జబర్దస్త్ కు రోజా వస్తే తాట తీస్తాం.. బుల్లితెర ఫ్యాన్స్ వార్నింగ్‌పై వార్నింగ్స్

రోజా.. రోజా.. రోజా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కంటెంట్ లో ఆమె పేరునే ముందు ఉంది. నోటికి హద్దు అదుపులేకుండా మీడియా ముందు మాట్లాడి.. అటూ రాజకీయాలకు.. ఇటు సినిమాలకు రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది ఆమె పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉందన్న గర్వంతో.. పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టిపోసింది.

ఒక నటిగా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని తెలిసి కూడా.. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి నీచంగా మాట్లాడింది. మినిస్టర్ పదవిలో ఉండి.. మీడియా ముందు ఏం పీకలేరు.. వాడెంత.. వీడెంత అంటూ అసభ్యకరమైన భాషలో తిట్టిపోసింది. ఇక చివరికి పవన్ కు సపోర్ట్ గా నిలిచినందుకు జబర్దస్త్ కమెడియన్స్ ను కూడా వదలలేదు. ఆమె మాటలు విన్న ప్రజలకు విసుగు వచ్చింది. ఛీఛీ ఇలాంటి మనిషినా మేము గెలిపించింది అనుకున్నారో ఏమో కానీ, ఈసారి నగరి ప్రజలు.. రోజాను డిపాజిట్ కూడా లేకుండా ఓడించి పడేశారు.

jabardasth audience warns To Actress Roja if she return to ETV Show

నిజం చెప్పాలంటే ఆమె నోటి దూల వలనే వైసీపీ ఓడిపోయిందని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక రాజకీయాలు ముగియడంతో నెక్స్ట్ రోజా పరిస్థితి ఏంటి అనేది పెద్ద మిస్టరీగా మారింది. సినిమాల్లో నటిస్తుందా.. ? లేక తనకు పేరు తెచ్చిపెట్టిన జబర్దస్త్ కు మళ్లీ జడ్జిగా వెళ్తుందా.. ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రాకముందు నుంచే రోజా.. జబర్దస్త్ కు జడ్జిగా వస్తుందని వార్తలు వినిపించాయి.

ఇప్పటికే జబర్దస్త్ లో చాలా మార్పులు వచ్చాయి. రేటింగ్ లేక రెండుగా ఉన్న జబర్దస్త్.. ఇప్పుడు మళ్లీ ఒకటిగా మారింది. ఇంద్రజ జడ్జి స్థానం నుంచి తప్పుకుంది. అది రోజా కోసమే అని వార్తలు వచ్చాయి. ఈ వారం కాకపోతే వచ్చే వారం.. రోజా మళ్లీ జబర్దస్త్ జడ్జిగా మారనున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఈసారి రోజా ను జబర్దస్త్ లోకి తీసుకొస్తే సహించేది లేదని జబర్దస్త్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మల్లెమాల ఆమెను తీసుకొస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.

jabardasth audience warns To Actress Roja if she return to ETV Show

సిగ్గులేకుండా ఏ మొహం పెట్టుకొని మళ్లీ జబర్దస్త్ కు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో కింద దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆమెను మళ్లీ జడ్జిగా తీసుకొస్తే బాయ్ కాట్ చేస్తామని, రోజా ఓవర్ యాక్షన్ చూడలేమని చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా ఆ డైమండ్ రాణిని ఈ షోకు తీసుకొస్తే ఒక్కడు కూడా చూడడు అంటూ జబర్దస్త్ బాయ్ కాట్ అనే పేరుతో ట్రెండ్ చేస్తున్నారు.

మరి ఇలాంటి పరిస్థితిలో రోజా ఏం చేస్తుంది అనేది చూడాలి. ఎలాగూ ఐదేళ్లు ఆమె రాజకీయాల్లో ఖాళీగా ఉండాల్సిందే. అసలు నగరిలో తిరిగే ధైర్యం కూడా చేయలేదు. పోనీ సినిమాల్లో చేస్తుందా.. ? రీఎంట్రీ ఇస్తుందా.. ? అనేది తెలియదు. జబర్దస్త్ కు వస్తే ఫ్యాన్స్ ఇచ్చి పడేసేలా ఉన్నారు. ప్రస్తుతం రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకోపక్క మల్లెమాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X