హృదయ కాలేయంలో సంపూ పాత్రను మిస్ చేసుకొన్న కమెడియన్ ఎవరో తెలుసా? ఎలా చేజారిందంటే?

ఫేమస్ కామెడీ షో 'జబర్ధస్త్' ద్వారా ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో అప్పారావు ఒకరు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఈ సీనియర్ కమెడియన్.. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ దక్కని గుర్తింపు 'జబర్ధస్త్'లో చేసిన తర్వాత దక్కింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హృదయ కాలేయం సినిమా ఫస్ట్ చాయిస్ తనేనని నిజం బయటపెట్టారు. ఆ వివరాలు మీకోసమే!

అలా అప్పారావు ఫేమస్
వైజాగ్‌కు చెందిన అప్పారావు చదువు పూర్తైన వెంటనే సినిమా రంగంలోకి వచ్చారు. తన సత్యానందం మాస్టారు దగ్గర శిక్షణ తీసుకున్న అనంతరం బీవీ రమణ దర్శకత్వంలో 'శుభవేళ' చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయనకు 'గోపి గోపికా గోదావరి', 'వేదం', 'నేనింతే', 'శ్రీఆంజనేయం', 'చందమామ', 'మనం' చిత్రాల్లో నటించి ఫేమస్ అయ్యారు.

Jabardasth Apparao Reveals The Truth About Hrudaya Kaleyam Movie Offer

జబర్ధస్త్ షోతో సెన్సేషన్
సినిమా నటుడిగా సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న అప్పారావు.. ఆ మధ్య జబర్ధస్త్ షోలోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో తనదైన కామెడీని పంచుతూ హైలైట్ అయ్యారు. అలా చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించిన అప్పారావు.. ఈ షోతో సెన్సేషన్‌గా మారిపోయారు. అలాంటిది కొన్నేళ్ల నుంచి ఆయన ఇందులో కనిపించడం లేదు. కానీ, సినిమాల్లో మాత్రం చేస్తున్నారు.

డబ్బు పిచ్చి ఉందంటూ
తాజాగా అప్పారావు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన 'చాలా మంది అనుకుంటున్నట్లుగా నాకు డబ్బు పిచ్చి ఉంది. డబ్బులంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు డబ్బులు లేవు కాబట్టి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎన్నో బాధలు అనుభవించా. నా కూతురి పెళ్లి కూడా నా భార్య కష్టంతో చేశాం' అని చెప్పుకొచ్చారు.

Jabardasth Apparao Reveals The Truth About Hrudaya Kaleyam Movie Offer

నాకు ఫోన్లు చేస్తున్నారు
ఆ తర్వాత జబర్ధస్త్ అప్పారావు కంటిన్యూ చేస్తూ.. 'నేను జబర్ధస్త్‌కు రాక ముందు సుమారు 50కి పైగా సినిమాల్లో నటించాను. కానీ, అప్పుడు నన్ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే ఈ షోకు వచ్చిన తర్వాత దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించాను. ఏ వేషం ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు. అంతలా జబర్దస్త్ నాకు పేరు తెచ్చింది' అంటూ గర్వంగా వెల్లడించారు.

హృదయ కాలేయం హీరో
జబర్ధస్త్ అప్పారావు కొనసాగిస్తూ.. ''వేర్ ఈజ్ విద్యాబాలన్' అనే సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో నేను హీరో సంపూర్ణేశ్ బాబు పాత్రకు అసిస్టెంట్‌గా ఉండే క్యారెక్టర్ చేశాను. ఆ సమయంలో ఆయన నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. అది ఏంటంటే.. ఆయన నాతో బాబాయ్ హృదయ కాలేయం సినిమాకు ఫస్ట్ మిమ్మల్ని హీరోగా అనుకున్నారని చెప్పాడు' అన్నారు.

Jabardasth Apparao Reveals The Truth About Hrudaya Kaleyam Movie Offer

అలా ఛాన్స్ మిస్సైంది
చివర్లో అప్పారావు మాట్లాడుతూ.. 'హృదయ కాలేయం సినిమాకు నన్నే హీరోగా అనుకున్నారట. కానీ, నేను చాలా సినిమాల్లో నటించి బాగా పేరు తెచ్చుకున్నాను. ఈ కారణంతోనే నాకు ఆ ఆఫర్ ఇవ్వకూడదని తర్వాత అనుకున్నారట. ఇలా నేను హృదయ కాలేయం సినిమా చేయలేకపోయాను' అని వివరించారు. అప్పారావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X