రీతూ చౌదరి శృంగారం వీడియో వైరల్: ఆ సైట్‌లో పెట్టిన కుర్రాడు.. చివరికి ఏం జరిగిందంటే!
తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు పలు విభాగాల్లో సందడి చేస్తూనే ఉన్నారు. ఫలితంగా తమదైన అందం, అభినయం, ఇతర టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫేం రీతూ చౌదరి ఒకరు.
కొంత కాలంగా టెలివిజన్ రంగంలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రీతూ చౌదరి శృంగారం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని వెనుక అసలు కథ ఏంటో మీరే చూసేయండి మరి!

అలా మొదలైన ప్రయాణం: యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసింది. అలా చాలా కాలం పని చేసిన తర్వాత 'గోరింటాకు' అనే సీరియల్‌తో యాక్టింగ్ కెరీర్ మొదలెట్టింది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లతో పేరు తెచ్చుకుంది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సంచలనం అయింది.

అప్పటి నుంచి పాపులర్‌గా: సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది.

పెద్దగా కనిపించడం లేదు: ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. అలాగే, కొన్ని వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

పెళ్లి కోసమే ఆ నిర్ణయమా: వరుస ఆఫర్లతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోన్న రీతూ చౌదరి.. ప్రస్తుతం శ్రీకాంత్ అనే పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమాయణం సాగిస్తోన్నట్లు చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాదే వీళ్లిద్దరూ ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీ: కెరీర్ పరంగా చాలా కాలం నుంచే సత్తా చాటుతూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గానే ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటోంది.
రీతూ శృంగారం వీడియో: సోషల్ మీడియాలో యమ పాపులర్ అయిన రీతూ చౌదరికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు సంబంధించిన శృంగారం వీడియో ఒకటి ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. అయితే, దీనిపై స్పందించిన రీతూ చౌదరి అది తన వీడియో కాదని, ఎవరో మార్ఫింగ్ చేశారని చెప్పింది. అంతేకాదు, దీనికి బాధ్యులను అరెస్ట్ చేయాలని సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.

అరెస్ట్ చేయించిన బ్యూటీ: రీతూ చౌదరి ముఖంతో శృంగారపు వీడియోను రూపొందించిన, దాన్ని షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ పోలీసులు ఇటీవలే ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో ఆ పోలీసులకు రీతూ చౌదరి థ్యాంక్స్ చెప్పడంతో పాటు జరిగిందంతా వివరిస్తూ ఓ వీడియోను తీసి యూట్యూబ్‌లో పెట్టింది. ఆమె చూపించిన తెగువకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.


Click it and Unblock the Notifications











