తెల్ల చీర, మల్లెపూలు.. సింగిల్ పోస్ట్‌తో బాంబు పేల్చిన యాంకర్ రష్మీ

టాలీవుడ్‌లో ఉన్న స్టార్ యాంకర్ల లిస్ట్ తీస్తే ఖచ్చితంగా వినిపించే పేరు రష్మీ గౌతమ్. తన మాటలు, అందాలతో తెలుగు వారికి బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. యాంకర్‌గా తన స్టైల్‌, అందాలతో స్టార్ హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని క్రేజ్ దక్కించుకున్నారు రష్మీ. గతంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ.. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కారణంగానే ఆమెకు పాపులారిటీ లభించింది. జబర్దస్త్ అంటే రష్మీ .. రష్మీ అంటే జబర్దస్త్ అన్నంతగా ముద్ర వేశారు.

జబర్దస్త్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ముందే పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో కమెడియన్ సునీల్‌కు ప్రియురాలిగా అతనిపై పంచ్‌లు విసురుతూ కడుపుబ్బా నవ్వించారు. ఆ సినిమా వచ్చి 23 ఏళ్లు.. అంటే ఈ లెక్కన రష్మీ వయసు ఎంత ఉండాలి అంటూ నెటిజన్లు ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు.

jabardasth anchor Rashmi Gautam PhotoShoot With White saree Her latest photos here

హోలీ తర్వాత కరెంట్, ఎవరైనా ఎపుడైనా, బిందాస్, గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, బొమ్మ బ్లాక్‌బస్టర్, భోళా శంకర్, హాస్టల్ బాయ్స్‌లో రష్మీ గౌతమ్ నటించింది. తొలినాళ్లలో అనసూయ భరద్వాజ్ జబర్దస్త్‌కు, రష్మీ గౌతమ్ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు హోస్ట్‌లుగా వ్యవహరించే వారు. అయితే సినిమాల్లో వరుస అవకాశాలు దక్కడంతో అనసూయ ఈ మెగా షోను వీడింది. రష్మీ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూ తన చలాకీతనంతో అలరిస్తున్నారు. తనకు కూడా సినిమాల్లో బాగానే ఆఫర్లు వస్తున్నా జబర్దస్త్‌ను మాత్రం ఆవిడ విడిచిపెట్టలేదు. ఈ ప్రోగ్రామ్‌తో పాటు వేరే షోలు, సినిమా ఈవెంట్లను ఎడాపెడా చేసేస్తోంది రష్మీ గౌతమ్

ఇన్నేళ్లు వచ్చినా ఆమె ఇంకా పెళ్లి మాటల ఎత్తకపోవడంపై బుల్లితెర అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. రష్మీని సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పలుమార్లు నెటిజన్లు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. జబర్తస్త్ ఫేమ్, మరో స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమలో ఉందని ఏళ్లుగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని .. త్వరలోనే పెళ్లి జరగబోతోందని పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఎప్పటిలాగే సుధీర్ - రష్మీలు ఎవరి పనుల్లో , ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉంటున్నారు.

మూగ జీవాల సంరక్షణను ఇష్టపడే రష్మీ గౌతమ్.. రోడ్డుపై కుక్కలకు , ఇతర జంతువులకు ఆహారాన్ని అందిస్తుంటారు. కరోనా సమయంలో వాటి ఆలనా పాలనా చూసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో మూగ జీవాల సంక్షేమం కోసం పాటు పడుతూ ఫోటోలు, వీడియోలు పెడుతుంటారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటారు. తాజాగా తెల్ల చీర కట్టుకుని, కొప్పులో మల్లెపూలు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ .. సిగ్గు పడుతున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మీ ఎవరి కోసం ముస్తాబైంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X