‘కమిట్మెంట్ అడిగాడు.. ఆ డైరెక్టర్‌ చెంపలు వాయించా'

సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్, స్టార్‌డమ్, ఫేమ్‌తో మెరిసే రంగుల ప్రపంచం. కానీ, ఆ వెలుగుల వెనుక ఎన్నో కఠిన వాస్తవాలు దాగి ఉంటాయి. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంటే ప్రతిభతో పాటు అదృష్టం, పట్టుదల, పోరాటం కూడా అవసరం. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు దూసుకెళ్తున్న ఈ సమయంలో అవకాశాల కోసం పోటీ మరింత పెరిగింది. ఈ పోటీలో కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు అవకాశాలు అంత ఈజీగా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో "కాస్టింగ్ కౌచ్" అనే సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. ఇలా ఓ జబర్థస్త్ బ్యూటీని ఓ డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారంట, దీంతో ఆ డైరెక్టర్‌ చెంపలు వాయించిందట. ఇంతకీ ఆ డేరింగ్ బ్యూటీ ఎవరు?

ఆ డేరింగ్ అండ్ డ్యాషింగ్ నటి ఎవరో కాదు.. తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు సంపాదించిన ఐశ్వర్య వల్లింగాల (Aishwarya Vullingala). ఇటీవల ఆమె ఇచ్చిన పాత ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న అనుభవాలు, అలాగే సినీ పరిశ్రమలో "కమిట్‌మెంట్" పేరుతో ఎదురైన చేదు సంఘటనలను ఓపెన్‌గా పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్, ఫేమ్, స్టార్‌డమ్ మాత్రమే కనిపించినా, ఆ వెలుగుల వెనుక ఎన్నో సవాళ్లు ఉంటాయని ఐశ్వర్య తన మాటల్లో స్పష్టం చేసింది.

Jabardasth Aishwarya Vullingala Slams Casting Couch Reveals Shocking Throwback Incident

కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు అవకాశాలు సులభంగా రావని, చాలా సందర్భాల్లో వారు అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. ముఖ్యంగా 'కాస్టింగ్ కౌచ్' అనే సమస్య ఇప్పటికీ కొనసాగుతుండటం బాధాకరమని ఆమె పేర్కొంది. తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, మొదట్లో "కమిట్‌మెంట్" అనే పదానికి అసలు అర్థం తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడినట్లు తెలిపింది. నిర్మాతలు లేదా దర్శకులు కమిట్‌మెంట్ గురించి మాట్లాడినప్పుడు.. అది పని పట్ల నిబద్ధతగా భావించి తాను కష్టపడి పనిచేస్తానని చెప్పేదానినని ఆమె వెల్లడించింది.

కానీ తరువాత ఆ పదం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం తెలుసుకున్నప్పుడు తీవ్రంగా షాక్‌కు గురయ్యానని చెప్పింది. ఒకసారి అగ్రిమెంట్‌కు ముందు రోజు, ఓ దర్శకుడు తనపై క్రష్ ఉందని చెప్పి, వ్యక్తిగతంగా కలవాలని ఫోన్ కాల్స్ వచ్చిన సందర్భం గురించి ఆమె వెల్లడించింది. ఆ సమయంలో తనకు విషయం పూర్తిగా అర్థం కావడంతో, వెంటనే ఆ ఆఫర్‌ను తిరస్కరించానని తెలిపింది. మరో సందర్భంలో పరిస్థితి హద్దులు దాటడంతో, ఒక దర్శకుడితో వాగ్వాదం జరిగిందనీ, అతడిని కొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చానని ధైర్యంగా చెప్పింది. అయితే ఆ దర్శకుడి పేరును మాత్రం వెల్లడించడానికి ఆమె నిరాకరించింది.

ఇదే సమయంలో.. ప్రేమ జీవితం గురించి కూడా ఐశ్వర్య భావోద్వేగంగా మాట్లాడింది. "ప్రేమ అనేది చాలా విలువైనది. అలాంటి బంధంలోకి డిజర్వ్ కాని వ్యక్తులు వస్తే అది నిలబడదు" అంటూ తన బ్రేకప్‌కు గల కారణాన్ని చెప్పింది. గతంలో ఒకరిని ప్రాణంగా ప్రేమించినప్పటికీ, పెళ్లి విషయానికి రాగానే ఆ వ్యక్తి వెనక్కి తగ్గాడని వెల్లడించింది. ఆ సంఘటన తనను చాలా బాధపెట్టిందని, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి విషయాలపై దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉండడంలోనే సంతోషంగా ఉన్నానని ఐశ్వర్య స్పష్టం చేసింది. పెళ్లి గురించి ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదని, ముందుగా తన వ్యక్తిగత జీవితాన్ని సెట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. కుటుంబ బాధ్యతలు పూర్తి అయిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని, అది కూడా తన తల్లి నిర్ణయానికి వదిలేస్తానని తెలిపింది.

కెరీర్ విషయానికి వస్తే, తాను ఎప్పుడూ అవకాశాల కోసం ఎవరినీ అడగలేదని, అయినప్పటికీ తన టాలెంట్‌ను చూసి అవకాశాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పింది. డబ్బింగ్ థియేటర్లలో లేదా స్నేహితుల ద్వారా తన క్లిప్స్ చూసి దర్శకులు సంప్రదించిన సందర్భాలు ఉన్నాయని వివరించింది. అయినప్పటికీ ఇప్పటివరకు తనకు సరైన బ్రేక్ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇండస్ట్రీలో మరొక సమస్య గురించి మాట్లాడుతూ, కథ విన్నప్పుడు బాగా అనిపించిన సినిమాలు షూటింగ్ తర్వాత పూర్తిగా మారిపోతాయని చెప్పింది. డైరెక్టర్ విజన్, డీఓపీ పనితనం లేదా ఇతర కారణాల వల్ల తన పాత్రకు సరైన ప్రాధాన్యం రాకపోవడం జరుగుతుందని తెలిపింది. ఈ కారణంగా మంచి అవకాశాలు వచ్చినప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పింది.

Read more about: jabardasth aishwarya tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X