జబర్ధస్త్ సిరి ఓవర్ డోస్ గ్లామర్ షో.. అసలైనవే కనిపించేలా ఘాటు ఫోజులు
తెలుగు అమ్మాయి గతంలో కంటే ఇప్పుడు సినీ రంగంలో ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. అలాగే, బుల్లితెరపై కూడా ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలా ఎందరో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో సిరి హన్మంత్ ఒకరు.
చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంటరైన ఈ భామ.. ఈ మధ్య కాలంలో తనదైన రీతిలో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సిరి హన్మంత్ సోషల్ మీడియాలో కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అలా వచ్చి.. సీరియళ్లతో
సిరి హన్మంత్ ఆరంభంలో రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. అలా ఫేమస్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. తద్వారా ఫుల్ ఫేమస్ అయింది.

మూవీలు.. వెబ్ సిరీస్‌లు
బుల్లితెర నటిగా సత్తా చాటుతోన్న సమయంలోనే సిరి హన్మంత్ 'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు, 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. వీటితో పాటు కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు స్పెషల్ వీడియోలు చేసి పాపులారిటీని అందుకుంది.

బిగ్ బాస్‌లో గుడ్ బ్యాడ్
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో సిరి హన్మంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే తన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటీ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుని తెగ హైలైట్ అయింది. అయితే, ఇందులో షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి వ్యవహరించిన తీరుతో విమర్శలు అందుకుంది. ఇలా బిగ్ బాస్ షో వల్ల మంచి, చెడ్డ పేర్లను సిరి హన్మంత్ అందుకుంది.

జబర్దస్త్ యాంకర్‌గానూ
సిరి హన్మంత్ ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు అందుకుని సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ అమ్మడు యాంకర్‌గా మారి జబర్ధస్త్ షోలోకి వచ్చింది. ఇందులో తనదైన అందం, హోస్టింగ్‌తో అలరిస్తోంది. ఫలితంగా మరిన్ని అవకాశాలను కూడా అందుకుంటూ సిరి హన్మంత్ తన రేంజ్‌ను మరింతగా పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తోంది.

అందులో ఫుల్ యాక్టివ్
సుదీర్ఘ కాలంగా వరుసగా సీరియళ్లు, షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ సిరి హన్మంత్ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటూ దూసుకుపోతోంది.

అందాలతో వల వేస్తూ
సుదీర్ఘమైన ప్రయాణంలో సిరి హన్మంత్ పెద్దగా గ్లామర్ షో చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో డోసు పెంచేసి రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ యాంకర్‌గా మారిన తర్వాత ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సిరి షేర్ చేసుకుంటోంది.

సిరి ఫొటోలు వైరల్‌గా
జబర్ధస్త్ యాంకర్ సిరి హన్మంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ టాప్, లెహంగాలో కొన్ని ఫొటోలను దిగింది. దీంతో ఆమె క్లీవేజ్, నాభి, నడుము అందాలు ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా సిరి తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











