Sowmya Rao: టూ పీస్‌లో సెగలు రేపుతోన్న జబర్దస్త్ యాంకర్... అలా చూపిస్తుందేంటి భయ్యా?
జబర్దస్త్ షోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక యాంకర్ అనసూయ ఈ షోకు గుడ్ బై చెప్పాక.. ఒక కొత్త యాంకర్ సౌమ్య రావు ఎంటర్ అయింది. ఇక ఈ భామ రష్మి, అనసూయ యాంకరింగ్ పోటీగా తను యాంకరింగ్ చేస్తుంది. ఒక్క యాంకరింగ్ లోనే కాదు... అందాల ప్రదర్శనలోనూ ఈ భామకు తగ్గేదేలే అన్నట్లు షో చేస్తుంది. తాజాగా ఈ భామ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పలు ఫోటోలను షేర్ చేసింది. అవి ఎలా ఉన్నాయో మీరే లుక్ వేయండి.
బుల్లితెరపై ప్రత్యేక ఆదరణ పొందిన షోలలో జబర్దస్త్ ఒకటి. ఇక ఈ షో అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు కాస్త జోరు తగ్గినా... అప్పట్లో అయితే.. ఈ షోకు మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చేది. నాగబాబు, రోజా కాంబోలో... యాంకర్ లు అనసూయ, రష్మిలు.. టీం మెంబర్స్... ఇలా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేవారు. ఇక ప్రతి వారం ఈ షో కోసం జనాలు వెయిట్ చేసేవారు. గడుస్తున్న కొద్ది ఈ షోను పలు టీవీ ఛానెల్స్ కాపీ కొట్టి వారి ఛానెల్స్ లో ప్రోగ్రామ్స్ చేసేవారు.

అయితే వాటికి అంతగా క్రేజ్ అయితే దగ్గలేదు. పదేళ్లు దాటినా.. ఈ షోకి మాత్రం మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక రోజా, నాగాబాబు వెళ్లిపోయాక.. జడ్జ్ లుగా వేరే వాళ్లు వచ్చారు. ఇక అనసూయ కూడా ఈ షోకు గుడ్ బై చెప్పింది. అనసూయ తప్పుకోవడంతో ఆ ప్లేసులోకి సౌమ్య రావు ఎంటర్ అయింది. ప్రస్తుతం ఈ భామ ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. స్మాల్ స్క్రీన్ పై సరికొత్తగా కనిపిస్తూ ప్రస్తుతం షోలో తన గ్లామర్ హైలైట్ చేస్తోంది ఈ అమ్మడు.

అటు సోషల్ మీడియాలోనూ సౌమ్య రావు ఫుల్ యాక్టివ్ ఉంటుంది. హద్దులు దాటేసి మరీ తన అందాలను ప్రదర్శిస్తూ... నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ.. తన అందాల ప్రదర్శన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. టూ పీస్ డ్రెస్సులో కనిప్సూ... తన నడుము అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ఇక ఎగిసిపడుతున్న ఎద అందాలను చూస్తే.. నెటిజన్స్ ఆగలేక కామెంట్స్, లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

సౌమ్య రావు జబర్దస్త్ లో అడుగుపెట్టగానే అందరి దృష్టిని ఆకర్షించింది. పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అనసూయ స్థానాన్ని భర్తీ చేసేలా ... బుల్లితెరపై తన యాంకరింగ్ తో మార్క్ చూపిస్తోంది. అసలు ఈ భామ మొదట సీరియల్ నటి. ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీమంతుడు సీరియల్ లో యాక్టర్. ఇక అక్కడి నుంచి జబర్దస్త్ యాంకర్ గా సెలెక్ట్ అయి.. ప్రేక్షకులను తనదైన శైలీలో ఆకట్టుకుంటుంది.
ఇక అటు శ్రీదేవి కంపెనీ డ్రామాలోనూ మెరుస్తూ.. అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ భామ అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించింది. దానికి కారణం జబర్దస్త్ షోనే. మరి ఈ భామ సిినిమాల్లోకి వస్తే... బాగానే సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మున్ముందు అనసూయ, రష్మి బాటలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











