రష్మీ గౌతమ్‌తో గేమ్స్ లాడొద్దు! జబర్దస్త్‌ను మించిన ఖతర్నాక్ షో.. బుల్లితెరపై ఫస్ట్‌టైం!
టెలివిజన్, సినీ రంగాల్లో తనదైన శైలిలో ఆకట్టుకొంటున్న టాప్ యాంకర్ రష్మీ గౌతమ్ సరికొత్తగా దర్శనమివ్వబోతున్నారు. ఇప్పటి వరకు వినోద రంగానికే పరిమితమైన టాప్ యాంకర్.. ఇప్పుడు క్రీడా రంగంలోకి అడుగుపెడుతున్నారు. క్రీడాభిమానులకు, ఔత్సాహికులకు స్పూర్తిని అందించే కార్యక్రమానికి హోస్ట్‌గా రష్మీ గౌతమ్ కొత్త పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షో గురించి మరిన్నీ వివరాలు...

ఎంటర్‌టైన్‌మెంట్ టూ స్పోర్ట్స్ రంగానికి
ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్‌పై రష్మీ గౌతమ్ తన గ్లామర్‌తో ఆకట్టుకొన్నారు. జబర్దస్త్‌లో మాటల గారడీ, సుధీర్‌తో కెమిస్ట్రీని పండిస్తూ కామెడీ షోను ఖతర్నాక్‌గా మలిచారు. పలు టెలివిజన్ షోలతో టాప్ గ్లామరస్ యాంకర్‌గా రష్మీ తన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. ఇప్పుడు వినోద రంగంతోపాటు క్రీడా రంగంలో తొలి యాంకర్‌గా మరో ఘనతను సొంతం చేసుకొన్నారు.

స్పోర్ట్స్‌లో బ్రాండ్ న్యూ షోతో రష్మీ
తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు విభిన్నమైన బ్రాండ్ న్యూ షోకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. బాలికలు, మహిళా శక్తి,ని చాటిచెప్పే విధంగా సరిలేరు మనకెవ్వరు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు తెలుగు క్రీడా రంగంలో గొప్ప రికార్డులను, చరిత్రను సృష్టించిన మహిళా క్రీడాకారుల మనోభావాలను తెలుసుకొనే సరికొత్త షోకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

సరిలేరు మాకెవ్వరు షో హోస్ట్‌గా
రష్మీ గౌతమ్ కొత్తగా ప్రారంభించే షో పేరు సరిలేరు మనకెవ్వరు.. దేర్ ఈజ్ నో మ్యాచ్ ఫర్ అస్ టైటిల్‌తో స్పోర్స్ ప్రొగ్రాం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. దేశం, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వారి జీవితాలను, కష్టాలను, ఆనంద క్షణాలను ఆవిష్కరించనున్నట్టు స్టార్ స్పోర్ట్స్ టెలివిజన్ ఛానెల్ నిర్వాహకులు చెప్పారు.

మిథాలి రాజ్ తొలి గెస్టుగా
సరిలేరు మాకెవ్వరు షో గురించి స్టార్ స్పోర్ట్స్ తెలుగు నిర్వాహకులు మాట్లాడుతూ.. ఇప్పటికే వినోద రంగంలో టాప్ యాంకర్ రష్మీ గౌతమ్‌ను హోస్ట్‌గా పరిచయం చేస్తున్నాం. తొలి గెస్టుగా భారతీయ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను పరిచయం చేస్తున్నాం అని నిర్వాహకులు తెలిపారు.
Recommended Video

మిథాలీ రాజ్ గురించి
తెలుగు టెలివిజన్ రంగంలో ఇంత వరకు రాని ఓ బ్రాండ్ న్యూ షోలో పాల్గొనడానికి మిథాలీ రాజ్ అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. గత 20 ఏళ్లుగా క్రికెట్ రంగానికి ఆమె సేవలందిస్తూ వస్తున్నారు. ప్రపంచ మహిళ క్రికెట్‌లో వన్డేలలో అత్యధికంగా 6808 పరుగుల చేసిన ఏకైక క్రికెటర్‌గా మిథాలీ రాజ్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటి వరకు 200 వన్డేలు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్. అలాంటి క్రికెటర్‌తో మా కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా ఫీలవుతున్నామని స్టార్ స్పోర్ట్స్ నిర్వాహకులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











