నాగబాబు చేసిన పనికి బాధేస్తోంది.. ఎందుకలా చేశాడో అర్థంకావడం లేదు: జబర్దస్త్ అప్పారావు

గత కొన్నేళ్లుగా జబర్దస్తీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందిచ్చిన నాగబాబు.. ఇటీవలే జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారు. కారణాలేమైనప్పటికీ ఆయన ఇలా హఠాత్తుగా తప్పుకోవడం బుల్లితెర ఆడియన్స్‌కి షాకిచ్చింది. అయితే తాజాగా నాగబాబు జబర్దస్త్ వీడటంపై జబర్దస్త్ కమెడియన్ అప్పారావు స్పందించారు. ఈ మేరకు జబర్దస్త్‌తో నాగబాబు అనుబంధం గురించి చెప్పారు. వివరాల్లోకి పోతే..

జబర్దస్త్ షో.. ఆ ఇద్దరిదే హవా

జబర్దస్త్ షో.. ఆ ఇద్దరిదే హవా

బుల్లితెరపై నవ్వుల హరివిల్లు జబర్దస్త్ కామెడీ షో. గత కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాలు పంచుతూ దూసుకుపోతున్న ఈ షోలో రోజా, నాగబాబు ఇద్దరిదే హవా అనడంలో అతిశయోక్తి లేదు. జబర్దస్త్ కమెడియన్స్ వేస్తున్న పంచ్ డైలాగ్స్ ఒకెత్తయితే.. ఈ ఇద్దరి నవ్వులు మరో ఎత్తు. అలానే ఈ షోలో జడ్జి స్థానంలో కూర్చొని కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నారు నాగబాబు, రోజా.

'జబర్దస్త్' కామెడీ షోకి నిండుదనం.. ఆయనే కీలకం

'జబర్దస్త్' కామెడీ షోకి నిండుదనం.. ఆయనే కీలకం

అందుకే నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవడం చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో 'జబర్దస్త్' అప్పారావు కూడా ఇదే విషయం తెలుపుతూ చాలా బాధేస్తోందని అన్నాడు. 'జబర్దస్త్' కామెడీ షోకి నిండుదనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి నాగబాబుగారు అని చెప్పారు.

ఇదే ఆయన ఇష్టానికి నిదర్శనం.. తెలియగానే షాకయ్యా

ఇదే ఆయన ఇష్టానికి నిదర్శనం.. తెలియగానే షాకయ్యా

జబర్దస్త్ కామెడీ షో అంటే నాగబాబుగారికి చాలా ఇష్టమని అప్పారావు చెప్పుకొచ్చాడు. ఆ మధ్య చాలా తీవ్రంగా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ ఆయన ఈ షోకి రావడం మానలేదని, ఇదే ఆయన ఇష్టానికి నిదర్శనమని ఆయన అన్నాడు. అలాంటిది ఆయన ఈ షో నుంచి ఎందుకు తప్పుకున్నారనే వార్త విని తాను షాక్ అయ్యానని చెప్పాడు అప్పారావు.

స్వయంగా నాగబాబు గారే చెప్పారు కాబట్టి

స్వయంగా నాగబాబు గారే చెప్పారు కాబట్టి

నాగబాబు గారు ఈ షో నుంచి తప్పుకోవడానికి గల కారణం పారితోషికం మాత్రం కాదని ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి.. ఆ వైపు నుంచి ఎలాంటి సందేహం లేనట్టే. ఏదేమైనా జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకోవడం బాధ కలిగించే విషయం అని అప్పారావు పేర్కొన్నాడు.

Recommended Video

Nagababu Re-Entry Rumors Into Jabardasth || Filmibeat Telugu
నాగబాబు షిఫ్ట్.. టీఆర్ఫీ రేటింగ్స్ చూస్తే

నాగబాబు షిఫ్ట్.. టీఆర్ఫీ రేటింగ్స్ చూస్తే

జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకొచ్చి జీ తెలుగులో 'అదిరింది' పేరుతో కొత్త షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో జబర్దస్త్ చూసే వాళ్లలో చాలామంది ఇకపై ఆ షో చూడటం మాని, ‘అదిరింది' చూస్తారని వార్తలు వచ్చాయి. కానీ టీఆర్ఫీ రేటింగ్స్ పరంగా చూస్తే ఈ షో 'జబర్దస్త్'ని ఢీ కొట్టలేకపోయిందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X