గ్లామర్ డోస్ పెంచేసిన రీతూ చౌదరి.. పింక్ డ్రెస్‌లో జబర్దస్త్ బ్యూటీ అరాచకం!
జబర్దస్త్ షోతో ఎంతో మంది ప్రతిభావంతులు తెరకు పరిచయమయ్యారు. వీరిలో మహిళా కమెడియన్లు కూడా ఉన్నారు. పురుషులతో సమానంగా నువ్వులు పూయించారు. వీరిలో రీతూ చౌదరి కూడా ఒకరు. తెరపై స్కిట్లతో పాటు హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు సెగలు రేపింది రీతూ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన అందాలతో జబర్దస్త్ షోకు గ్లామర్ సొగసులు అద్దారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీతూ చౌదరి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభం
షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ ద్వారా రీతూ చౌదరి కెరీర్ ప్రారంభమైంది. తెలుగులో పలు ఛానెల్స్‌లో ప్రసారమైన సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ దశలో జబర్దస్త్ కార్యక్రమం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. హైపర్ ఆదితో పాటు పలు టీమ్స్‌లోనూ మెంబర్‌గా నవ్వించింది. ఈ ఫేమ్‌తో ఆమెకు ఇతర ఛానెల్స్ నుంచి ఆఫర్లు వచ్చాయి. టెలివిజన్ షోలు, ఈవెంట్స్, సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా రెండు చేతులా సంపాదిస్తోంది రీతూ చౌదరి. తనను ఎంతో ప్రోత్సహించి.. అన్ని రకాలుగా అండగా నిలిచిన తండ్రి మరణంతో రీతూ బాగా కుంగిపోయింది. నాటి నుంచి తల్లే జీవితం అన్నట్లుగా బతుకుతోంది. తను చేసే వీడియోలలో అమ్మను కూడా తీసుకొస్తూ ఆమెను సంతోషంగా చూసుకుంటోంది.

భూ వివాదంలో రీతూ చౌదరి పేరు
కొద్దినెలల క్రితం రీతూ చౌదరి పేరు రూ.700 కోట్ల భూ కుంభకోణంలో తెరపైకి రావడం కలకలం రేపింది. రీతూ భర్త శ్రీకాంత్ ఈ స్కాంలో కీలకపాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కుంభకోణానికి తనకు ఏం సంబంధం లేదని రీతూ క్లారిటీ ఇచ్చింది. పెళ్లయిన ఆరు నెలలకే తాము విడిపోయినట్లు చెప్పింది రీతూ. ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత ఇటీవల బెట్టింగ్ యాప్స్ స్కాంలో రీతూ చౌదరి పేరు తెరమీదకి వచ్చింది.
ప్రేక్షకులకు క్షమాపణలు
ఈ వ్యవహారంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ పరిణామాలతో రీతూ చౌదరి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. తెలిసో తెలియాకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. బెట్టింగ్ యాప్స్‌ను నమ్మొద్దని, మీ మొబైల్స్‌లో బెట్టింగ్ యాప్స్ ఉంటే వాటిని తక్షణం డిలీట్ చేయాలని కోరింది.
హద్దులు దాటేసిన జబర్దస్త్ పిల్ల
మొన్నామధ్య సీనియర్ నటుడు శివాజీ రాజా కుమారుడితో కలిసి రిసార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది రీతూ చౌదరి. తన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి ఇటీవలి కాలంలో కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి. జబర్దస్త్‌తో తనను బాగా ప్రోత్సహించి అవకాశాలు కల్పించిన హైపర్ ఆది లేకపోవడం తన కెరీర్‌పై ప్రభావం చూపించిందని ఆమె పేర్కొంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి తాజాగా చేసిన ఫోటో షూట్ వైలర్ అవుతోంది. పింక్ కలర్ నిక్కర్, వైట్ బ్లౌజ్‌తో చేతిలో స్పీకర్‌ను పట్టుకుని గ్లామర్ డోస్ పెంచేసింది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











