నాగబాబు, చంద్ర జబర్ధస్త్‌ను వీడడానికి కారణం ఇదే.. నోరు జారిన కమెడియన్!

By Manoj Kumar P

చాలా ఏళ్లుగా తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా హై టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న షో జబర్ధస్త్. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ఈ కామెడీ షోకు ఆరంభం నుంచే భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. దీంతో వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షోను.. రెండు రోజులకు పెంచారు. ఈ క్రమంలోనే ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది జబర్ధస్త్ యూనిట్. ఇక, ఈ మధ్య ఈ షో నుంచి నాగబాబు బయటకు వెళ్లడం కలకలం రేపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జబర్ధస్త్‌ను వీడడానికి అసలు కారణం ఇదేనంటూ ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా ఏడేళ్లు

ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా ఏడేళ్లు

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రజాదరణ పొందిన షోలలో జబర్దస్త్ కామెడీ షో ఒకటి. 2013లో ప్రారంభమైన ఈ షో.. అప్పటి నుంచి విజయవంతంగా ప్రదర్శితమవుతూనే ఉంది. అదే సమయంలో ఎన్నో టీఆర్పీ, యూట్యూబ్ రికార్డులను సైతం ఈ కామెడీ షో క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

 ఆ ఇద్దరూ రెండు కళ్లు.. వీళ్లకూ ఫాలోయింగ్

ఆ ఇద్దరూ రెండు కళ్లు.. వీళ్లకూ ఫాలోయింగ్

జబర్ధస్త్ విజయవంతం అవడం వెనుక ఆర్టిస్టుల శ్రమతో పాటు దానికి న్యాయ నిర్ణేతలుగా పని చేసిన సీనియర్ హీరోయిన్ రోజా... మెగా బ్రదర్ నాగబాబు పాత్ర కూడా చాలా ఉంది. వీళ్లిద్దరూ షోకు ఎంతగా ప్లస్ అయ్యారో.. దాని వల్ల వాళ్లిద్దరూ అంతే స్థాయిలో పాపులర్ అయ్యారు. ఇక, వీరితో పాటు యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్ కూడా క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

 నాగబాబు జంప్.. వాళ్లూ ఆయనతో పాటే

నాగబాబు జంప్.. వాళ్లూ ఆయనతో పాటే

అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మెగా బ్రదర్ నాగబాబు.. జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఏడేళ్ల బంధానికి బ్రేకప్ చెప్పారు. ఆయనతో పాటు టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీతో పాటు మరికొందరు కూడా బయటకు వెళ్లిపోయారు. అయితే, జబర్ధస్త్ యూనిట్‌తో ఉన్న అగ్రిమెంట్ కారణంగా కొందరు వెనక్కి వచ్చేసిన విషయం తెలిసిందే.

మరో చానెల్‌లోకి ఎంట్రీ... అదిరింది అంటూ

మరో చానెల్‌లోకి ఎంట్రీ... అదిరింది అంటూ


జబర్ధస్త్‌ను వీడిన నాగబాబు అండ్ టీమ్ మరో ఛానెల్‌లోకి ఎంటర్ అయిన సంగతి విధితమే. వీళ్లంతా కలిసి ‘అదిరింది' అనే కామెడీ షోను ప్రారంభించారు. దీనికి జబర్ధస్త్ మాజీ టీమ్ లీడర్లు ధన్‌రాజ్, వేణుతో పాటు ‘పటాస్' షో నుంచి వచ్చిన సద్దాం, యాదమ్మ రాజు, హరి జట్లుగా ఏర్పడ్డారు. వీరితో పాటే చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ కూడా పని చేస్తున్నారు.

వాళ్లంతా జబర్ధస్త్ నుంచి ఎందుకెళ్లారు.?

వాళ్లంతా జబర్ధస్త్ నుంచి ఎందుకెళ్లారు.?

జబర్ధస్త్‌కు మొదటి నుంచీ దర్శకత్వం వహిస్తూ వచ్చిన నితిన్, భరత్ మొదట ఆ షో నుంచి బయటకు వెళ్లారు. ఆ వెంటనే నాగబాబు కూడా దానికి గుడ్‌బై చెప్పారు. ఆయనతో పాటు జబర్ధస్త్ టీమ్ లీడర్లు కూడా దూరమయ్యారు. అప్పట్లో ఇది టెలివిజన్ రంగంలో కలకలం రేపింది. అదే సమయంలో వాళ్లంతా ఎందుకెళ్లిపోయారన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమయ్యాయి.

ప్లాన్ ప్రకారమే వాళ్లంతా జంపింగ్.!

ప్లాన్ ప్రకారమే వాళ్లంతా జంపింగ్.!

నాగబాబు అండ్ టీమ్ జబర్దస్త్‌ను వీడి చాలా రోజులు గడుస్తున్నా... వాళ్లంతా షోను ఎందుకు వీడారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దాని ప్రకారం... వాళ్లంతా ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చేశారట. అందుకే అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరుగా షో నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
జబర్ధస్త్ కమెడియన్ ఏం చెప్పాడంటే..

జబర్ధస్త్ కమెడియన్ ఏం చెప్పాడంటే..

జబర్ధస్త్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో అప్పారావు ఒకరు. చాలా కాలంగా ఆ షోలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన.. నాగబాబుతో పాటు మరికొందరు జబర్ధస్త్‌ను వీడడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘వాళ్లంతా వలస వెళ్లినట్లు ఒకరి తర్వాత ఒకరు వెళ్లారు. అయినా షోకు నష్టం జరగలేదు. కానీ, నాగబాబు గారు లేని లోటు మాత్రం కనిపిస్తోంది' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X