Rashmi Gautam: బిజినెస్ మ్యాన్‌తో పెళ్లికి రెడీ అయిన జబర్దస్త్ యాంకర్ రష్మి... షాక్‌లో సుధీర్ ఫ్యాన్స్
జబర్దస్త్ ప్రోగ్రామ్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన బ్యూటీ రష్మి. ఇక ఈ కామెడీ షోతో సినిమాల్లో కూడా ఆఫర్లు అందుకుంది. అలా సినిమాలు చేసి.. సక్సెస్ అయింది. ఇక బుల్లితెరపై వెండితెరపై దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. అది కూడా ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడనుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోయిన్ కావాలని తెలుగు సినీ పరిశ్రమకు వచ్చింది రష్మీ గౌతమ్. అలా కెరియర్ బిగినింగ్ లో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. క్రేజ్ కొట్టేసింది. ఇక హీరోయిన్ ఫ్రెండుగా... పలు సినిమాల్లో నటించింది. అయితే అంతగా పెద్ద ఛాన్సులు రాకపోవడంతో... మళ్లీ యాంకరింగ్ వైపు మళ్లింది. అలా బుల్లితెరపై అప్పటికే జనాలను ఎంటర్ టైన్ చేస్తున్న జబర్దస్త్ షోలో అనసూయకు పోటీగా దిగింది. ఇక అక్కడి నుంచి రష్మి ఫేట్ మారిపోయిందనే చెప్పాలి.

యాంకర్ అనసూయకు పోటీగా రష్మి... కూడా యాంకరింగ్ లోకి దిగి... హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక సుడిగాలి సుధీర్ తో ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఫుల్ గా వర్క్ అవుట్ అవ్వడంతో మరితం పాపులర్ అయింది. సుధీర్ రష్మి అద్భుతమైన రొమాన్స్ బుల్లితెరపై కురిపించారు. డాన్సులు, పెళ్లి స్కిట్స్ లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. సుధీర్-రష్మీ నిజ జీవితంలో కూడా లవర్స్ అని జనాలు గట్టిగా నమ్మేంతగా వారి లవ్ ట్రాక్ నడిచింది.
అందుకే వీరిద్దరిలో ఎవరు మీడియా ముందుకు వచ్చినా వీరి లవ్ మ్యాటర్ గురించి అడుగుతారు. అయితే అదందా స్కిట్ లో భాగమే అని చెప్పుకువస్తారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలింగ్ సహస్ర మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా సుధీర్ మీడియా సమావేశంలో రష్మి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి ఎప్పుడు? రష్మీనే చేసుకుంటారా? అంటూ ప్రశ్నలు కురిపించారు మీడియా పర్సన్.

ఇక సుధీర్ కూడా పెళ్లి చేసుకోలేదు.. వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని చాలా మంది అనుకున్నారు. అయితే మీడియా ప్రశ్నలకు సుధీర్ రష్మిలు ఎప్పుడు తాము ఫ్రెండ్స్ అంటూ చెప్పుకువచ్చారు. కానీ చాలా మంది వీరు పెళ్లి చేసుకుంటే చూడాలి అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. రష్మీకి వివాహం అంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఒడిశా అమ్మాయి రష్మి. అలా ఆ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకారం చెప్పుకున్నారట. అంతే కాదు... త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. గతంలో కూడా రష్మీ పెళ్లిపై అనేక రూమర్స్ వచ్చాయి ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న సుధీర్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రష్మి పెళ్లి వార్త హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











