Anasuya Bharadwaj: కాళ్లు పైకెత్తి తలకిందులుగా అనసూయ.. నెవ్వర్ బీఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ ఫోటో ఇదే!

జబర్దస్త్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పుడూ తన అందాలతో నెటిజన్స్ ను, అభిమానులను ఆకట్టుకునేందుకు తన హాట్ అందాల ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ నెవ్వర్ బీఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ ఫోటోను షేర్ చేసింది. అందం కోసం అనసూయ పడే పాట్లను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అనసూయ జిమ్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

జబర్దస్త్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది. తన అందంతో మాటలతో తెలుగు వారికి సుపరిచితం అయింది. ఇక సినిమాల్లోకి ఎంటర్ అయి బిజి బిజిగా మారిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా తర్వాత ఆమె ఫేట్ మారిపోయింది. పుష్ప సినిమాతో మరో మెట్టు ఎక్కింది. ఇక పూర్తి స్థాయి సినిమాలకే తన లైఫ్ అనుకుని.. బుల్లితెరకు గుడ్ బై చెప్పి.. వెండితెరపై సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది.

 Jabardasth Anchor Anasuya Bharadwaj Bold Gym Photo Viral in Social Media

ఇక అటు అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటుంది. ఇక ఎవరైన తనరపై విమర్శలు చేస్తే.. తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంది ఈ భామ. బుల్లితెరకు దూరమై సినిమాల్లో బిజీ అయిన అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన అందాల హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. తన వ్యక్తి గత విషయాలతో పాటు.. రోజుకో ఫోటో షూట్ చేస్తూ వదులుతోంది.

 Jabardasth Anchor Anasuya Bharadwaj Bold Gym Photo Viral in Social Media

ఇక తాజాగా జిమ్‌ లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ఒకటి అనసూయ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 'నవంబర్ 29, 2023 సరిహద్దులు దాటి ముందుకు వెళ్లిన రోజుగా గుర్తుండిపోతుంది అనే క్యాప్షన్ ఇచ్చి ఈ పోస్టును అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫోటోల్లో తాడుకి వేలాడుతూ తలకిందులుగా అనసూయ ఓ బోల్డ్ ఫీట్ చేసింది. ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అనసూయ అందం కోసం పడుతున్న పాట్లు చూసి.. కొంత మంది పాజిటివ్ కామెంట్స్ చేయగా.. మరికొంత నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అందంత కోసం ఇంత పాట్లు అవసరమా అంటున్నారు కొంత మంది. ఇక అనసూయ ఏరియల్ యోగ చేస్తారని చెప్పుకువచ్చింది. దాంతో పాటు లేత కొబ్బరికాయ తింటారని ఓ ఫోటో పెట్టింది. ప్రస్తుతం అనసూయ పోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనసూయ పోస్టుకి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 Jabardasth Anchor Anasuya Bharadwaj Bold Gym Photo Viral in Social Media

ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బిజీగా గడుపుతుంది ఈ బ్యూటీ. ఇప్పటికే మైఖేల్, రంగ మార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఇక పుష్ప 2 లో నటిస్తుంది. దానితో పాటు.. ప్రభుదేవ వుల్ఫ్ కాకుండా మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X