అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం వెనుక ఆ స్టార్ డైరెక్టర్ ప్లాన్.. అసలు కారణమిదే!
జబర్దస్త్ తో మంచి క్రేజ్ అందుకున్న అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత సినిమాలలో కూడా మంచి నటనతో తన స్థాయిని మరింత పెంచుకుంది. ఎలాంటి సినిమాలు చేసిన కూడా అందులో తన పాత్ర రొటీన్ గా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. రాబోయే చిత్రాలతో ఆమె మరింత క్రేజ్ అందుకునేలా ఉంది అనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్లిపోవడానికి అసలు కారణం ఏమిటి అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video


గ్లామర్ తో క్రేజ్
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న అనసూయ భరద్వాజ్ ఒక విధంగా తన గ్లామర్ తో కూడా షోకు మంచి రేటింగ్స్ కూడా అందించింది అని చెప్పవచ్చు. ఒకవైపు కమెడియన్స్ వారి యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తుంటే మరొకవైపు అనసూయ తన గ్లామర్ తో కూడా ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది.

సినిమాల్లో కూడా బిజీగా..
జబర్దస్త్ ముందు వరకు కూడా అనసూయ భరద్వాజ్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. అక్కడక్కడ కొన్ని చిన్న సినిమాల్లో కనిపించినప్పటికీ జబర్దస్త్ తర్వాత మాత్రం ఆమె స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం టెలివిజన్ షో లు మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్స్ అలాగే కొన్ని ప్రత్యేకమైన పాత్రలలో కనిపిస్తూ వచ్చింది అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేసుకుంటూ వచ్చింది.

రంగస్థలం, పుష్ప సినిమాల్లో..
నిత్యం సోషల్ మీడియాలో కూడా అనసూయ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె గ్లామర్ ట్రీట్ తోనే ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తుంది. అయితే అనసూయ వెండితెరపై కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. రంగస్థలం పుష్ప సినిమాల్లో ఆమె నటించిన విధానంతో ఒక్కసారిగా స్థాయి కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆమె కూడా ఒకరు.

జబర్దస్త్ ద్వారా మంచి ఆదాయం
అయితే అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె జబర్దస్త్ షోను ఏమాత్రం వదిలి పెట్టకూడదు అని అనుకుంది. షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ కామెడీ షోను కూడా కాంటిన్యూ చేసింది. ఎందుకంటే జబర్దస్త్ ద్వారానే అనసూయ దాదాపు ఒక్కరోజు ఎపిసోడ్ కోసం లక్షకు పైగా తీసుకుంటున్నట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

వేశ్య పాత్రలో..
సినిమాల్లోకి వచ్చినా రాకపోయినా కూడా జబర్దస్త్ తో కాలాన్ని వెళ్లదీస్తున్న అనసూయ ఇటీవల మాత్రం ఒక దర్శకుడు సలహా మేరకు ఆ కామెడీ షోకు దూరమైనట్లు సమాచారం. ఎందుకంటే ప్రముఖ దర్శకుడు క్రిష్ ఇటీవల ఒక నవల ఆధారంగా చేయబోయే వెబ్ సిరీస్ కోసం అనసూయను సెలెక్ట్ చేసుకున్నారట. అందులో ఆమె ఒక వేశ్య పాత్రలో కనిపించబోతోంది.

అందుకే జబర్దస్త్ కు దూరం?
అయితే ఆ వేశ్య పాత్ర కోసం అనసూయ చాలా రోజులు షూటింగ్లోనే ఉండాల్సి ఉంటుందట. కాబట్టి జబర్దస్త్ నుంచి బయటకు రావడమే బెస్ట్ అని దర్శకుడు సలహా ఇవ్వడంతో ఆమె పెద్దగా ఆలోచించకుండానే వెనుకడుగు వేసినట్లు సమాచారం. త్వరలోనే సోని లీవ్ లో మొదలయ్యే ఆ వెబ్ సీరీస్ కోసం అనసూయ ముందుగానే వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతోందట. నటన విషయంలో కూడా అనే కొన్ని మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరీ దర్శకుడు ఆమెను ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











