Bigg Boss Telugu Season7 : బిగ్‌బాస్‌లోకి మరో జబర్ధస్త్ కమెడియన్... పాపం ఈసారైనా?

బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో విజయవంతంగా ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్... ఇప్పుడు ఏడో సీజన్ తో త్వరలో బుల్లితెర ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఇప్పటికే రిలిజ్ అయిన ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నిత్యం ఏదో న్యూస్ బయటకు వస్తూనే ఉంది. తాజాగా బిగ్ బాస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఈ సీజన్ లో మరో జబర్ధస్త్ కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

తెలుగులో అత్యధిక ఆదరణ పొందుతున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. ఆరు సీజన్స్, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఏడో సీజన్ కు రంగం సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈ షోలో కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పలువురు పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరో పేరు బయటకు వచ్చింది. ఆయన ఎవరో కాదు.. జబర్దస్త్ కమెడియన్ అప్పారావు.

Jabardasth Appa Rao Confirmed For Bigg Boss Telugu 7 Contestants News Goes Viral

ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలోని అక్కాయపాలెంకు చెందిన అప్పరావు.. ఇప్పటి వరకు 250 సినిమాలు, 70 సీరియల్స్‌ లో నటించారు. చిన్నప్పటి నుంచే నాటకాల పై ఆసక్తితో నటుడయ్యారు. ఇక అప్పారావు శుభవేళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

అయితే జబర్ధస్త్ ప్రోగ్రాంతోనే బాగా పాపులర్ అయిన అప్పారావు... ఆ షోలో సభ్యుడిగా ఉండే ఆయన... టీమ్ లీడర్ గా ఎదిగారు. తనదైన మార్క్ కామెడీతో ఆకట్టుకుంటున్నారు. ఇక జబర్దస్త్ ఒక్కటే కాకుండా, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీలో వచ్చే స్పెషల్ షోస్ లో కనిపిస్తూ... అలరిస్తున్నారు. అయితే అప్పారావు... త్వరలో జబర్ధస్త్ లోకి వెళ్లనున్నారట. షో నిర్వాహకులు ఆయనను సంప్రదించారని తెలుస్తోంది.

Jabardasth Appa Rao

అయితే గతంలో కూడా జబర్ధస్త్ అప్పారావుకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు వచ్చి పోయిందట. మరి ఈసారి అయినా... ఆఫర్ దక్కుతుందా.. షోలోకి వెళ్లి అలరిస్తారా అనేది తెలియాలి. ఇక ఇప్పటికే జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ కూడా కన్ఫార్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో ముక్కు అవినాష్ వచ్చి... బాగానే సంపాదించాడు. జబర్ధస్త్ షో మిస్ అయినా... మా టీవీలో పలు షోలు చేసుకుంటూ బాగానే సెట్ అయ్యాడు.

మరి ఈ సారి అప్పారావు ఈ అవకాశాన్ని చెజిక్కించుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సింది. ఇక ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ ఆఖరు వారంలో ప్రారంభం కానుందట. ఇక ఇప్పటికే ఈ షోలో శోభా శెట్టి, సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ స్వేత నాయుడు, యాంకర్ దీపిక పిల్లి, దుర్గారావు కపూల్, సింగర్ సాకేత్, సురేఖ వాణి, సంతోషం సురేష్ వంటి వారు బిగ్ బాస్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమర్ దీప్, తేజస్వీని జంట రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X