rashmi gautam : పిల్లలు కావాలంటే పెళ్లే చేసుకోవాలా .. యాంకర్ రష్మీ బోల్డ్ కామెంట్స్
దాదాపు దశాబ్ధానికి పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది జబర్దస్త్. ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్ ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న ఈ షో.. కామెడీ కార్యక్రమాలలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దీనిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని పలు ఛానెల్స్‌లో ఇదే తరహాలో షోలు వచ్చినా అవేవీ జబర్దస్త్‌ను టచ్ చేయలేకపోయాయి. నేటికీ భారీ టీఆర్పీలతో జబర్దస్త్ దూసుకెళ్తూ ఈటీవీకి ప్లస్‌గా మారింది. ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. టాలెంట్ ఉండి దానిని ఎలా నిరూపించుకోవాలో తెలియని ఎంతో మందికి ఈ కార్యక్రమం ఓ ఫ్లాట్‌ఫాంలా నిలిచింది. ధనరాజ్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు , సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాకింగ్ రాకేష్ వంటి నటులు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని, హీరోలగాను నటించారు.. ఇంకా నటిస్తున్నారు. తొలి నుంచి ఈ షోలో ఉన్న కమెడియన్లు ఇప్పుడు లేరు.. అయినప్పటికీ జబర్దస్త్ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

ఇకపోతే.. తాజా జబర్దస్త్ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ముందుగా బుల్లెట్ భాస్కర్ - ఫైమాలు ఎంట్రీ ఇస్తారు. బాల్యం ఇచ్చావ్ తీసుకుపోయావ్, యవ్వనం ఇచ్చావ్ తీసుకుపోయావ్, భార్యను ఇచ్చావ్ ఎందుకు మరిచిపోయావ్ అంటూ బుల్లెట్ భాస్కర్ దేవుడిని అడుగుతాడు. అంతలో మన శాంతికి ఫోన్ తీసుకొచ్చారంటగా దుబాయ్ నుంచి డబ్బులిచ్చిందా అని ఫైమా అడగ్గా, లేదు రూమ్‌కొచ్చిందని అంటాడు భాస్కర్. దేనికి అని ఫైమా అడగ్గా, డబ్బులివ్వడానికే వచ్చిందని చెబుతాడు. నన్ను వదిలేయాలని ఫిక్స్ అయ్యారా అని ఫైమా ప్రశ్నించగా.. ఔను అంటాడు, నాకు విడాకులిచ్చి నాకు దగ్గరుండి ఇంకో పెళ్లి చేయండి అప్పుడే వెళ్లిపోతానని చెబుతుంది. వెంటనే నరేష్‌ని పిలిపించి వీడు నీకు నచ్చాడా అని భాస్కర్ అడుగుతాడు. ఫైమా కాళ్లు పట్టుకుని .. ప్లీజ్ ఒప్పుకోండి అంటాడు నరేష్. దాంతో అంతా నవ్వేస్తారు.
కెవ్వు కార్తీక్ - పటాస్ ప్రవీణ్‌లు ఎంట్రీ ఇవ్వగా.. కార్తీక్ తల్లి గెటప్‌లో వస్తాడు. వీడు నా కొడుకు అని ప్రవీణ్‌ని రష్మికి పరిచయం చేసి.. నీ కొడుకేడి ఫారిన్ పంపించావా అని అడుగుతాడు. నాకు అట్లాంటివేమి లేవు.. పెళ్లి కాలేదా అని కార్తీక్ షాక్ అవ్వగా, పెళ్లికి పిల్లలకీ ఏం సంబంధం అంటూ షాకింగ్ ఆన్సర్ ఇస్తుంది రష్మి. ఆ మాటలతో జడ్జిలు సహా కంటెస్టెంట్స్ షాక్ అవుతారు.
ఆ వెంటనే ఆటో రాంప్రసాద్ హోమ్ నీడ్స్ అనే షాప్ కాన్సెప్ట్‌తో స్కిట్ చేస్తాడు. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో నీడ్స్ ఉంటాయి.. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడ్ అని రాంప్రసాద్ చెప్పగా, జడ్జిలకు కామెడీ నీడ్ అంటాడు శివాజీ. మాకు 10/10 మార్క్స్ నీడ్ అని చెబుతాడు రాంప్రసాద్. ఇంతలో దొరబాబు వచ్చి మంచి చాప ఉంటే చూపించమని అడుగుతాడు. చాప అయితే పని చేసుకుని చంకలో పెట్టుకుని వెళ్లిపోవచ్చని అనడంతో అంతా పడి పడి నవ్వుతారు.
లాస్ట్ టైం ఓ వెదవ మంచి చాపని చెప్పి ఇచ్చాడని, నా రెండు మోకాళ్లు డోక్కుపోయాయని దొరబాబు అనడంతో అంతా నవ్వుతారు. అనంతరం రాకెట్ రాఘవ.. మొత్తం టీమ్ లీడర్స్ అందరితో స్కిట్ చేయించాడు. తర్వాత నూకరాజు - తాగుబోతు రమేశ్‌లు విక్రమార్కుడులో బ్రహ్మానందం, రవితేజలు వేసిన గెటప్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. మరి ఎవరెవరు ఎలా చేశారు? ఏ టీమ్ గెలిచిందో తెలియాలంటే నవంబర్ 16, 17 తేదీల వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











