నీకు ఛాన్స్ ఇస్తే.. నాకు ఏమిస్తావు.. నిర్మాతతో రోహిణికి చేదు అనుభవం

సినీ వరల్డ్... రంగుల ప్రపంచం... ఎంతో మంది నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. కొందరు బ్యాక్ గ్రౌండ్ తో నేరుగా ఎంట్రీ ఇస్తుంటే.. మరికొందరు ఎంట్రీ ఇవ్వడానికే నానా పాట్లు పాడాల్సి వస్తుంటుంది. సినిమా, టెలివిజన్ రంగాల్లో సక్సెస్ సాధించాలంటే పట్టుదల, ఫోకస్, కన్సిస్టెన్సీ తప్పనిసరి. అందుకు తగ్గట్టుగానే ఎన్నో ఆటుపోట్లనూ తట్టుకొని నిలబడాలి. 24 క్రాఫ్ట్స్ లోని ప్రతి డిపార్ట్ మెంట్ లో ఇప్పటివరకు సక్సెస్ సాధించిన వారందరూ ఎంతో కష్టపడి, ఎన్నో అడ్డంకులను దాటుకొని ముందుకు వచ్చారు. అయితే యాక్టర్స్ కు ఉండే కష్టాలు ఒకరకమైనవైతే.. హీరోయిన్లు, నటీమణులకు ఉండే సమస్యలు మరో రకంగా ఉంటాయి.

ముఖ్యంగా ఇండస్ట్రీలో 'కమిట్ మెంట్' భారీ నుంచి తప్పుంచుకోవడానికి ఎంతో మంది హీరోయిన్లు సతమతమవుతున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైన ఛేదు అనుభవాలను పలువురు నటీమణులు పంచుకున్న సంగతి తెలిసిందే. టెలివిజన్ రంగంలోనూ నటీమణులకు ఆ సమస్య తప్పడం లేదు. సిగ్గులేకుండా కమిట్ మెట్లు అడిగేస్తున్నారని పలువురు నటీమణులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక రీసెంట్ గానే స్టార్ యాంకర్ అనసూయ కూడా కమిట్ మెంట్ సమస్యను ఎదుర్కొన్నట్టు తెలిపారు. కానీ ఎక్కడా తలొగ్గకుండా అలాంటి పీడులను దాటుకొని కెరీర్ ను బిల్డ్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు.

Jabardasth Actress Rohini Open Comments about asked COMMITMENT in Television Field Here is Her Emotional Words

ఇక తాజాగా బుల్లితెర నటి రోహిణి కూడా ఇండస్ట్రీలోని కమిట్ మెంట్లపై ఓపెన్ కామెంట్స్ చేశారు. సినిమాల విషయం పక్కన పెడితే టెలివిజన్ రంగంలోనూ నిర్భయంగా కమిట్ మెంట్లు అడుగుతున్నారని బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలో తాను అలాంటి చేధు అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.... ఓ సిరీయల్ కోసమని ఆడిషన్ కు వెళ్తే నీకు ఛాన్స్ ఇస్తే కమిట్ మెంట్ ఇవ్వాలని ఓ ప్రొడ్యూసర్ కు సంబంధించిన మేనేజర్ అడిగారంట. అప్పట్లో తనకు తెలియకపోవడంతో కమిట్ మెంట్ గా వర్క్ గా చేస్తానని, వర్క్ విషయంలో ఎంతైనా కష్టపడుతానని చెప్పిందంట.

Take a Poll

కానీ తీరా విషయం తెలిశాక చాలా బాధపడిందంట జబర్దస్త్ రోహిణి. అయితే ఆ విషయాన్ని తనకు తెలిసిన అంకుల్ కు చెప్పిందంట.ఆయన సదరు ప్రొడ్యూసర్ కు ఫోన్ చేసి సీరియస్ అయ్యారంట. ఇక ఆ ప్రొడ్యూసర్ నేను నిన్ను అడిగానా? అని పెద్ద గొంతేసుకొని అరిచాడంట. అయినా రోహిణి మాత్రం బయపడకుండా తనకు ఎదురైనా ఛేదు అనుభవాన్ని తిప్పికొట్టిందంట. మరోసారి ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లినప్పుడు జీ ఛానెల్ లో ఏ సీరియల్ లో అంటే ఆ సీరియల్ లో అవకాశం ఇప్పిస్తానని కమిట్ మెంట్ అడిగాడంట.. నీకు అవకాశం ఇస్తే నాకేమీ ఇస్తావంటూ నిర్లజ్జగా అడిగేశాడంట. అప్పటికే అనుభవమైన రోహిణి గట్టిగా తిట్టి వచ్చేసిందంట.

ఆ తర్వాత నుంచి ఎక్కడికి ఆడీషన్స్ కు వెళ్లకూడదని నిర్ణయించుకుందంట. తన టాలెంట్ తో వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయ్యి.. ఆడీషన్స్ కు వెళ్లకపోయేదంట. ఆ సమయంలోనే 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' మూవీ ఆడీషన్ అప్పుడు కూడా వెళ్లకూడదని అనుకుందంట. పక్కింటి రిలేటీవ్ ధైర్యం చెప్పడంతో ఆడీషన్ కు వెళ్లి సెలెక్ట్ అయ్యినట్టు చెప్పింది. ఆ సినిమాకు కూడా ఒక్క లెహంగా వోణీలోనే వారంరోజులు షూట్ చేసినట్టు చెప్పుకొచ్చింది. ఇక అక్కడి నుంచి ఎక్కడా కెరీర్ ఆగలేదని చెప్పింది. ఇలా నటీమణులు తమకు ఎదురైనా చేధు అనుభవాలను చెప్పుకొవడంతో ఇంకా కమిట్ మెంట్ భూతాన్ని తరిమే రోజులు ఎప్పుడొస్తాయోనని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Read more about: jabardasth rohini
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X