జబర్దస్త్ వేదికపై ఏడ్చేసిన రచ్చ రవి.. గతాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు
జబర్దస్త్ కామెడీ షోలో దశాబ్దానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతటి వినోదాన్ని అందిస్తుందో తెలిసిందే. షోలో ఎలాంటి మార్పులు జరిగినా ఆడియెన్స్ కు మాత్రం పక్కా ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తూనే వస్తున్నారు. 2013లో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా మారారు. తమ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కమెడియన్ రచ్చ రవి కూడా జబర్దస్త్ షో నుంచే వెలుగొందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్ల వార్షికోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు ప్రత్యేకమైన ఎపిసోడ్ ను షూట్ చేశారు. ఈ సందర్భంగా పాత ఆర్టిస్ట్ లను, జడ్జీగా వ్యవహరించిన నాగ బాబును కూడా ఇన్వైట్ చేశారు. రచ్చి రవి కూడా హాజరై భావోద్వేగం అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..
అసిస్టెంట్ డైరెక్టర్ టు కమెడియన్ గా..
రచ్చరవి హన్మకొండ ప్రాంతంలో పుట్టి పెరిగారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వాళ్ల నాన్న సాయిబాబా దగ్గర పనిచేశారు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరి కొన్నాళ్లు సినీ పాఠాలు నేర్చుకున్నారు. పుత్తడి బొమ్మ, శిఖరం సీరియల్స్ కు పనిచేశారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో నటించేందుకు చమ్మక్ చంద్ర నిర్వహించిన ఆడిషన్ లో నెగ్గాడు. జబర్దస్త్ వేదికపై చమ్మక్ చంద్రతో కలిసి ఎన్నో స్కిట్లలో నటించారు. తెలంగాణ యాస, భాషతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నాడు.

కన్నీళ్లు పెట్టుకున్న రచ్చ రవి..
జబర్దస్త్ కామెడీ షో నిర్వహించిన 12 ఏళ్లు పూర్తి కావడంతో నిర్వాహకులు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా షో ప్రారంభంలో కామెడీ పండించిన ఆర్టిస్ట్ లు వేణు వండర్స్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, చలాకీ చంటీ, గెటప్ శ్రీను, రచ్చ రవి వంటి వారు హాజరయ్యారు. మరోవైపు జడ్జీగా అలరించిన నాగ బాబు, యాంకర్ గా పనిచేసిన అనసూయ భరద్వాజ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రచ్చ రవి మాట్లాడుతూ.. నేను అన్నం తినేప్పుడు ప్రతి రోజూ గుర్తుకు వచ్చే వ్యక్తి చమ్మక్ చంద్ర అన్న. ఆ చంద్రుడు లేనిది ఈ స్యూరుడు లేడు. నా జీవితాన్ని నిలబెట్టింది చంద్రన్న అంటూ రచ్చరవి బాగా ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలిసారిగా రచ్చ రవి కంట నీరు చూడటంతో తోటి ఆర్టిస్ట్ లు కూడా ఎమోషనల్ అయ్యారు.
జోరుగా రచ్చ రవి సినిమాలు..
రచ్చ రవి తొలి చిత్రం వెయ్యి అబద్దాలు. ఈ చిత్రంలో కమెడీ రోల్ లో నటించారు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013లో విడుదలైంది. తొలుత చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన రచ్చ రవి రానురాను ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అలరించే స్థాయికి ఎదిగారు. ధనలక్ష్మి తలుపు తడితే, కిస్మత్, ఖైదీ నెం.150, శతమానం భవతి, రాజా ది గ్రేట్, నేనే రాజు నేనే మంత్రి, నీది నాదీ ఒకే కథ, గద్దలకొండ గణేష్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, రెడ్, క్రాక్, ఎఫ్3, లైగర్, వాల్తేరు వీరయ్య, భగవంత్ కేసరి, గేమ్ ఛేంజర్..రీసెంట్ గా రాం రాఘవం, బాపు, శ్రీశ్రీశ్రీ రాజావారు వంటి చిత్రాలతో అలరించారు.


Click it and Unblock the Notifications











