అవినాష్ లవ్ స్టోరీ లీక్: జబర్ధస్త్ కమెడియన్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిసిపోయింది.!

By Manoj

అద్భుతమైన టాలెంట్‌తో అనతి కాలంలోనే విశేషమైన గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు అవినాష్. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన అతడు... జబర్ధస్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు. తనలోని అన్ని విద్యలనూ చూపిస్తూ టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యంలోనే అవినాష్ బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి ఎంటర్ అవుతోన్న సమయంలో తనను ఓ అమ్మాయి వదిలేసి వెళ్లిందని చెప్పాడు. తాజాగా ఈ జబర్ధస్త్ కమెడియన్ లవ్ స్టోరీ, లవర్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

అలా గుర్తింపు.. పేరు కూడా పెట్టేశారు

అలా గుర్తింపు.. పేరు కూడా పెట్టేశారు

ఎన్నో ఈవెంట్లలో మిమిక్రీ ఆర్టిస్టుగా చేశాడు అవినాష్. డైలాగ్ కింగ్ సాయి కుమార్, నారాయణ మూర్తి వాయిస్‌లను బాగా అనుకరిస్తూ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడి, ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులోకి వెళ్లిన తక్కువ సమయంలోనే ముక్కు అవినాష్‌గా ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని సత్తా చాటాడీ కమెడియన్.

జబర్ధస్త్‌గా కెరీర్.. థర్డ్ గ్రేడ్ టీమ్ లీడర్

జబర్ధస్త్‌గా కెరీర్.. థర్డ్ గ్రేడ్ టీమ్ లీడర్


జబర్ధస్త్ ద్వారా ఎవరూ ఊహించని స్థాయిలో గుర్తింపును అందుకున్నాడు ముక్కు అవినాష్. వైవిధ్యమైన మేనరిజమ్‌తో పాటు ఎదుటి వారిపై గుక్క తిప్పుకోకుండా పంచులు పేలుస్తూ మంచి కమెడియన్‌గా ఎదిగాడు. అదే సమయంలో కార్తీక్‌తో కలిసి ఓ టీమ్‌కు లీడర్‌ అయ్యాడు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షోలో థర్డ్ గ్రేడ్ రెమ్యూనరేషన్ అందుకుంటూ సత్తా చాటుతున్నాడు.

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడుగా

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడుగా

జబర్ధస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నాడు అవినాష్. ఈ కారణంగానే మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా అతడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి అతడు మరింత పాపులర్ అవుతున్నాడు.

భారీ చార్జ్.. దానికి తగ్గట్లుగానే చేస్తూ

భారీ చార్జ్.. దానికి తగ్గట్లుగానే చేస్తూ

వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ముక్కు అవినాష్.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అతడు ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే తనదైన టైమింగ్‌తో కామెడీ చేస్తున్నాడు. ఎదుటి వారు నొచ్చుకోకుండా పంచులు పేలుస్తూ హౌస్ మొత్తాన్ని కళకళలాడిస్తున్నాడు.

అవినాష్‌ను వదిలేసిన అమ్మాయి

అవినాష్‌ను వదిలేసిన అమ్మాయి

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ముక్కు అవినాష్‌పై ప్రత్యేకమైన ప్రోమోను రూపొందించింది బిగ్ బాస్ యూనిట్. అందులో తన జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడాతను. అంతేకాదు, తనను ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్లిందని కూడా వెల్లడించాడు. దీంతో అప్పటి నుంచి అవినాష్ ప్రేమించిన అమ్మాయి ఎవరు అనేది చర్చనీయాంశం అవుతోంది.

అవినాష్ లవ్ స్టోరీని లీక్ చేసేశాడు

అవినాష్ లవ్ స్టోరీని లీక్ చేసేశాడు

తన లవ్‌కు సంబంధించిన ఒకే ఒక్క స్టేట్‌‌మెంట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు అవినాష్. అప్పటి నుంచి చాలా మంది గూగుల్‌లో కూడా అతడి గురించి వెతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ తమ్ముడు అజయ్ (ఇతను కూడా జబర్ధస్త్‌లో చేస్తున్నాడు) దీనిపై స్పందించాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన అన్న లవ్ స్టోరీకి సంబంధించిన వివరాలను లీక్ చేసేశాడు.

Recommended Video

Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
అమ్మాయి ఎవరో తెలిసిపోయింది.!

అమ్మాయి ఎవరో తెలిసిపోయింది.!

తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ‘మా అన్నయ్య స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకమ్మాయిని బాగా ప్రేమించాడు. ఎప్పుడూ ఆమె వెంట తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు నేను ఐదో తరగతిలో ఉండడం వల్ల నాకేమీ తెలిసేది కాదు. ఆ తర్వాత చాలా మంది దీని గురించి చెప్పారు. ఆమెనే వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పుడు అన్న బాగా బాధ పడ్డాడు' అని వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X