డైరెక్టర్ గా ఆటో రాంప్రసాద్.. హీరో ఎవరంటే..?

ట్యాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు. ఒక పనిచేసేవారు ఇంకోపని చేయకూడదు అని రూల్ లేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలాంటివి చెల్లనే చెల్లవు. ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎవరు ఎప్పుడు స్టార్స్ అవుతారు.. ఏ స్టార్స్ ఎప్పుడు కింద పడతారు అనేది చెప్పడం చాలా కష్టం.

హీరోలు డైరెక్టర్లులుగా మారొచ్చు.. డైరెక్టర్లు హీరోలుగా మారొచ్చు. చివరికి కమెడియన్స్ కూడా డైరెక్టర్స్ గా సినిమాలు తీయొచ్చు. లక్ బావుంటే వేణులా హిట్ అందుకోవచ్చు. అవును.. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ ఇప్పుడు వెండితెరపై ఏలడానికి రెడీ అవుతున్నారు. కొందరు హీరోలుగా.. కొందరు డైరెక్టర్స్ గా.. మరికొందరు నిర్మాతలుగా మారి తమ సత్తా చాటుతున్నారు.

Jabardasth Auto Ram Prasad going to become director

మిగతావారి గురించి పక్కన పెడితే.. జబర్దస్త్ అంటే గుర్తొచ్చే ముగ్గురు స్నేహితులు.. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను. మొదటి నుంచి వీరు ముగ్గురు మంచి స్నేహితులుగానే కొనసాగుతున్నారు. ఒక్కొక్కరుగా జబర్దస్త్ నుంచి బయటపడి వెండితెరపై అడుగుపెడుతూ వస్తున్నారు. గెటప్ శ్రీను కమెడీయన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు రాజు యాదవ్ సినిమాతో హీరోగా మారాడు.

ఇక సుడిగాలి సుధీర్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించి ఇప్పుడు మూడో సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇద్దరు స్నేహితులకు భిన్నంగా రాంప్రసాద్ .. హీరోగా కాకుండా డైరెక్టర్ గా మారడానికి సిద్ధమవుతున్నాడని టాక్. ఇప్పటికే బలగం సినిమాతో వేణు యెల్దండి స్టార్ డైరెక్టర్ గా మారాడు. త్వరలోనే ధన రాజ్ రామం రాఘవం సినిమాతో డైరెక్టర్‌గా మారుతున్నాడు. ఇప్పుడు రాంప్రసాద్ సైతం తన ట్యాలెంట్ ను నిరూపించుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన, శ్రీను, సుధీర్ ను హీరోలుగా పెట్టి ఒక సినిమా తీయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంచి కథను కూడా రాసుకున్నాడట. అది కూడా ఒక మంచి కామెడీ ఎంటర్ టైనర్. రాంప్రసాద్ పంచ్ ల గురించి జబర్దస్త్ చూసేవారికి పర్టిక్యులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పంచ్ లు ఈ సినిమాలో మస్త్ ఉండబోతున్నాయట.

ప్రస్తుతం ఈ కథను ఒక స్టార్ ప్రొడ్యూసర్ విని ఓకే కూడా చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ముగ్గురు స్నేహితుల సినిమా అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాతో ఆటో రాంప్రసాద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాంప్రసాద్ ఒకపక్క జబర్దస్త్ షో చేస్తూనే సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. మరి డైరెక్టర్ గా మారడానికి జబర్దస్త్ ను వదిలేస్తాడా.. ? లేక కంటిన్యూ చేస్తాడా.. ? అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X