చెప్పు తీసుకుని కొడతా.. జబర్దస్త్ కమెడియన్‌కు రష్మీ గౌతమ్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ అనే బుల్లితెర షో ద్వారా పరిచయమైన కమెడియన్ నూకరాజు. అదే షో ద్వారా పాపులర్ అయిన హాట్ యాంకర్ రష్మీ చెప్పు తెగుతుంది అంటూ నూకరాజుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఎప్పుడూ కూల్ గా ఉంటూ టీం లీడర్స్ తనపై వేసే పంచులను లైట్ తీసుకుని రష్మీకి అంత కోపం తెప్పించే విధంగా నూకరాజు ఏం చేశాడో ఓ లుక్కేద్దాం పదండి.

ఇటీవల కాలంలో బుల్లితెర షోలలో బాగా సందడి చేస్తున్నాడు నూకరాజు. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ షో జడ్జ్ గా ఉన్నప్పుడు నూకరాజుని బాగా ఆదరించేది. ఆమె షో నుంచి వెళ్ళిపోయినప్పటికీ నూకరాజు సందడి ఏమాత్రం తగ్గలేదు. అయితే తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో నూకరాజు చేసిన పనికి రష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలేం జరిగిందంటే..

Jabardasth Anchor Rashmi Gautham Strong warning to Comedian Nookaraju

జూన్ 21, 22న రిలీజ్ కాబోతున్న జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో ఎప్పటిలాగే కొన్ని హైలెట్ సీన్స్ ను ప్రేక్షకులకు చూపించి షోపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఏంటి రష్మీ అని నూకరాజు ముందుగా రష్మిని పలకరించాడు. వెంటనే రష్మి స్కిట్ లో కామెడీ ఉంటుందా లేదా అంటూ పంచ్ వేసింది. ఆమె రెండు మూడు సార్లు చెప్పినప్పటికీ వినిపించినట్టుగా బిహేవ్ చేశాడు నూకరాజు.

దీంతో విసిగిపోయిన రష్మీ రా ముద్దు పెడతా అని పిలిచింది. నూకరాజు వెంటనే ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తుంటే చెప్పు తీసుకొని కొడతాను అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో నూకరాజు నవ్వుకుంటూ అక్కడే ఆగిపోయాడు. నిజానికి ఇదంతా ఫన్నీ గానే జరిగింది. కానీ జబర్దస్త్ నిర్వాహకులు తాజా ప్రోమోలో దాన్ని హైలెట్ చేయడంతో వైరల్ అవుతుంది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణకు సెట్ అంతా నవ్వులు విరబూసాయి.

Jabardasth Anchor Rashmi Gautham Strong warning to Comedian Nookaraju

తరువాత అందులో భాగంగానే నూకరాజు స్కిట్ లో చెవిటి వాడిగా నటిస్తున్నట్టు చూపించారు. స్కిట్ స్టార్టింగ్ లో ఊరి పెద్ద వచ్చి ఊరంతా మన గురించి ఏం అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తాడు. పని వాడి పాత్రలో ఉన్న నూకరాజు జబర్దస్త్ లో కామెడీనే చేయడం రావట్లేదు ఢీలో చేస్తాను అన్నారట కదా అంటూ పంచ్ వేశాడు. ముఖ్యంగా జడ్జ్ గా ఉన్న ఖుష్బూ, కృష్ణ భగవాన్ తెగ నవ్వేశారు. ఇక ఈ శుక్రవారం, శనివారం టీవీలో పెళ్లికాస్ట్ కాబోతున్న జబర్దస్త్ ఎపిసోడ్ లో కు సంబంధించిన మరికొన్ని హైలెట్స్ సన్నివేశాలను ఈ ప్రోమోలో చూపించారు మేకర్స్.

ఇక ఈ ప్రోమోను చూశాక నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జబర్దస్త్ కాబట్టి రష్మి పంచ్ వేసి వదిలేసింది. అదే బయట ఇలా జరిగితే ఆమె వేసిన పంచ్ నే నిజం చేసి చూపిస్తుంది అంటున్నారు. అది కూడా నిజమే. ఏ విషయంపైనైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే రష్మి, ఎవరైనా తన జోలికి వస్తే అస్సలు ఊరుకోదు. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి వాళ్ళ నవలలు మూయిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X