రోజమ్మ చేసిన సహాయానికి కాళ్ళు మొక్కాల్సిందే..: జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్

బుల్లితెర ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకొంటున్న కార్యక్రమం జబర్దస్త్ కామెడీ షో. ఈ ఖతర్నాక్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చిన కార్యక్రమం గురించి అప్పుడప్పుడు విమర్శలు వచ్చినప్పుటికీ రేటింగ్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఇటీవల ఒక జబర్దస్త్ కమెడియన్ రోజా చేసిన సహాయానికి ఎమోషనల్ అవుతూ మాట్లాడాడు.

జబర్దస్త్ ఆనంద్..

జబర్దస్త్ ఆనంద్..

ఓ వైపు రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్న రోజా జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్నారనే చెప్పాలి. నాగబాబు షో నుంచి దురమైనప్పటికి రోజా మాత్రం అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఆమె కమెడియన్స్ జీవితాలకు ఎంతగా ఉపయోగపడతారో ఇటీవల అదుర్స్ ఆనంద్ ఎమోషనల్ అవుతూ చెప్పాడు.

ఇంతకు మించిన సక్సెస్ మరొకటి ఉండదు.

ఇంతకు మించిన సక్సెస్ మరొకటి ఉండదు.

ఆనంద్ మాట్లాడుతూ.. నేను ఈ స్థాయిలో ఉండడానికి మొదటి కారణం జబర్దస్త్ షో. అవకాశాల కోసం కష్టాలు పడుతున్న సమయంలో మా ఆకలి తీర్చిన మల్లెమాల సంస్థకు అలాగే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతకు మించిన సక్సెస్ మరొకటి ఉండదు. అలాగే నాగబాబు, రాజా గారు కూడా చాలా సహాయం చేశారు.

 ఆమె వల్లే ఇల్లు, పెళ్లి..

ఆమె వల్లే ఇల్లు, పెళ్లి..

రోజాగారు నాకు ఒక దేవత. రోజమ్మ చేసిన సహాయం వల్ల నా లైఫ్ మరో స్థాయికి వెళ్లింది. చిన్న పాత్రలు వేసుకుంటున్నప్పుడు టీమ్ లీడర్ గా మార్చారు. ఆ తరువాత పర్సనల్ లైఫ్ లో కూడా ఆమె ఎంతగానో సహాయం చేశారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆమె చాలా సపోర్ట్ చేశారు. అలాగే నాకు ఒక ఇల్లు ఉందంటే అందుకు కారణం కూడా రోజా గారే అంటూ..ఈ సందర్భంగా ఆమెకు పాదాభివందనం తెలియజేస్తున్నానని ఆనంద్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
అనసూయా, రష్మీ కూడా..

అనసూయా, రష్మీ కూడా..

అలాగే జబర్దస్త్ యాంకర్స్ గురించి మాట్లాడుతూ.. జబర్దస్త్ షోలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే అనసూయా, రష్మీ ఇద్దరు కూడా చాలా మంచి వారు. ఎప్పుడైనా వారిపై జోకులు, పంచ్ లు వేసినా కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పారు. వారు కూడా జబర్దస్త్ కమెడియన్స్ కి ఎంతగానో సపోర్ట్ చేస్తారు అంటూ ప్రతి ఎపిసోడ్ ని మరో లెవెల్ కి తీసుకు వెళ్ళడానికి వారు చేసే కృషి చాలానే ఉంటుందని ఆనంద్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X