Jabardasth: నిశ్చితార్థంతో లేడి కమెడియన్ ట్విస్ట్.. త్వరలోనే పెళ్లి.. అబ్బాయి ఎవరంటే?

జబర్దస్త్ లో ఒకప్పుడు అబ్బాయిలే అమ్మాయిల క్యారెక్టర్స్ కనిపించేవారు. ఒక విధంగా అదే కామెడీగా హైలెట్ అయ్యింది. అయితే ఆ షోలో అమ్మాయిలు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు అని ఆరోపణలు కూడా వచ్చాయి. అలాంటి తరుణంలో కొంతమంది లేడీ కమెడియన్స్ ప్రత్యేకంగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక ఆ మధ్యలో సీరియల్స్ ద్వారానే కాకుండా జబర్దస్త్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్న మరో లేడీ కమెడియన్ పెళ్లికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ లో లేడి కమెడియన్స్

జబర్దస్త్ లో లేడి కమెడియన్స్

జబర్దస్త్ లో మొదట లేడీ కమెడియన్సు కు అవకాశాలు ఇచ్చేవారు కాదు అనే ఆరోపణలు అయితే చాలానే వచ్చాయి. లేడీ వేషాలు కూడా మగవాళ్లే వేస్తూ అవకాశాలు రాకుండా చేస్తున్నారు అని కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ క్రమంలో మహిళలకు కూడా అందులో అవకాశాలు ఇప్పించాలి అని నిర్ణయం తీసుకొని కొంతమందికి అవకాశం ఇచ్చారు. అందులో ఫైమా, రోహిణి, సత్య ఇలా కొంతమంది విభిన్నమైన టైమింగ్తో ఆకట్టుకుంటూ వచ్చారు.

 కెవ్వు కార్తిక్ టీమ్ లో..

కెవ్వు కార్తిక్ టీమ్ లో..

అయితే అందరికంటే కాస్త బిన్నంగా జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా మంచి క్రేజ్ అందుకున్న వారిలో శభీనా ఒకరు. ఆమె జబర్దస్త్ లోకి రాకముందే కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. ఇక మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే కొన్ని స్కిట్స్ లో కనిపించిన ఆమె ఆ తర్వాత కొన్ని వారాల పాటు కంటిన్యూగా కెవ్వు కార్తిక్ స్కిట్స్ లో కొనసాగుతూ వచ్చింది.

 సీరియల్స్ నుంచి..

సీరియల్స్ నుంచి..

షబీనా మొదట్లో కస్తూరి అనే సీరియల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత ఆమెకు గృహాలక్ష్మి సీరియల్ లో కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర చేసే అవకాశం లభించింది. ఇక అటువైపు నుంచి కొన్ని రియాలిటీ షోలలో కూడా కనిపిస్తూ వస్తున్నా షబీనా మొత్తానికి జబర్దస్త్ లో కూడా అవకాశం అందుకొని కెవ్వు కార్తిక్ టీం లో మంచి కమెడియన్ గా కొనసాగుతూ వచ్చింది.

నరేష్ తో లవ్ ట్రాక్

నరేష్ తో లవ్ ట్రాక్

కెవ్వు కార్తిక్ టీమ్ లో షభీనా చేసిన కొన్ని కామెడీ స్కిట్స్ అయితే చాలా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పొట్టి నరేష్ తో ఆమె చేసిన హడావిడి అంతా అంతా కాదు. వారి మధ్యలో ఏదో ఉంది అంటూ లవ్ ట్రాక్ కూడా కొనసాగింది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోలలో కూడా వీరిపై అనేక రకాల స్కిట్స్ కూడా చేయడం జరిగింది.

షభీనా ఎంగేజ్మెంట్

షభీనా ఎంగేజ్మెంట్

ఇక మొత్తానికి ఇటీవల షబీనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. గత కొంతకాలంగా ఆమె ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇటీవల కుటుంబ సభ్యులను ఒప్పించి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాడనికి రెడీ అయ్యిందట. గత నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆమె రీసెంట్ గా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

 పెళ్లి కొడుకు ఎవరంటే?

పెళ్లి కొడుకు ఎవరంటే?

ఇక షబీనా పెళ్లి చేసుకోబోతున్న ఆ యువకుడు హైదరాబాద్ లోనే ఉంటాడు అని తెలుస్తోంది. మున్నా అనే ఆ వ్యక్తి కొన్ని వ్యాపారాలతో స్థిరపడినట్లు సమాచారం. ఇక గత మూడేళ్ళుగా అతనితో ప్రేమలో ఉన్న షబీనా ఇటీవల మొత్తానికి ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే వీరి పెళ్లి గ్రాండ్ గా జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి పెళ్లి తర్వాత కూడా షబీనా నటిగా టెలివిజన్ రంగంలో కొనసాగుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X