స్టేజ్ మీదే భార్య కాళ్లు పట్టుకొన్న జబర్దస్త్ కమెడియన్.. కిందకు తోసిన మరో కమెడియన్ భార్య!
సుమ యాంకర్ గా నడిచే క్యాష్ ప్రోగ్రాం గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో సుమ కనకాల యాంకరింగ్ లో వస్తున్న క్యాష్ ప్రోగ్రాంకి ఎక్కువ జబర్దస్త్ ఆర్టిస్టులు, ఇతర సినీ నటులను తీసుకు వస్తూ ఉంటారు. అలాగే తాజాగా సుమా క్యాష్ ప్రోగ్రాంలో నలుగురు జబర్దస్త్ కమెడియన్ లు తమ భార్యలతో కలిసి వచ్చారు. వారెవరో కాదు ఆనంద్, కొమరం, సత్తిపండు, శాంతి కుమార్.. ఈ సందర్భంగా ఆనంద్ తన భార్యకు భయపడి ఆమె కాళ్లు ఒత్తగా, సత్తిపండు భార్య పై నుంచి సత్తి పండును తోయడానికి సిద్ధపడింది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రేమించి పెళ్లి
జబర్దస్త్ లో నటీనటుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ దక్కించుకున్న నటీనటులు తర్వాత సినిమా అవకాశాలు కూడా దక్కించుకుని అటు వైపు మళ్లుతున్నారు. ఇక జబర్దస్త్ ఆనంద్ ప్రేమ కథ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అనంతపురానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో తన ప్రేమ కథను ఆనంద్ బయట పెట్టడంతో అది బాగా వైరల్ అయింది.

ప్రేమించి పెళ్లి
ఇక ఆనంద్ తాజాగా తన భార్యతో కలిసి క్యాష్ షో లో పాల్గొన్నారు. క్యాష్ షోలో భాగంగా సుమ ఒక టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ ఏమిటంటే భార్య చేత భర్తలు కాళ్లు నొక్కించుకోవాలని కోరుతుంది, అందులో భాగంగా కొమురం మొదట తన భార్య రజితతో కాళ్ళు వత్తించుకుంటాడు. 13 ఏళ్ళు అయింది పెళ్లి అయి, ఇప్పుడు ఇన్నాళ్ల పాటు లేనిది సుమక్క పుణ్యమా అని కుదిరింది ఇంకా నొక్కు నొక్కు అంటూ తన భార్యతో పరాచికాలు ఆడుతాడు.

కాళ్ళు నొక్కడం
ఇక అదే సమయంలో ఆనంద్ కూర్చుని ఏమేయ్ అంటూ తన భార్యని పిలవడంతో ఆమె సీరియస్ అవుతుంది. అయినా సరే షో కావడంతో తమాయించుకుని అక్కడికి వచ్చి ఏంటి ఆనంద్ అని అడగడంతో ఆమెది అసలే అనంతపురం వాళ్ల వాళ్లను తీసుకు వస్తదో ఏంటో అంటూ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు. ఆనంద్ పైకి లేచి ఆమెను తన స్థానంలో కూర్చోబెట్టి ఆమె కాళ్ళు నొక్కడం ప్రారంభించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

దూకేలా చేస్తా
తర్వాత మరో కమెడియన్ సత్తిపండు తన భార్య తన కాళ్ళు మొక్కడం కాదు ఏకంగా ఇక్కడి నుంచి దూకేలా చేస్తాను అంటాడు. ఆమెను దూకమని చెబుతూ క్యాష్ స్టేజి మీద వస్తువులు పెట్టే ఎస్కలేటర్ మీదకు తీసుకు వెళ్లి నిలుచోబెడతాడు.

సోషల్ మీడియాలో వైరల్
అయితే దానికి సీరియస్ అయిన ఆయన భార్య నాగమాంబ అయ్యో నాకు దూకడం రాదండి మీరు ఒకసారి దూకి చూపించండి అంటూ ఆయనను అక్కడి నుంచి తోయడానికి ప్రయత్నిస్తుంది. అలా ఈ మొత్తం ఎపిసోడ్ కూడా ఇలా ఆసక్తికరంగా సాగింది. తాజాగా విడుదలైన ఈ క్యాష్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











