TRP rating లో జబర్దస్త్, ఎక్ట్‌ట్రా జబర్దస్త్ షాకింగ్‌గా.. సుమ షోపై అనసూయ ఆధిపత్యం!
దేశంలో కరోనావైరస్ పరిస్థితుల కారణంగా విచ్చిన్న పరిస్థితులు ఏర్పడిన కారణంగా సినిమా హాళ్లు మూతపడటం టెలివిజన్ రంగానికి కొంత కలిసి వచ్చిందనే చెప్పాలి. లాక్‌డౌన్, కర్ఫ్యూ పరిస్థితులతో ప్రేక్షకులు టీవీలకు అత్తకుపోయారనేది తాజా టెలివిజన్ రేటింగ్స్ చూస్తే అర్ధమవుతుంది. తాజాగా ఈ ఏడాదిలో 23వ వారానికి సంబంధించి నాన్ డైలీ సీరియల్ టీఆర్పీ వివరాలు ఇలా ఉన్నాయి.

జీ తెలుగులో డ్రామా జూనియర్స్
ప్రముఖ టెలివిజన్ సంస్థ జీ తెలుగులో శ్రీకారం శుభకారం, ఓంకారం, ఆరోగ్యమే మహాభాగ్యం, బీజేబీ, డ్రామా జూనియర్స్, బీసీసీ లాంటి కార్యక్రమాలను ప్రేక్షకులను ఆలరిస్తున్నాయి. అయితే ఈ ఛానెల్ విషయానికి వస్తే.. వీటిలో డ్రామా జూనియర్స్ అత్యధికంగా 2.57 రూరల్‌లో, ఆర్బన్‌లో 3.03 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. బీజేబీ మాత్రం 2.03 రూరల్‌లో, అర్బన్‌లో 2.11 రేటింగులో ముందుకు సాగుతున్నది.

స్టార్ మాలో సుమ స్టార్ట్ మ్యూజిక్
ఇక స్టార్ మా విషయానికి వస్తే నాన్ సీరియల్స్ విభాగంలో కూడా అధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. శుభోదయం, స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ లాంటి షోలు ప్రసారం అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా సుమ నిర్వహించే స్టార్ట్ మ్యూజిక్ షో రూరల్‌లో 4.81, అర్బన్‌లో 5.19 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. కామెడీ స్టార్స్ ఆ తర్వాత స్థానంలో నిలిచి రూరల్‌లో 4.01, అర్బన్‌లో 4.23 రేటింగ్‌తో ఉంది.

ఈటీవీలో ఎక్ట్స్‌ట్రా జబర్దస్త్, జబర్దస్‌దే హవా
ఇక ఈటీవీలో శుభమస్తు, పాడుతా తీయగా, తెలుగు రుచి, శ్రీదేవి డ్రామా కంపెనీ, అలీతో సరదాగా, వావ్3, డీ13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్, జబర్దస్త్, క్యాష్, స్వరాభిషేకం షోలు ప్రసారం అవుతున్నాయి. ఇందులో ఎక్స్‌టా జబర్దస్త్ టాప్‌లో నిలిచింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోకు రూరల్‌లో 6.27 రేటింగ్, అర్బన్‌లో 6.86 రేటింగ్ సొంతం చేసుకొన్నది. జబర్దస్త్ 5.74 రేటింగ్ రూరల్‌లో, అర్బన్‌లో 5.28 రేటింగును సొంతం చేసుకొన్నది.

అన్నింటిలో జబర్దస్త్‌కే అగ్ర తాంబూలం
తెలుగులో ఉన్న అన్ని తెలుగు ఛానెల్స్‌ను పరిశీలిస్తే ఎక్స్‌ట్రా జబర్దస్త్, జబర్దస్త్ షోలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్టు తాజా టీఆర్పీ రేటింగ్స్ తెలియజేస్తున్నాయి. ఈ రెండు షోలకు దరిదాపుల్లో కూడా మరో షో లేకపోవడం గమనార్హం. స్టార్ మాలో స్టార్ట్ మ్యూజిక్ కాస్తా పోటీ ఇస్తున్నట్టు కనిపిస్తున్నది. అనసూయ, హైపర్ ఆది, రష్మీ గౌతమ్ లాంటి టాప్ స్టార్లు ఈ షోను అగ్రపథంలో నిలబెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
Recommended Video

టీవీ ఛానెల్స్‌లో స్టార్ మా టాప్
ఇక టెలివిజన్ ఛానెల్స్ మధ్య పోటీ విషయానికి వస్తే.. స్టార్ మా టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. స్టార్ మా ఓవరాల్‌గా 938 పాయింట్ల అర్బన్‌లో, రూరల్‌లో 862 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జీటీవీ తెలుగు 747 పాయింట్లు, 578 పాయింట్లతో రెండోస్థానంలో, మూడో స్థానంలో ఈటీవీ తెలుగు 580 టీఆర్పీ అర్బన్, 509 పాయింట్లు రూరల్ ఉంది. నాలుగు స్థానంలో జెమినీ టెలివిజన్ కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











