twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ అనసూయ బాలీవుడ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ డోస్ పెంచిందట?

    |

    జబర్దస్త్ యాంకర్ అనసూయ తెలుగు ఆడియెన్స్ లో ఎలాంటి క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యాంకర్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెప్పిన ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతోంది. రంగమ్మత్తగా ఇక బ్రాండ్ ఇమేజ్ అందుకున్న అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. ముందుగా హిందీలో ఒక వెబ్ సిరీస్ ద్వారా ఛాన్స్ అందుకొని అటు నుంచి బాలీవుడ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆలోచిస్తోందట.

    Recommended Video

    Jabardasth Anchor Anasuya Hindi Web Series | Filmibeat Telugu

    మొరిగే కుక్కలు.. అనసూయ మరో వివాదాస్పద ట్వీట్.. మళ్లీ భగ్గుమన్న ఫ్యాన్స్మొరిగే కుక్కలు.. అనసూయ మరో వివాదాస్పద ట్వీట్.. మళ్లీ భగ్గుమన్న ఫ్యాన్స్

    హాట్ యాంకర్..

    హాట్ యాంకర్..

    ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం వారి మాటలతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేవారు. కానీ అనసూయ భరద్వాజ్ వచ్చిన తరువాత గ్లామర్ తో కూడా ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. బుల్లితెరపై కూడా ఇలా కనిపించవచ్చా అని అందరిని ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై కూడా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

    బాలీవుడ్ ప్రయత్నాలు..

    బాలీవుడ్ ప్రయత్నాలు..

    క్షణం, రంగస్థలం వంటి సినిమాలో అనసూయ బిగ్ స్క్రీన్ పై తన యాక్టింగ్ స్కిల్స్ తో ఒక స్పెషల్ మ్యాజిక్ క్రియేట్ చేసింది. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా మెప్పించగలనని నిరూపించిన అనసూయ ప్రస్తుతం బాలీవుడ్ సైడ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ రోల్స్ ద్వారా నార్త్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని అడుగులు వేస్తోంది.

    ముందుగా వెబ్ సిరీస్..

    ముందుగా వెబ్ సిరీస్..

    బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకోవాలి అంటే గ్లామర్ రోల్స్ కి సిద్ధంగా ఉండాలనే ఒక టాక్ ఉంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ముందుగా అనసూయ నార్త్ జనాలను ఆకట్టుకోవడానికి వెబ్ సిరీస్ ద్వారా తన ప్రయత్నాలను కొనసాగించనుందట. ఇప్పటికే ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

    డబుల్ పేమెంట్స్..

    డబుల్ పేమెంట్స్..

    బాలీవుడ్ లో చిన్న ఆఫర్ వచ్చినా చాలు.. రెమ్యునరేషన్ విషయంలో ప్రమోషన్స్ వచ్చినట్టే. లోకల్ గా వచ్చే పేమెంట్స్ కంటే ఎక్కువగా అక్కడ డబుల్ పేమెంట్స్ అందుతాయి. ఇక నెక్స్ట్ హిందీ ఆఫర్స్ ద్వారా అనసూయ కూడా తన రెమ్యునరేషన్ డోస్ పెంచనుందట. పాత్రను బట్టి పెమెంట్ డోస్ పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి అనసూయ హిందీ ఆడియెన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

    English summary
    Anasuya has set a brand for herself as a Tollywood actor. Next Krishnawansi is directing Rangamarthanda movie to sell the film. Anasuya is now appearing as a class Audience in Krishnavansi cinema. Anusuya's excellent performance in some scenes in the temple will give the audience a new kick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X