Anchor Rashmi యాంకర్ రష్మికి ఊహించని కష్టం - ప్రేమను కోల్పోయానంటూ పోస్ట్
యాంకర్ రష్మి గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. దశాబ్ద కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే స్లోగా స్టార్‌గా మారింది. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉండడం వల్ల ఈ భామ యూత్‌లో మస్త్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఈమె విపరీతమైన బాధలోకి వెళ్లిపోయింది. తాను ఎంతో ప్రేమించిన ఫ్యామిలీ మెంబర్‌ను కోల్పోయింది. అస్తికలను చూపిస్తూ ఏడుస్తూ పోస్ట్ చేసింది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
యాంకర్ రష్మీ ఈ పేరుకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామకు మొదట సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్‌పై యాంకర్‌గా అవతారం ఎత్తింది. జబర్థస్త్ షో అయితే ఆమె జాతకాన్ని మార్చేసింది. బుల్లితెర ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీని తీసుకొచ్చింది.

ముఖ్యంగా రష్మి - సుడిగాలి సుధీర్‌ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను బాగా దగ్గర చేసింది. ఎదుకంటే వీరిద్దరూ కలిసి పంచ్‌లు వేసుకుంటూ, ప్రేమాయణం నడుపుతూ కనిపిస్తే ఆ షో సూపర్ డూపర్ హిట్ అయ్యేది. అలా ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మీ సినిమాల్లోనూ ఛాన్స్‌లు దక్కించుకుంది.
ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఒకానొక దశలో ప్రేమలో పడి బ్రేకప్‌తో బయటకు వచ్చినట్లు తెలిపింది. అప్పుడు చాలా బాధపడినట్లు కూడా గుర్తుచేసుకుంది. అయితే ఈమెకు మూగ జీవులంటే ఎంత ప్రేమో తెలిసిన విషయమే. చాలా సార్లు తన సోషల్ మీడియాలోనూ వాటిపై స్పందిస్తూనే ఉంటుంది. ఎవరైనా వీధి కుక్కులు లేదా పసువులపై దాడి చేసి హింసించినా ముందుగా స్పందించేది ఆమెనే. వాటి హక్కుల పోరాడుతూ ఉంటుంది.

అలాంటి రష్మికకి ఇప్పుడు తాజాగా ఊహించని కష్టం ఎదురైంది. శనివారం తన ప్రాణానికి ప్రాణమైన పెంపుడు కుక్క చుట్కీని కోల్పోయింది. దీంతో ఆమె బాగా ఎమోషనల్ అయిపోయింది.. తీవ్ర భావోద్వేగానికి గురైంది. శనివారం తన పెంపుడు కుక్క చనిపోయిందంటూ రష్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. చుట్కీ ఈ లోకాన్ని విడిచి పోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చింది.
అనంతరం చుట్కీకి స్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు తాజా పోస్ట్ చూస్తే అర్థమవుతోంది. ఇంకా చుట్కీ అస్తికలను కారులో తన వెంట తీసుకెళ్తున్న ఫొటోను కూడా షేర్ చేసుకుని రష్మి ఫీలైంది. అలానే చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన పిక్స్‌ను కూడా నెట్టింట్లో షేర్ చేసుకుంది.


Click it and Unblock the Notifications











