అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే నన్ను వదిలేశాడు!

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది నటి ఐశ్వర్య వల్లింగాల. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అందాల తార. తాజాగా ఐశ్వర్యకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్య్వూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోని పలు అంశాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తన ప్రేమ, లవ్ ఫెయిల్యూర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

ఈ ఇంటర్వ్యూలో నటి ఐశ్వర్య ముందుగా తన వ్యక్తిగత జీవితంపై స్పందించారు. గతంలో తాను ఒకరిని ఎంతో ప్రేమించానని, కానీ పెళ్లి విషయానికి రాగానే ఆ వ్యక్తి తనను వదిలేశాడని ఎమోషనల్‌గా చెప్పింది. ప్రేమ అనేది చాలా విలువైనదని, కానీ దానికి అర్హత లేని వ్యక్తి జీవితంలోకి వస్తే అది నిలవదని పేర్కొంది. ఒక సమయంలో తాను సీరియస్ రిలేషన్‌లో ఉన్నానని, అయితే అది చివరకు బ్రేకప్‌తో ముగిసిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని, అదే తనకు సంతోషంగా ఉందని తెలిపింది.

Jabardasth actress Aishwarya Vullingala Throwback Interview Love Failure and Industry Struggles

'జబర్దస్త్' షోలో సాయి‌తో చేసిన స్కిట్ కారణంగా ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని ఐశ్వర్య తెలిపింది. కానీ, అవన్నీ కేవలం స్కిట్ మాత్రమేనని, నిజ జీవితంలో అలాంటి సంబంధం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ వల్ల కొంతమేర ఇబ్బంది పడినా, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగానని చెప్పింది.

ఇక ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతూ ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు చేసింది. కమిట్‌మెంట్ అనే పదాన్ని మొదట పని పట్ల నిబద్ధతగా భావించానని, కానీ తర్వాత దాని వెనుక ఉన్న అసలు అర్థం తెలిసి షాక్ అయ్యానని తెలిపింది. కొన్ని ప్రాజెక్టుల విషయంలో అగ్రిమెంట్‌కు ముందే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అభ్యంతరకరమైన ఆఫర్లు చేశారని వెల్లడించింది. ఒకసారి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తాను తీవ్రంగా స్పందించి, ఆ వ్యక్తితో గొడవపడి బయటకు వచ్చానని ధైర్యంగా చెప్పింది.

సినిమా అవకాశాల కోసం తాను ఎవరినీ అడగనని, అయినప్పటికీ తన టాలెంట్ చూసి కొన్ని అవకాశాలు వచ్చాయని ఐశ్వర్య పేర్కొంది. డబ్బింగ్ థియేటర్‌లో తన వర్క్ చూసి లేదా స్నేహితుల ద్వారా క్లిప్స్ చూసి డైరెక్టర్లు సంప్రదించారని తెలిపింది. అయినప్పటికీ తనకు ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక సినిమాల విషయంలో కూడా కొన్ని సమస్యలను ఆమె ప్రస్తావించింది. కథ చెప్పేటప్పుడు బాగా అనిపించిన ప్రాజెక్టులు, షూటింగ్ తర్వాత పూర్తిగా వేరేలా మారిపోతాయని తెలిపింది.

డైరెక్షన్, సినిమాటోగ్రఫీ కారణంగా తన పాత్రలు సరైన విధంగా ఎలివేట్ కాకపోవడం వల్ల గుర్తింపు తగ్గిపోతుందని చెప్పింది. అయితే ఈ కష్టాలన్నీ ఉన్నప్పటికీ తాను వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతానని, మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయని నమ్మకంతో ఉన్నానని ఐశ్వర్య తెలిపింది. ఇండస్ట్రీలో ఎదురైన వాస్తవాల వరకు ఐశ్వర్య చేసిన ఈ ఓపెన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X