For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అసభ్యంగా మాట్లాడారు, సుమ పేరు మార్చారు.... జబర్దస్త్ లేడీ పాత్రధారి శాంతి స్వరూప్

  By Bojja Kumar
  |
  అసభ్యంగా మాట్లాడారు.. -జబర్దస్త్ శాంతి స్వరూప్

  ప్రస్తుతం తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో 'జబర్దస్త్' ఎంత పాపుల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కార్యక్రమంలో లేడీ గెటప్‌లు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శాంతి స్వరూప్. ప్రస్తుతం రన్ అవుతున్న ఎపిసోడ్లలో శాంతి స్వరూప్ లేకుండా దాదాపు ఏ స్కిట్ ఉండటం లేదు.

  శాంతి స్వరూప్ తాజాగా ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. లేడీ పాత్ర వేయడం ద్వారా ఎందుర్కొంటున్న లాభ నష్టాలను వెల్లడించారు. దాంతో పాటు ఇక్కడి వరకు రావడానికి తాను ఎంత కష్టపడ్డానో వివరించారు.

   యాక్టర్ అవ్వాలని అప్పుడే

  యాక్టర్ అవ్వాలని అప్పుడే

  ఐదుగురు అన్నదమ్ముల్లో నేను నాలుగోవాడిని. ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడంతో అమ్మ నన్ను చిన్నతనంలో ఆడపిల్లలా తయారు చేసి మురిసిపోయేది. నా స్కూల్ డేస్ లో జాతరలో ఓ స్టేజ్ షోలో లేడీ గెటప్ వేశాను. అప్పుడే ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక మొదలైంది.... అని శాంతి స్వరూప్ తెలిపారు.

   ఇంట్లో అబద్దం చెప్పి వచ్చేశా

  ఇంట్లో అబద్దం చెప్పి వచ్చేశా

  పదో తరగతి ఆపేసిన తర్వాత కావలిలో టెలిఫోన్ బూత్ లో పని చేసేవాడిని. అక్కడికి చాలా మంది సినిమా వాళ్లు వచ్చేవారు. వారితో తనకు సినిమాల్లో అవకాశం ఇప్పించాలని అడిగేవాడిని. కానీ వర్కౌట్ కాలేదు. దీంతో హైదరాబాద్ వెళ్లాలని డిసైడ్ అయ్యాను. ఇంట్లో చెబితే ఒప్పుకోక పోవడంతో సీరియల్‌లో నటించే అవకాశం వచ్చిందని అబద్ధం చెప్పి 2001లో హైదరాబాద్ వచ్చేశా... అని శాంతి స్వరూప్ తెలిపారు.

   ఇక్కడికి వచ్చాక పరిస్థితి అర్థమైంది

  ఇక్కడికి వచ్చాక పరిస్థితి అర్థమైంది

  హైదరాబాద్ వచ్చాక అవకాశాలు అంత సులభం కాదని అర్థమైంది. ఎలాగైనా ఇండస్ట్రీలోనే సెటిలవ్వాలని డిసైడ్ అయ్యాను. ఓ సినిమా ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా చేరడానికి వెళ్లాను. జీతం ఇవ్వం..ఇష్టం ఉంటే చేరు అన్నారు. ఒక పూట భోజనం పెడితే అన్ని పనులు చేస్తానని వారికి చెప్పాను. నటించక పోయినా సినిమా వాళ్ల మధ్య ఉన్నాను అనే సంతోషం. ఇండస్ట్రీలో ఉన్నాను అనే ధైర్యం ఉండేది. అలా ఆఫీస్ బాయ్ నుండి సినీ ఆర్టిస్టులకు అసిస్టెంటుగా ఉండే స్థాయికి వచ్చాను. రాశి, సత్యరాజ్, పూరీ జగన్నాథ్.. ఇలా చాలా మంది ఆర్టిస్ట్ ల దగ్గర పని చేస్తూ... అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండే వాడిని అని శాంతి స్వరూప్ తెలిపారు.

   తొలి అవకాశం, కానీ మూవీ విడుదల కాలేదు

  తొలి అవకాశం, కానీ మూవీ విడుదల కాలేదు

  ప్రయత్నించగా ప్రయత్నించగా ‘చంద్రుడిలో ఉండే కుందేలు' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులో ‘గే' పాత్ర చేశారు. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. అందులో రాజీవ్ కనకాల గారితో నా సీన్లు ఉంటాయి. ఆయన నన్ను చూసి నీ గెటప్ బావుంది అన్నారు. ఏదైనా వేషాలు ఉంటే ఇప్పించమని అడిగితే...యాంకర్ సుమగారి ప్రొడక్షన్ లో చేస్తున్న ‘కెవ్వు కేక'లో అవకాశం ఇప్పించారు అని... శాంతి స్వరూప్ తెలిపారు.

  సుమ గారు పేరు మార్చారు

  సుమ గారు పేరు మార్చారు

  నా అసలు పేరు శాంతి కుమార్. దూరదర్శన్ యాంకర్ శాంతి స్వరూప్ మాదిరిగా నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను అని యాంకర్ సుమ గారు ‘కెవ్వుకేక' షోలో సమయంలో నా పేరు మార్చారు. నాకు ఇష్టమైన యాంకర్ నా పేరు మార్చడం నాకు కూడా నచ్చింది.... అని శాంతి స్వరూప్ తెలిపారు.

   లేడీ గెటప్ లు వేయడం గురించి

  లేడీ గెటప్ లు వేయడం గురించి

  లేడీ గెటప్స్ వేయడం వల్ల మాకు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు నా పాత్ర బాగుంటుందని, ‘జబర్దస్త్'లో ఎంట్రీ సాంగ్ తో నా ప్రవేశం బాగుందని చాలా మంది చెబుతారు.... అపుడు ఆనందంగా ఉంటుంది. అయితే కొందరు తమ మాటలతో ఇబ్బంది పెడతారు అని శాంతి స్వరూప్ తెలిపారు.

   చాలా అసభ్యంగా మాట్లాడారు

  చాలా అసభ్యంగా మాట్లాడారు

  నా పట్ల కొందరు కాలేజీ స్టూడెంట్స్ అసభ్య కామెంట్స్ చేశారు. ‘లేడీగా మారిపోయారా?' ‘ఆపరేషన్ చేయించుకున్నారా?' వంటి ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో మెస్సేజ్ లు పెడుతుంటారు.... లేడీ గెటప్స్ వేసినంత మాత్రాన అలా అనుకోవడం సరికాదు.... అని శాంతి స్వరూప్ తెలిపారు.

   చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, ఆడి కారు లేదు

  చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, ఆడి కారు లేదు

  నా పేరు మీద నాలుగైదు ఫేక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. అవి చూసి మోసపోవద్దు. నాకు ఆడి కారు ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఎవరు ఏ కామెంట్ చేసినా పట్టించుకోను. నా మనసులో ఉన్నది వెంటనే చెప్పేస్తాను.... అని శాంతి స్వరూప్ తెలిపారు.

   సౌందర్య అంటే ఇష్టం

  సౌందర్య అంటే ఇష్టం

  ‘జబర్దస్త్'లో లేడీ పాత్రల్లో నటించేటప్పుడు తాను ధరించే డ్రెస్సులకు చాలా ప్రాధాన్యమిస్తాను. నటి సౌందర్య గారంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో కలిసి ఓ సినిమాలో అయినా సరే నటించాలని ఉండేది. దురదృష్ట వశాత్తు ఆమె చనిపోయారు. జబర్దస్త్ షోలో చీర ధరించేటప్పుడు ఇప్పటికీ సౌందర్యనే నేను ఫాలో అవుతాను. ఆమె డ్రెస్సులు ఎంతో పద్ధతిగా ఉంటాయి. అలానే రోజాగారి చీర కట్టు, హెయిర్ స్టైల్ కూడా నేను అనుసరిస్తా... అని శాంతి స్వరూప్ తెలిపారు.

   నెలలో 20 రోజులు చీరలోనే ఉంటా

  నెలలో 20 రోజులు చీరలోనే ఉంటా

  ‘జబర్దస్త్' షో కోసం నెలలో 20 రోజులు చీరలు ధరించే ఉంటా. ఈ షో చేస్తున్నందువల్ల ప్యాంటు, షర్ట్స్ ధరించడం తక్కువై పోయింది. లేడీస్ ఐటెమ్స్ కొనడం ఎక్కువైపోయింది. ప్రస్తుతం తన కెరీర్ సంతోషంగా సాగుతుంది అని తెలిపారు.

  English summary
  Jabardasth Actor Shanti Swaroop became popular with female characters. In the latest interview, he said many interesting things.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X