twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి, అరియానాతో అలాంటి రిలేషన్.. బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందు దారుణంగా.. అవినాష్ ఎమోషనల్

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో ముక్కు అవినాష్ ప్రయాణం ద్విగిజయం అయింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో ఇంట్లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ కమెడియన్ తనదైన కామెడీతో ఉగ్రరూపం చూపించారు. బిగ్‌బాస్ 4 సీజన్ ముగిసిన తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ..

    నన్ను ఏ పేరుతో పిలిచానా ఫర్వాలేదంటూ

    నన్ను ఏ పేరుతో పిలిచానా ఫర్వాలేదంటూ

    నన్ను ప్రేమగా రకరకాలుగా ప్రేమతో పిలుచుకొంటారు. జబర్దస్త్ అవినాష్, ముక్కు అవినాష్, బిగ్‌బాస్ అవినాష్, ఎంటర్‌టైనర్ అనే పేర్లతో పిలుస్తుంటారు. ప్రేక్షకులు, అభిమానులు ఎలా పిలిచినా నాకు సంతోషమే. నన్ను ఎలా పిలుస్తున్నారనేది కాదు.. ఎలాంటి ప్రేమను కురిపిస్తున్నారనే ముఖ్యంగా భావిస్తాను అని అవినాష్ తెలిపారు.

     నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేని సమయంలో

    నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేని సమయంలో

    నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లే సమయానికి నాకు చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. నా తల్లిదండ్రులు ఆరోగ్యం బాగాలేదు. అలాగే నేను షోలోకి వెళ్లే ముందు మా నాన్నకు కరోనావైరస్ పాజిటివ్ అని తెలిసింది. 60 ఏళ్లకుపైగా ఉన్న మా నాన్న ఆరోగ్యం ఎలా ఉంటుందోననే విషయం నన్ను వెంటాడింది. అలాంటి పరిస్థితిలో అడుగుపెట్టి బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైనర్‌గా మారాను అని ముక్కు అవినాష్ అన్నారు.

     10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది

    10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది

    బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు నాకు మరో సంస్థతో అగ్రిమెంట్ ఉండేది. బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే అగ్రిమెంట్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. వారికి 10 లక్షల రూపాయాలు కట్టాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అంత మొత్తం కట్టాల్సి రావడం నాకు కష్టంగా మారింది. బిగ్‌బాస్‌లో ఉండాలనే కసి పెరిగింది అని అవినాష్ తెలిపారు.

    అరియానా బిగ్‌బాస్ విన్నర్ అవుతారని..

    అరియానా బిగ్‌బాస్ విన్నర్ అవుతారని..

    బిగ్‌బాస్ తెలుగు 4 విజేత అరియానా అవుతుందని భావించా. కానీ అరియానా విన్నర్ కాకపోవడంపై బాధపడ్డాను. ఇంటిలో అందరి కంటే గొప్పగా ఆడింది. కంటెస్టెంట్ల అందరితో పోటీ పడి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందుకే ఆమె డిఫెనెట్‌గా విజేత అవుతుందని అనుకొన్నాను అని అవినాష్ అభిప్రాయపడ్డారు.

    మిస్ యూ అవినాష్ అంటూ..

    మిస్ యూ అవినాష్ అంటూ..

    అరియానా ఎలిమినేట్ అయి వచ్చిన తర్వాత ఎమోషనల్ అయ్యారు. మిస్ యూ అవినాష్ అన్నారు. నీవు కోరుకొన్నది సాధించలేకపోయాను. విన్నర్ కాలేకపోయానని బాధపడ్డారు. అయితే నీ ప్రయత్నం నీవు చేశావని.. ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. ఎలిమినేషన్ తర్వాత నాతోనే కూర్చొని ఉన్నారు. ఆ సందర్బంగా చాలా విషయాలు మాట్లాడుకొన్నాం అని అవినాష్ తెలిపారు.

     అరియానా నా కంటే హైపర్..

    అరియానా నా కంటే హైపర్..

    ఇంటిలో మా ఇద్దరి కెమిస్ట్రీ అనడం కంటే మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరింది. ఆమె హైపర్.. నేను కూడా హైపర్. అలా మా జోడి సెట్ అయింది. టాస్క్‌ల సందర్భంగా మేమిద్దరం పోటీపడి నటించాం. నేను ఏదైనా చేస్తే దానికి ఇంప్రూవ్ చేసి మరింత బెటర్‌గా తన వెర్షన్‌లో చేశారు. అరియానా ఓ పాయింట్ తీసుకొని కరెక్ట్‌గా మాట్లాడటం నాకు బాగా నచ్చుతుంది. ముక్కుసూటిగా మాట్లాడటం అన్ని సమయాల్లో కరెక్ట్ కాదు అని అవినాష్ అన్నారు.

     శ్రీముఖితో నాకు క్లోజ్ రిలేషన్

    శ్రీముఖితో నాకు క్లోజ్ రిలేషన్

    ఇండస్ట్రీలో నాకు బాగా సపోర్ట్ చేసే వాళ్లలో శ్రీముఖి ఒకరు. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. పటాస్ షో సందర్బంగా పెరిగిన పరిచయం ఇంకా బలంగా మారింది. ఎలాంటి సమయంలోనైనా నాకు ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. అలాగే అరియానా కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. నేను అరియానాకు కూడా సపోర్ట్ చేయాలని అనుకొంటున్నాను అని అవినాష్ తెలిపారు.

    English summary
    Jabardasth Avinash about Bigg Boss Telugu 4 journey and Sreemukhi, Ariana Glory. Abijeet Duddala emotional winning speech with Bigg Boss Telugu 4 Trophy before Chiranjeevi and Nagarjuna. Chiranjeevi bumper offer to Divi Vadhtya: Megastar leaks Vedalam Telugu remake details.Bigg boss telugu 4 grand finale updates.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X