర ఏంట్రా? పెళ్లి అవుతుంది... నాకు ఆ నమ్మకం ఉంది" అని కామెంట్ చేయగా, నరేష్ కూడా "నాకూ ఉంది... నాకు పెళ్లయి పిల్లలు పుట్టాలని పెద్ద ఆశ ఉంది. ఆ ఆశ ఎప్పటికో ఒకరోజు నెరవేరుతుంది" అంటూ నవ్విస్తూ చెప్పాడు. నరేష్ ఈ వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కి మరింత ఆసక్తి కలిగించాయి.

ఇటీవల వైరల్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ పెళ్లి ఎపిసోడ్ గురించి వర్ష మరోసారి ప్రశ్నించింది. "నిజంగా ఆ అమ్మాయితో నీకేమైనా సంబంధం ఉందా?" అన్న ప్రశ్నకు నరేష్ నేరుగా "ఆ రోజే మొదటిసారి ఆ అమ్మాయిని చూశా. నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు' అని చెప్పాడు. స్కిట్ గురించి వివరించుతూ "ఇలా ఒక కాన్సెప్ట్ ఉంది, చేస్తారా అని అడిగారు. ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ఒప్పుకుంది. ఎపిసోడ్ ఎండింగ్‌లో ఇది స్కిట్ మాత్రమే అని స్పష్టంగా చెప్పాం' అని నరేష్ వివరణ ఇచ్చాడు.

కాబోయే భార్య ఎలా ఉండాలని అనుకుంటున్నావని వర్ష అడగగా, నరేష్ తన అభిప్రాయాన్నిచెబుతూ "నాకంటే కొంచెం హైట్ ఎక్కువ అయినా పర్లేదు. కనీసం అడుగున్నర వరకు ఉంటే.. బాగుంటుంది. ముఖ్యంగా నన్ను అర్థం చేసుకోవాలి, మా పేరెంట్స్‌ను గౌరవంగా చూసుకోవాలి. నేను బయట ఈవెంట్స్‌కు వెళ్తే కేర్ తీసుకోవాలి, సపోర్ట్ చేయాలి" అంటూ తెలిపారు. మొత్తం మీద, జబర్థస్త్ నరేష్ తన పెళ్లి రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వడమే కాకుండా, తన భావాలు, భవిష్యత్ ఆశలు, కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఓపెన్‌గా చెప్పాడు. నరేష్ కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన త్వరగా ఓ ఇంటి వాడు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: naresh anchor varsha jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X