హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ .. మళ్లీ మొదలెట్టిన జబర్దస్త్ రష్మి, రెచ్చగొట్టేలా గ్లామర్ షో

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ.. తన పని తాను చేసుకుపోయే జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఇటీవల ఆసుపత్రి పాలు కావడంతో అంతా షాక్ అయ్యారు. ఓ సర్జరీ చేయించుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. కట్ చేస్తే రోజులు తిరక్కుండానే రష్మి వెకేషన్‌‌లో సేద తీరుతూ, ఆ ఫోటోలు పెట్టడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ జబర్దస్త్ ద్వారానే రష్మికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వచ్చి రానీ తెలుగులో ఆమె వేసే పంచ్‌లు, గ్లామర్‌ షోతో ఆ కార్యక్రమం సక్సెస్ కావడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 10 ఏళ్లకు పైగా జబర్దస్త్‌కు యాంకర్‌గా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. బయటి ఛానెల్స్‌లో ఆఫర్లు వస్తున్నా పక్కనపెట్టి కేవలం ఈటీవీలోనే కొనసాగుతున్నారు. ఈ ఛానెల్‌లో జబర్దస్త్‌తో పాటు పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

jabardasth Anchor rashmi gautam shared bali vacation photos

సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వెండితెర, బుల్లితెరను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు రష్మి. సినిమాల్లో అవకాశాలు రావడంతో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్‌ను వీడారు. కానీ రష్మి మాత్రం తనకు లైఫ్ ఇచ్చిన కార్యక్రమాన్ని విడిచి పెట్టడం లేదు. స్వతహాగా పర్యావరణ ప్రేమికురాలైన రష్మి గౌతమ్.. మూగజీవాల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. కరోనా సమయంలో కుక్కలకు ఆహారాన్ని అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. వీధుల వెంట ఉండే కుక్కలు, ఇతర జంతువులకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతుంటారు. కొద్దిరోజుల క్రితం తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లారు. శాస్త్ర ప్రకారం ఆ కుక్కకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ప్రతినిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మి గౌతమ్ ఇటీవల హాస్పిటల్ బెడ్‌పై ఉండి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 18న తనకు శస్త్ర చికిత్స అయ్యిందని పేర్కొన్నారు. విపరీతమైన బ్లీడింగ్, భుజం నొప్పితో ఇబ్బంది పడ్డానని.. గర్భాశయంలోని గడ్డలను ఆపరేషన్ చేసి వైద్యులు తొలగించారని ఆమె తెలిపారు. ముందుగా కమిటైన కార్యక్రమాలను పూర్తి చేసి తర్వాత ఆసుపత్రిలో చేరినట్లు రష్మి వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఆమె చెప్పారు. దీంతో రష్మి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు పోస్టులు పెట్టారు.

అయితే హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యిందో లేదో అప్పుడే వెకేషన్‌కు శ్రీకారం చుట్టింది రష్మి. ప్రస్తుతం సెలవులో ఉండటంతో మండుటెండల్లో సేద తీరేందుకు ఇండోనేషియాలోని బాలీకి స్నేహితులతో కలిసి వెళ్లారు. ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్‌లో ఉన్నప్పటికీ డాక్టర్లు ఇచ్చిన మందులను వేసుకుంటున్నట్లు పేర్కొన్నారు రష్మి. ఇక పడవపై ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఈ ముద్దుగమ్మ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X