ఆ సినిమాలో నన్నే హీరో అనుకున్నారు.. సంపూ నాతో ఈ మాట చెప్పాడు: జబర్ధస్త్ అప్పారావు

ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే కామెడీ షో 'జబర్ధస్త్' ద్వారా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో అప్పారావు ఒకరు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈయన ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ దక్కని గుర్తింపు 'జబర్ధస్త్'లో చేసిన తర్వాత దక్కింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.

డబ్బు పిచ్చి ఉంది

డబ్బు పిచ్చి ఉంది

మీకు డబ్బు పిచ్చి ఎక్కువ అని విన్నాము. అది నిజమేనా అని యాంకర్ అన్న పశ్నకు ‘అవును నాకు డబ్బు పిచ్చి ఉంది. డబ్బులంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు డబ్బులు లేవు కాబట్టి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎన్నో బాధలు అనుభవించాను. నా కూతురి పెళ్లి కూడా నా భార్య కష్టంతో చేశాం' అని అప్పారావు బదులిచ్చారు.

ఇప్పుడే అవకాశాలు వచ్చాయి

ఇప్పుడే అవకాశాలు వచ్చాయి

తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయన్న విషయంపై స్పందిస్తూ.. ‘నేను జబర్ధస్త్‌కు రాక ముందు సుమారు 50 సినిమాల్లో నటించాను. అప్పుడు నన్ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ, షోకు వచ్చిన తర్వాత దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించాను. ఏ వేషం ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు' అని అప్పారావు చెప్పుకొచ్చారు.

ఆ సినిమాకు నన్ను హీరో అనుకున్నారు

ఆ సినిమాకు నన్ను హీరో అనుకున్నారు

ఓ సినిమాకు తనను హీరోగా అనుకున్నారని అప్పారావు చెప్పారు. ‘‘వేర్ ఈజ్ విద్యాబాలన్' సినిమా షూటింగ్ సమయంలో నేను సంపూర్ణేశ్ బాబుకు అసిస్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆ సమయంలో ఆయన నాకు ఒక విషయం చెప్పాడు. అది విన్న వెంటనే నేను షాకైపోయాను. అదేమిటంటే.. ఆయన నన్ను పిలిచి.. బాబాయ్ హృదయ కాలేయం సినిమాకు ఫస్ట్ మిమ్మల్ని హీరోగా పెడదామని అనుకున్నారు. కాకపోతే అప్పటికి మీరు చాలా సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ చేసి ఉన్నారు. అందుకే నాకు అవకాశం కల్పించారు. లేకపోతే ఆ సినిమా మీతోనే చేసేవారన్నాడు'' అని వివరించారు.

అవి గుర్తింపునిచ్చాయి

అవి గుర్తింపునిచ్చాయి

అప్పారావుది విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం గ్రామం. పీయూసీ పూర్తిచేసి అనంతరం సినిమా రంగంలోకి ప్రవేశించిచారు. తన తొలిగురువు ఎల్‌ సత్యానందం మాస్టారు. ఆయనకు బీవీ రమణ దర్శకత్వంలో ‘శుభవేళ' తొలి చిత్రం. ఆ తర్వాత ఆయనకు ‘గోపి.. గోపికా గోదావరి', ‘వేదం', ‘నేనింతే', ‘శ్రీఆంజనేయం', ‘చందమామ', ‘మనం', ‘మినుగురులు' గుర్తింపును ఇచ్చాయని ఈ సందర్భంగా వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X