గోల్డ్ శారీలో సౌమ్య రావు గ్లామర్ షో .. చీరకట్టులో చెమటలు పట్టిస్తోన్న జబర్దస్త్ యాంకర్

తెలుగు సినిమాలే కాదు , తెలుగు టెలివిజన్ రంగంలోనూ కన్నడ భామల హవాయే ఎక్కువ. ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ కూడా ఓ కన్నడిగుడు కావడంతో తెలుగు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా .. వీరు తమ కష్టం, ప్రతిభతో మెప్పిస్తున్నారు. తద్వారా టాలెంట్ ఎక్కడ ఉన్నా .. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా తెలుగు వారు ప్రోత్సహిస్తారని రుజువు చేస్తున్నారు.

ఇక తెలుగునాట సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది ప్రతిభావంతులు పరిచయమయ్యారు. ఇక్కడ తమ టాలెంట్ నిరూపించుకుని వెండితెరపైనా అడుగుపెడుతున్నారు. సుడిగాలి సుధీర్, ధనరాజ్, షకలక శంకర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను వంటి వారు నటులు కాగా.. వేణు యెల్దండి ఏకంగా మెగా ఫోన్ పట్టి బలగం వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు. వీరే కాదు.. జబర్దస్త్ యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చిన రష్మీ, అనసూయలు సైతం స్టార్‌డమ్ సంపాదించారు.

jabardasth anchor Sowmya Rao Nadig photoshoot with saree her latest photos here

సినిమాలు, షోలు, ఇంటర్వ్యూలతో అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. గతంలో అనసూయ భరద్వాజ్ గురువారం నాటి ఎపిసోడ్‌ను, రష్మి గౌతమ్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ చేసేవారు. అయితే వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్‌ను వీడటంతో కొన్నాళ్లు రష్మియే రెండు రోజులు కవర్ చేశారు. అనసూయ ప్లేస్‌లో పలువురు ముద్దుగుమ్మలను యాంకర్‌గా తీసుకొచ్చి ట్రై చేసినా అంతగా క్లిక్ కాలేదు.

ఈ క్రమంలో కన్నడ నటి సౌమ్యరావ్‌ను యాంకర్‌గా తీసుకొచ్చారు. అయితే ఓ తెలుగు షోకి కన్నడ అమ్మాయిని యాంకర్‌గా పెడతారా అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కానీ సౌమ్య ఎంతో కష్టపడి తన మార్క్ చూపించడానికి ప్రయత్నించింది. వచ్చీ రాని తెలుగులో జనం వెక్కిరించినా.. తనపై పంచ్‌లు, సెటైర్లు పడుతున్నా సర్దుకుపోయింది. చేసింది కొన్ని ఎపిసోడ్సే అయినా జబర్దస్త్ యాంకర్‌గా సౌమ్య రావు న్యాయం చేసింది.

జబర్దస్త్‌ను వీడినా తెలుగు బుల్లితెరపై క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. తెలుగు రాకపోయినప్పటికీ అందం విషయంలో మాత్రం ఈమెకు వంక పెట్టడానికి ఏం లేదు. హీరోయిన్స్‌ని మించిన అందంతో సౌమ్య మెస్మరైజ్ చేస్తున్నారు. వీలున్నప్పుడల్లా హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుది సౌమ్య. తాజాగా గోల్డ్ కలర్ శారీలో చేసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ జబర్దస్త్ యాంకర్‌ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X