For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్దస్త్ ఆనంద్ భార్య హీరోయిన్స్ కంటే అందంగా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ.. రోజా సపోర్ట్!

  |

  బుల్లితెరకు సంబంధించిన కొంతమంది నటీనటులు పర్సనల్ లైఫ్ పైకి కనిపించినంత రంగుల ప్రపంచంలా ఉండదు. నిత్యం పోటీ ప్రపంచంలో యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న జబర్దస్త్ ఆనంద్ కూడా అలానే కష్టపడి పైకి వచ్చాడు. రీసెంట్ గా అతను తన ఫ్యామిలీని చూపించాడు. భార్య, పిల్లల్ని కూడా కెమెరా ముందుకు తేవడంతో నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక అతని లవ్ స్టోరీ గురించే తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

  సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా

  సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా

  కెమెరా ముందు ఎంత ఆకట్టుకున్నా కూడా తెరవెనుక మాత్రం నటీనటులు వారి జీవితాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు చాలెంజ్ లు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చే వారి కష్టం అంతా ఇంతా కాదు. జబర్దస్త్ ఆనంద్ కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. స్కూల్ డేస్ నుంచే చిన్న తరహా స్కిట్స్ వేసుకుంటూ వచ్చాడు.

  ఒక ఇల్లు కట్టుకొని

  ఒక ఇల్లు కట్టుకొని

  జబర్దస్త్ కు వచ్చిన తరువాత కూడా ఆనంద్ కు అంత ఈజీగా ఛాన్సులు దక్కలేదు. ఎన్నో రోజులు ప్రయత్నిస్తే గాని వర్కౌట్ కాలేదట. చివరికి చమ్మక్ చంద్ర అతన్ని నమ్మి గ్రూప్ లో చేర్చుకోవడంతో టీమ్ లీడర్ అయ్యే వరకు వచ్చాడు. అతని సంపాదనతో ప్రత్యేకంగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు.

  ప్రత్యేకంగా యూ ట్యూబ్ ఛానెల్

  ప్రత్యేకంగా యూ ట్యూబ్ ఛానెల్

  ప్రత్యేకంగా ఒక యూ ట్యూబ్ ఛానెల్ సెట్ చేసుకున్న ఆనంద్ అందులో తన పర్సనల్ విషయాలను అలాగే విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. ఇక ఇటీవల తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశాడు. అందులో భార్య పిల్లలను కూడా పరిచయం చేశాడు.

  అందమైన భార్యతో ఆనంద్

  అందమైన భార్యతో ఆనంద్

  తన భార్యను వీడియో ద్వారా మొదటిసారి పరిచయం చేయడంతో నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. మీ భార్య హీరోయిన్స్ కంటే తక్కువేమి కాదు. చాలా అందంగా ఉన్నారు అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక తన ఇద్దరు కొడుకులు కూడా పరిచయం చేయగా వారు కూడా చాలా క్యూట్ గా ఉన్నట్లు ఫాలోవర్స్ ప్రశంసలు కురిపించారు.

  ఫేస్ బుక్ లవ్.. గొడవలు

  ఫేస్ బుక్ లవ్.. గొడవలు

  ఇక గత ఇంటర్వ్యూలలో ఆనంద్ తన పెళ్లి చాలా విచిత్రంగా టెన్షన్ గాను జరిగినట్లు చెప్పాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెరిగి ఆ తరువాత ఒకరినొకరిని ఇష్టపడినట్లు చెప్పాడు. అయితే వాళ్ళది అనంతపురం కావడంతో మొదట ఇంట్లో ఒప్పుకోలేదని చాలా సుమోలతో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ రేంజ్ లో ఇంటికి కూడా కోపంగా వచ్చారని చెప్పాడు.

  రోజా గారు సపోర్ట్ చేశారు

  రోజా గారు సపోర్ట్ చేశారు

  మొదట రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్న తరువాత రెండు నెలల వాళ్ళకు దూరంగా ఉన్నాను అంటూ ఆ సమయంలో చమ్మక్ చంద్ర అలాగే మేడం రోజాగారు కూడా ఎంతగానో సపోర్ట్ చేసినట్లు ఆనంద్ వివరణ ఇచ్చారు. అయితే ఆ గొడవలు అయిన సమయంలో అనవసరంగా వీళ్ళందరిని ఇబ్బంది పెడుతున్నానేమోనని అనిపించిందని కూడా ఆనంద్ తెలియజేశాడు.

  English summary
  The personal lives of some of the actors associated with television are not as colorful as they seem on the surface. The ever-competitive world must continue to wage war. Jabardast Anand, who received a special recognition of his own, also came up with the same hard work. Recently he showed his family. Followers are commenting positively as the camera brings his wife and children as well. Anyone who knows about his love story should be shocked.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X