twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ అనసూయతో జబర్దస్త్ కామెడీయన్ సినిమా.. ఆ సీన్స్ హైలెట్ అయ్యే విధంగా..

    |

    టెలివిజన్ రంగంలో బ్యూటిఫుల్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ భరద్వాజ్ నటనతో కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల కాలంలో ఆమె సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేసినా కూడా చాలా హైలెట్ గా అవుతున్నాయి. కేవలం చిన్న సినిమాలతో మాత్రమే కాకుండా స్టార్ హీరోలతో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అంతేకాకుండా యాంకర్ అనసూయ పలు సినిమాల్లో మెయిన్ లీడ్ లో కూడా నటిస్తోంది.

    అయితే ఆమె ఇటీవల ఒక జబర్దస్త్ కమెడియన్ తో డిఫరెంట్ జానర్ లో సినిమా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

    మొదట సైడ్ క్యారెక్టర్స్ లో

    మొదట సైడ్ క్యారెక్టర్స్ లో

    మొదట తెలుగు చిత్ర పరిశ్రమలో సైడ్ క్యారెక్టర్స్ లో నటించిన యాంకర్ అనసూయ ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి తన కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే దక్కించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో తో ఆమెకు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ తర్వాత యాంకర్ అనసూయ ఇతర ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో కూడా మంచి అవకాశాలను అందుకుంది.

    సోషల్ మీడియాలో..

    సోషల్ మీడియాలో..

    అనసూయ ఎలాంటి షోలో యాంకర్ గా చేసినా కూడా అందులో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె కోసమే ప్రత్యేకంగా ఓ వర్గం ప్రేక్షకులు టెలివిజన్ షోలను కూడా చూస్తారు అని చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో కూడా యాంకర్ అనసూయ స్థాయి రోజు రోజుకు మరింత పెరుగుతుంది అని చెప్పాలి. రెగ్యులర్ గా ఆమె గ్లామరస్ ఫోటోలతో నిత్యం ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

    ఆ సినిమా నుంచి..

    ఆ సినిమా నుంచి..

    ఇక రంగస్థలం సినిమా నుంచి యాంకర్ అనసూయకు రేంజ్ కూడా అమాంతంగా పెరిగి పోవడంతో ఆమె అవకాశాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక మరోసారి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో కూడా ఆమె విభిన్నమైన పాత్రలో కనిపించడంతో మరింత పాపులర్ అయింది.

    అనసూయ కొత్త సినిమా

    అనసూయ కొత్త సినిమా

    ఇక ప్రస్తుతం ఆమె కొంతమంది కమెడియన్స్ తో కలిసి ఒక ప్రత్యేకమైన సినిమాలో నటిస్తోంది. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో అనసూయ మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించబోతొంది. ఈ సినిమాలో పలువురు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు నటిస్తున్నారు.

    చమ్మక్ చంద్రతో..

    చమ్మక్ చంద్రతో..

    ఇక ఈ సినిమా పై వివరణ ఇచ్చిన నిర్మాత ముఖ్యంగా జబర్దస్త్ కామెడీయన్ చమ్మక్ చంద్ర, అనసూయ మధ్యలో వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అవుతాయని ఆ సీన్స్ చూసి తప్పకుండా ఆడియన్స్ నవ్వుకుంటారు అని తెలియజేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతంకి పైగా పూర్తయిందని. ఇక మిగిలిన షూట్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసే త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాత వివరణ ఇచ్చారు

    English summary
    Jabardasth anchor Anasuya Bharadwaj comedy film with comedians..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X