అలా మొదలైంది, రష్మి-సుడిగాలి సుధీర్ ప్రేమ, పెళ్లి మ్యాటర్ వెనక నిజం ఇదే...
జబర్దస్త్ స్టార్స్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోకు చెందిన ఏ ఆర్టిస్ట్ మీడియా ముందుకు వచ్చినా సుధీర్-రష్మి టాపిక్ ప్రస్తావన వస్తుంది. తాజాగా జబర్దస్త్ అప్పారావుకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
మనది గ్లామర్ ప్రపంచం, ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో... రూమర్ అంతే ఉంటుంది. ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. పేపర్ వాళ్లు కూడా ''అని తెలుస్తోంది'' అని రాస్తారు. మన తాత ముత్తాతల నుంచి ఓ మాట ఉంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటుంటారు. ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఒక స్కిట్ కారణంగా ఈ రూమర్ వచ్చింది. అలా రష్మి-సుధీర్ మీద రూమర్లు పెరుగుతూ పోయాయి అని అప్పారావు చెప్పుకొచ్చారు.

ఆ స్కిట్ వల్లే ఈ రూమర్ వచ్చింది
‘అహనా పెళ్లంట' అనే స్కిట్ చేసేపుడు సుధీర్, రష్మికి పెళ్లి అని పెట్టారు. సంక్రాంతి ఓపిసోడ్లో ఇది జరిగింది. ఆ స్కిట్లో కలలో సుధీర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది డైరెక్టర్ల క్రియేటివిటీ. వారిద్దరి మధ్య ఉన్నదాన్ని తీసుకుని అలా స్కిట్ రాశారని... అప్పారావు వెల్లడించారు.

ఇద్దరూ అలాంటివేమీ చేయరు
సుడిగాలి సుధీర్ స్కిట్ అయినపుడే స్టేజీ ఎక్కుతాడు. అప్పటికప్పుడు చేసేస్తాడుర. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తారు. అక్కడ కూర్చుని రష్మితో మాట్లాడటం, ఎటైనా వెళ్లడం ఏమీ ఉండదు. షూటింగ్ అయిన తర్వాత ఎవరిదారిన వారు పోతారు. కానీ వారిపై రూమర్స్ మరోలా ఉన్నాయని... అప్పారావు తెలిపారు.

ఏదైనా ఉంటే తప్పకుండా బయటకు వస్తుంది
మేము ఎక్కడికి వెళ్లినా పది మందిలో 9 మంది ఈ విషయం అడుగుతారు. ఏంటి సార్ సుధీర్ గారికి, రష్మి గారికి పెళ్లి అయిపోయిందా? వారి మధ్య ఏదో ఉందంట అంటుంటారు. ఒక వేళ ఏదైనా ఉంటే అది తప్పకుండా బయటకు వస్తుంది.

రష్మి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది
రష్మి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎటువంటి యాటిట్యూడ్ చూపించదు. పొట్టి నరేష్ వెళ్లి పలకరించినా అంతే గౌరవం ఉంటుంది, టాప్ పెర్ఫార్మర్ చమ్మక్ చంద్రగారు వెళ్లినా అంతే గౌరవం ఉంటుంది. అలాగే అనసూయగారు కూడా... వీళ్లంతా మనం ఏ షో అయితే చేస్తున్నామో దానిపై అపారమైన గౌరవం, ఇష్టంతో చేస్తారు.

కెమిస్ట్రీ వర్కౌట్ అయితే అంతే
మనం ఒక సినిమాలో హీరో హీరోయిన్ చేశాం, లేదా అన్నదమ్ములుగా చేశాం... మన జోడీ బావుంది అనే టాక్ వస్తే మేనేజ్మెంట్ వీరి మీద కథలు రాయండి అంటుంటారు. ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ ఒకప్పుడు ఎక్కువ సినిమాల్లో ఒకే హీరోయిన్ ఉండేది. ఎందుకంటే వారి మధ్య కెమిస్ట్రీ అలా ఉండేది. రష్మి-సుధీర్ మధ్య నిజంగా ఏమైనా ఉంటే బయటకు వస్తుంది. వారి మధ్య ఏమీ లేదు. ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అని అప్పారావు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











