HBD Rashmi Gautam: రష్మీ గౌతమ్ నికర ఆస్తులు ఎంత? స్టార్ యాంకర్ ఎన్ని కోట్లు కూడబెట్టిందో తెలుసా?
స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రష్మి గౌతమ్ యాంకరింగ్ ను అందరూ ఇష్టపడుతుంటారు. ఆమె సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. రష్మి గౌతమ్ 10 ఏళ్లకు పైగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలతో యాంకర్ గా బుల్లితెర ఆడియన్స్ అలరిస్తూ వస్తుంది. మరోవైపు సినిమాలోనూ నటిస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది.
ఈరోజు రష్మి గౌతమ్ పుట్టినరోజు కావడం విశేషం. 1988 ఏప్రిల్ 7న జన్మించిన ఈ బ్యూటీ ఇవాళ తన 37వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రష్మి గౌతమ్ కు ఆమె అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె కెరియర్ లో మరింత సక్సెస్ ను చూడాలంటూ ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పెద్ద ఎత్తున స్టార్ యాంకర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను, బ్యూటిఫుల్ ఫోటోలను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు.

ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ కు సంబంధించిన నెట్ వర్క్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఈ బుల్లితెర స్టార్ బ్యూటీ ఎన్ని కోట్ల సంపాదించింది అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్మి గౌతమ్ తన కెరీర్ మొత్తం యాంకర్ గా బుల్లితెరపై, నటిగా హీరోయిన్ గా వెండితెరపై అలరించే బాగానే కూడబెట్టిందని తెలుస్తోంది. 23 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న రష్మీ గౌతమ్ తన కెరియర్ మొత్తంగా 40 కోట్ల వరకు సంపాదించి ఉంటుందని రెడ్డిట్ వెబ్సైట్ తెలుపుతుంది.
రష్మీ గౌతమ్ ప్రస్తుతం యాంకర్ గా మాత్రం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కు వర్క్ చేస్తోంది. ఈ పాపులర్ కామెడీ షో లో యాంకర్ గా వర్క్ చేస్తున్నందుకు గాను ఏకంగా ఒక్కొక్క ఎపిసోడ్ కు రష్మీ గౌతమ్ రూపాయలు 80 వేలు చార్జ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ లెక్కన జబర్దస్త్ కామెడీ షో వారానికి రెండుసార్లు ప్రసారం అవుతుంది. దాంతో రష్మి గౌతమ్ వారానికే 1.6 లక్షల రూపాయలు సంపాదిస్తుందని అర్థమవుతుంది. ఇక నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయలు అవలీలంగా సంపాదిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా మరోవైపు సినిమాల ద్వారా కూడా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటుంది.
అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా లక్షల్లో ఆర్జిస్తుంది. మరోవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కూడా సంపాదిస్తుంది. ఇలా ఎంత లేదన్న రష్మీ గౌతమ్ నెల సంపాదన 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా గట్టిగానే రష్మి గౌతమ్ ఇన్ కం అందుకుంటుంది. ఈ లెక్కలను బట్టి చూస్తే సంవత్సరానికి కోటి 20 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. రష్మి గౌతమ్ ఇప్పటివరకు హీరోయిన్గా గుంటూరు కారం, అంతం, నెక్స్ట్ నువ్వే, అంతకుమించి, బొమ్మ బ్లాక్ బస్టర్, హాస్టల్ బాయ్స్ మంచి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. సపోర్టింగ్ రోల్స్ ల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో కామియో అప్పియరెన్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











