వీల్ చైర్‌లోనే .. స్నానం కూడా చేయలేక .. దారుణంగా యాంకర్ రష్మి హెల్త్ కండీషన్

ఇటీవల వెండితెర, బుల్లితెర నటీనటులు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యాల బారినపడుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటిస్ బారినపడినట్లుగా బయటపెట్టడంతో పలువురు నటీనటులు తమ ఆరోగ్య పరిస్ధితిని వెల్లడించారు. ముందస్తు కమిట్‌మెంట్స్, బిజీ షెడ్యూల్ కారణంగా వారు కనీసం చికిత్స చేయించుకోవడం కూడా కష్టమే. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ ఆసుపత్రి బెడ్‌పై ప్రత్యక్షం కావడంతో ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆమె బాలికి వెళ్లడంతో రష్మిపై ట్రోలింగ్ నడిచింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు వెకేషన్ ఏంటీ? అంటూ మండిపడ్డారు. దీనిపై రష్మి గౌతమ్ స్వయంగా వివరణ ఇచ్చారు.

jabardasth Anchor rashmi gautam revealed her health condition and bali trip

సినిమాలు, జబర్దస్త్‌ను బ్యాలెన్స్ చేస్తోన్న రష్మి

ఎప్పుడో 13 ఏళ్ల క్రితం మొదలైన జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చే కమెడియన్లు, జడ్జిలు, యాంకర్లు ఎంతో మంది మారారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మెగా షోనే అంటిపెట్టుకుని ఉన్నారు రష్మి గౌతమ్. తనకు కూడా సినిమా ఆఫర్లు వస్తున్నా సెలక్టెడ్‌గా చేసుకుంటూ, అటు జబర్దస్త్‌కు టైం కేటాయిస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయినా ఈమె మాత్రం తనకు జబర్దస్తే ముఖ్యమని చెబుతున్నారు.

సుడిగాలి సుధీర్‌తో పెళ్లెప్పుడు?

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో రష్మి ప్రేమాయణం సాగిస్తోందంటూ నేటికీ రకరకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం స్కిట్స్ కోసం తమ మధ్య రిలేషన్ ఉన్నట్లుగా కథ అల్లారని, అంతకుమించి ఏం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇద్దరూ ఇంకా బ్యాచిలర్ లైఫ్ కొనసాగిస్తుండటం, పెళ్లికి నో చెప్పడం వంటి పరిణామాలు అనుమానం కలిగిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ శుభవార్త చెప్పాలని వీరి అభిమానులు కోరుకుంటున్నారు.

శస్త్రచికిత్స చేయించుకున్న రష్మి

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు రష్మి గౌతమ్.. తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే మూగజీవులు, పర్యావరణ సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. వీటికి సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. అలాంటిది రష్మి గౌతమ్ ఇటీవల హాస్పిటల్ బెడ్‌పై ఉండి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 18న తనకు శస్త్ర చికిత్స అయ్యిందని విపరీతమైన బ్లీడింగ్, భుజం నొప్పితో ఇబ్బంది పడ్డానని.. గర్భాశయంలోని గడ్డలను వైద్యులు తొలగించారని రష్మిలో పోస్ట్ పెట్టారు.

బాలి ట్రిప్‌పై విమర్శలు

ముందుగా తాను కమిటైన కార్యక్రమాలను పూర్తి చేసి తర్వాత ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఈ జబర్దస్త్ యాంకర్ పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఆమె చెప్పారు. దీంతో రష్మి త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే ఇండోనేషియాలోని బాలీకి వెళ్లడంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తాజాగా తన వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగొచ్చిన రష్మి వీల్ చైర్‌లో ఉన్న వీడియోను పోస్ట్ చేసి షాకిచ్చారు.

స్నానం చేయలేకపోయానంటూ రష్మి ఆవేదన

తాను బాలి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అందులో ఆమె వివరించారు. బాలి ట్రిప్ రెండు నెలల ముందే ప్లాన్ చేసుకున్నానని , దీనికి తోడు తన పుట్టినరోజు కూడా ఉండటంతో వెళ్లక తప్పలేదని రష్మి పేర్కొన్నారు. వెకేషన్‌కు వెళ్లినా వీల్‌చైర్‌లోనే ఉండటంతో ట్రిప్ ఎంజాయ్ చేయలేకపోయానని.. కనీసం బీచ్‌లో దిగి స్నానం కూడా చేయలేకపోయానని ఈ జబర్దస్త్ యాంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వివరణతోనైనా విమర్శలకు చెక్ పడతాయో లేదో చూడాలి. ప్రస్తుతం వీల్ చైర్‌లో ఉన్న రష్మి వీడియో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X