‘తూ అంటూ బండబూతులు తిట్టాడు’.. జబర్దస్త్ యాంకర్ సౌమ్య ఆవేదన

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు సౌమ్యా రావు పరిచయం అయిన సంగతి తెలిసిందే. పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా యాంకర్ గా ఆడియెన్స్ ను అలరించింది. తన టాలెంట్ తో షోను మరింత జోష్ గా నడిపించేందుకు భాగమైంది. చాలా తక్కువ సమయమే సౌమ్యా రావు జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా పని చేసినప్పటికీ తన అందం, యాంకరింగ్ స్కిల్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువగా గుర్తుండిపోయింది. తనకు కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక సౌమ్యా రావు కూడా ఓవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు వీలున్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ తన గురించిన విషయాలను పంచుకుంటూ వస్తోంది. తాజాగా మాత్రం తనకు జరిగిన ఓ అవమానకరమైన సందర్భాన్ని చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్లితే..

సీరియల్ నటిగా మంచి గుర్తింపు..
కర్ణాటకలో 1990లో సెప్టెంబర్ 29న పుట్టింది సౌమ్యా రావు. కర్ణాటకలోని షిమోగాలో జన్మించింది అక్కడే పెరిగింది కూడానూ. ఇక తన విద్యాభ్యాసం ముగిసిన తర్వాత 2018లో యాక్టింగ్ కెరీయర్ ను ఎంచుకుంది. టెలివిజన్ రంగంలో అడుగు పెట్టింది. తొలుత తమిళ టెలివిజన్ రంగంలో సీరియల్ నటిగా అవకాశం అందుకుంది. రోజా అనే తమిళ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే నెంజమ్ మరప్పదిల్లై, వల్లి, మిన్నలే, తిరుమతి హిట్లర్, శ్రీమంతుడు వంటి తమిళ సీరియల్స్ లో నటించి మెప్పించింది. తెలుగు టెలివిజన్ రంగంలోకి 'శ్రీమంతుడు' అనే సీరియల్ తో అడుగు పెట్టింది. ఇలా సీరియల్ నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.

Jabardasth Anchor Sowmya Rao Revealed her Hurtful moments

తెలుగులో 'జబర్దస్త్'తో ఫేమ్..
తెలుగు టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సౌమ్యా రావు మంచి గుర్తింపు దక్కింది. 'శ్రీమంతుడు' సీరియల్ తో పాటు.. పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా వ్యవహరించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తనకు వచ్చీరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. హైపర్ ఆదితో ఈ బ్యూటీ పంచులు, కౌంటర్ల ద్వారా ప్రేక్షకుల్లోకి త్వరగా వెళ్లింది. తెలుగు ఆడియెన్స్ ల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

కన్నడ దర్శకుడు 'తూ' అంటూ..
సౌమ్యా రావు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఓ కన్నడ సీరియల్ దర్శకుడు అవమానించిన విషయాన్ని వెల్లడించింది. అవమానించడమే కాదు.. దుర్భాషలాడడాని చెప్పుకుంటూ బాధపడింది.. 'నేను కన్నడ టెలివిజన్ సీరియల్ లో నటించాను. అక్కడ సీరియల్ హీరోయిన్ కు ఇచ్చిన విలువను మిగితా ఆర్టిస్టులకు ఇవ్వరు. ఒకసారి సీరియల్ హీరోయిన్ కు ప్రొడక్షన్ ఫుడ్ కాకుండా, బయటి నుంచి స్పెషల్ ఫుడ్ తెచ్చారు. అది వడ్డించి మరీ టేబుల్ పై పెట్టారు. అయితే ప్రొడక్షన్ ఫుడ్ అనుకొని నేను ఒక పీస్ తిన్నాను.

దాంతో ఆ సీరియల్ ప్రొడ్యూసర్ నన్ను బండ బూతులు తిట్టాడు. ఎవరెవరో దరిద్రులు ఇక్కడికి ఎలా వస్తున్నారని, వీళ్లకు దూరంగా ఫుడ్ పెట్టండి అంటూ అరిచారు. ఇక డైరెక్టర్లైతే హీరోయిన్ తప్పు చేస్తే ఏమనరు కానీ.. ఆర్టిస్ట్ లు తప్పు చేస్తే మాత్రం నానా మాటలు అంటారు. తూ.. ఛీ.. అంటూ హీనంగా మాట్లాడుతారు. అలాంటివన్నీ అక్కడ ఫేస్ చేసి వచ్చాను.' అని సౌమ్యా రావు చెప్పుకొచ్చింది. ఇక ఆ ప్రొడ్యూసర్ పేరును మాత్రం బయటికి చెప్పలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X