For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్దస్త్ టీం లీడర్ ఫ్యాక్షన్ ప్రేమ.. చమ్మక్ చంద్ర, రోజా వల్లే...సొంత బావని కిడ్నాప్ చేసి !

  |

  తెలుగు నాట జబర్దస్త్ షో అంటే తెలియని వారు, చూడని వారంటూ ఎవరూ ఉండరు. పైకి విమర్శించినా ఆ షోనే మళ్ళీ చూసి నవ్వుకునే వారున్నారు. అయితే జబర్దస్త్ అంటే మొదట గుర్తొచ్చేది రష్మీ, అనసూయలు. ఆ తర్వాత ఈ షో ద్వారా చాలా మంది ముందుకు వచ్చి నటులుగా ప్రూవ్ చేసుకున్నారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర.. చాలా మంది అనేక టీమ్‌ లు, ఆర్టిస్టులు జబర్దస్త్‌తో పేరు, డబ్బూ సంపాదించుకున్నారు. ప్రస్తుతానికి ఆర్టిస్ట్ లు ఎక్కువ అయిపోవడంతో దీనికి మరో షో యాడ్ చేశారు. దానికి ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరుతో నడుపుతున్నారు. ఇది కూడా మంచి రేటింగ్స్ తెచ్చుకుంటోంది. అయితే ఈ షోలో టీమ్ లీడర్ గా ఉన్న అదుర్స్ ఆనంద్ తన ఫ్యాక్షన్ ప్రేమ, పెళ్లి గురంచి చెప్పుకొచ్చారు. ఆ వివరాలు మీ కోసం..

  మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్

  చంద్ర అదిరిందికి వెళ్ళడంతో

  చంద్ర అదిరిందికి వెళ్ళడంతో

  ఈ జబర్దస్త్ టీమ్ లీడర్ అదుర్స్ ఆనంద్ ముందుగా చమ్మక్ చంద్ర టీమ్ లో పనిచేశాడు. చంద్ర మంచి ఫామ్ లో ఉండగా నాగబాబు జీ తెలుగు అదిరింది షో కి వెళ్లడం, ఆయన వెంట చమ్మక్ చంద్ర వంటి కొందరు సీనియర్లు వెళ్లడంతో అప్పట్లో టీంలకి లీడ్ చేసే వాళ్ళు లేక జబర్దస్త్ నిర్వాహకులు ఆనంద్ లాగా యాక్టివ్ గా ఉన్న వాళ్లను చూసి టీం లీడర్స్ ను చేశారు. అలా చంద్ర అదిరింది వెళ్లడంతో ఆనంద్ కి టీం లీడర్ అవకాశం దక్కింది.

  ఫ్యాక్షన్ రేంజ్ పెళ్లి

  ఫ్యాక్షన్ రేంజ్ పెళ్లి

  ఇక తాను జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర టీంలో చేస్తున్న సమయంలో తన ప్రేమ పెళ్లి, ఒక ఫ్యాక్షన్ సినిమాలాగా సాగిందని ఆనంద్ చెప్పుకొచ్చాడు. తన భార్య ఫోన్ లో పరిచయం అయిందని, అలా ప్రేమించుకుని పెళ్లి చేసుకునే దాకా వెళ్లామని చెప్పుకొచ్చాడు. తన భార్యది అనంతపురం కావడంతో ఆమె తల్లిదండ్రులు కనీసం తనను కలవడానికి కూడా ఒప్పుకోలేదు అని ఈ నేపథ్యంలోనే ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయి ఆమె వచ్చేయడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చాడు.

   సుమోల్లో హైదరాబాద్ కి

  సుమోల్లో హైదరాబాద్ కి

  అయితే తాను సినిమాల్లో పని చేస్తున్నానని సంగతి తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తనను చంపి అయినా ఆమెను తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాదుకు సుమోల్లో వచ్చారని, ఆ సమయంలో తన గురువు చమ్మక్ చంద్ర అలాగే తమ జడ్జి రోజా ఇద్దరు అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. కుర్రవాడు మంచివాడే అని వాళ్లకు సర్ది చెప్పారని ఆనంద్ చెప్పుకొచ్చాడు. అలాగే తన వల్ల ఇబ్బంది పడిన రోజాకి చంద్రకు ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

  రోజా చెప్పినా వినకుండా

  రోజా చెప్పినా వినకుండా


  అయితే వాళ్ళు చెప్పినా సరే తమ భార్య బంధువులు వినలేదని తనకోసం హైదరాబాద్ అంతా గాలిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఒక నెల రోజులు ఎక్కడికైనా వెళ్లిపోవాలని సూచించారని అన్నాడు. అలా తమ సొంత ఊరైన నెల్లూరు వెళ్లి ఒక నెలరోజులు ఉన్నాక లాయర్ల ద్వారా కాంప్రమైజ్ కి వద్దామని ప్రయత్నిస్తుండగా తమ నెల్లూరు అడ్రస్ కూడా తెలుసుకుని తమ ఇంట్లో ఉన్న సొంత బావని కిడ్నాప్ చేశారని చెప్పుకొచ్చాడు. అమ్మాయిని ఇస్తేనే అతన్ని వదులుతామని కండిషన్ పెట్టారని అన్నాడు. ఇదంతా జరిగిన నేపథ్యంలో చివరికి పోలీసులు దగ్గర కూర్చొని కాంప్రమైజ్ కి వచ్చామని చెప్పుకొచ్చాడు.

  Hyper Aadi Skit Not Shown In Popular Comedy Show Latest Episode || Filmibeat Telugu
  దానికి కారణం రోజా, చమ్మక్ చంద్రలే

  దానికి కారణం రోజా, చమ్మక్ చంద్రలే

  అంతా సర్దుకున్నాక పెళ్లి చేస్తామని వాళ్ళు చెప్పారని అయితే తాను నమ్మలేదని చెప్పుకొచ్చాడు. అనంతపురం లో పెళ్లి ఉందని ఫోన్ చేయగా తనకు భయం వేసింది అని అక్కడికి వెళ్ళాక ఏమైనా చేస్తే అనే భయంతో అనంతపురంలో ఉన్న స్నేహితులతో వాకబు చేస్తే అసలు విషయం తెలిసింది అని ఆనంద్ పేర్కొన్నారు. తన భార్య కుటుంబం కూడా చాలా మంచిదేనని కాకపోతే ఇలా సినిమాల్లో చేసే వ్యక్తి కూతుర్ని తీసుకుని వెళ్లి పోతే ఎక్కడో అమ్మేస్తాడు ఏమో అనే భయం వాళ్లను వెంటాడింది అని అందుకే అలా వెంట పడ్డారు అని చెప్పుకొచ్చాడు. తాను తన భార్యతో ఇప్పుడు సుఖంగా ఇప్పుడు ఉన్నానంటే దానికి కారణం రోజా, చమ్మక్ చంద్రలే అని ఆయన చెప్పుకొచ్చాడు.

  English summary
  Jabardasth Adhurs Anand is one of the team leaders in extra jabardasth now. In a recent interview he shared experience of his love and marriage. He thanked roja and chammak chandra for helping in those odd times.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X