‘జబర్దస్త్’ యాంకర్‌ను ఆటపట్టించిన బాలకృష్ణ (ఫోటోలు)
హైదరాబాద్: ఈటీవీలో ప్రసారం అవుతున్న 'జబర్దస్త్ కామెడీ షో' అనే కార్యక్రమానికి యాంకరింగు చేస్తున్న రష్మి గేరించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెక్సీగా, చలాకీగా యాంకరింగు చేస్తూ ఈ కామెడీ ప్రోగ్రాంకి గ్లామర్ టచ్ ఇస్తోంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో ప్రేక్షకులను కవ్విస్తోంది. రష్మి కేవలం యాంకర్ మాత్రమే కాదు, జబర్దస్త్ కంటే ముందే ఆమె పలు చిత్రాల్లో నటించింది.
అయితే రష్మికి బాగా గుర్తింపు, పాపులారిటీ వచ్చింది మాత్రం 'జబర్దస్త్' కార్యక్రమమే అని చెప్పక తప్పుదు. ఈ కార్యక్రమం వల్లనే ఆమె సెలబ్రిటీ హోదా సొంతం చేసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా.....పాపులారిటీ ఉన్నపుడే ఫాలోయింగ్ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్న రష్మి.....సోషల్ నెట్వర్కింగు ద్వారా హాట్ ఫోటోలు, ఆసక్తికర ఫోటోలు పోస్టు చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.
తాజాగా ఆమె బాలకృష్ణ తనను ఆటపట్టిస్తున్నట్లు ఉన్న ఫోటోను పోస్టు చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు మరిన్ని వివరాలు స్లడ్ షోలో...

బాలకృష్ణతో రష్మి
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణతో కలిసి విదేశాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేష్మి. రేష్మిని సరదాగా ఆటపట్టిస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో ఇపుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

రష్మి లుక్
యాంకరింగు, నటన మాత్రమే కాకుండా మోడలింగు రంగంలో కూడా రష్మి పని చేసింది. రష్మికి సంబంధించిన హాట్ లుక్ ఫోటో.

రోజాతో కలిసి
జబర్దస్త్ కార్యక్రమంలో నటి రోజాతో కలిసి స్టెప్పులేస్తున్న యాంకర్ రష్మి.

ముద్దు మద్దుగా...
రష్మి ఏప్రిల్ 7, 1989లో ఒరిస్సాలో జన్మించింది. ఆమె వయసు 24 సంవత్సరాలు. మోడలింగ్ రంగం నుండి ఎంటర్టెన్మెంట్స్ రంగం వైపు అడుగులు వేసిన రష్మి యాంకర్‌గా, నటిగా తన ప్రస్తానం సాగించింది.

సినిమాలు
రష్మి ఇప్పటి వరకు పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. తమిళం, కన్నడలో కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఆమె థాంక్స్, కరెంట్, గణేష్ జస్ట్ గణేష్, బిందాస్, ప్రస్తానం చిత్రాల్లో నటించింది. కన్నడలో గురు అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

టీవీ షోలు...
2007లో ‘యువ' అనే టీవీ కార్యక్రమంలో రష్మి నటించింది. ఆ తర్వాత తెలుగులో ‘జబర్దస్త్ కామెడీ షో'లో యాంకరింగు చేస్తోంది. సూపర్ కుటుంబం అనే కార్యక్రమానికి కూడా యాంకరింగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











