పెళ్లి చేసుకొందాం.. నీవు లేకుండా పెళ్లా? అరియానాకు షాకిచ్చిన అవినాష్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు ముందు అరియానా గ్లోరి అంటే యాంకర్‌గా అతికొద్ది మందికే తెలుసు. ఆ తర్వాత అరియానాకు ఫాలోయింగ్ మామూలుగా లేదనే విషయం స్పష్టమైంది. బిగ్‌బాస్ ఇంటిలో అరియానాతో అవినాష్‌తో కెమిస్ట్రీ, ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ విశేషంగా ఆకట్టుకొన్నాయి. బిగ్‌బాస్ అనంతరం మీడియాలకు ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయారు.. తాజాగా ఓ ఛానెల్ లైవ్ ఇంటర్వ్యూలో అరియానాతో అవినాష్ ఎలా అడుగొన్నాడంటే...

Aviana ట్యాగ్ ట్రెండింగ్‌తో

Aviana ట్యాగ్ ట్రెండింగ్‌తో

బిగ్‌బాస్ ఇంటిలో అరియానా, అవినాష్ కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సున్నితమైన రొమాన్స్, కామెడీతో వారి జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్‌బాస్‌లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా Aviana ట్యాగ్ ట్రెండింగ్ మారింది.

అరియానా మీరంటే చచ్చెంత ఇష్టం

అరియానా మీరంటే చచ్చెంత ఇష్టం

అరియానా లైవ్‌లో ఉండగా.. నేను మీ అభిమానిని. మాది మచిలిపట్నం. మీరంటే చచ్చెంత ప్రాణం. మీరు ఇంత అందంగా ఎలా పుట్టారు. అవినాష్‌తో మీ కెమిస్ట్రీ బాగుంటుంది అంటూ దాదాపు మూడు నిమిషాలు ఏకధాటిగా అవినాష్ మాట్లాడుతుంటే అరియానా థ్రిల్ అవుతూ కనిపించింది.

నీ గొంతును గుర్తు పట్టలేదంటూ

నీ గొంతును గుర్తు పట్టలేదంటూ

చివరకు తనతో మాట్లాడింది అవినాష్ అని తెలిశాక అరియానా నోరు వెళ్లబెట్టింది. అవినాష్ నీ గొంతును అసలు గుర్తే పట్టలేదు అంటే.. నేను మిమిక్రీ ఆర్టిస్టును అంటూ అవినాష్ ఝలక్ ఇచ్చారు. అవినాష్ మాటలకు స్పందిస్తూ.. నా మనుషుల అనే వారి దగ్గరే పప్పులో కాలేస్తాను. నిజంగా నిన్ను గుర్తు పట్టలేదు అంటూ అరియానా చెప్పారు.

 నీవు లేకుండా పెళ్లా?

నీవు లేకుండా పెళ్లా?

అయితే నా జీవితంలో పెళ్లి అనేది మిగిలి ఉంది. దానిపై ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకోవాలనుకొంటున్నాను అని అవినాష్‌కు చిన్న షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే నేను లేకుండా నీ పెళ్లి ఎలా అవుతుంది అంటూ అవినాష్ తిరిగి షాకిచ్చాడు. అలా ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకొంటూ వెళ్లారు.

 పెళ్లి చేసుకొందాం అరియానా

పెళ్లి చేసుకొందాం అరియానా

అలా అరియానాతో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకొందాం అరియానా అంటూ కామెంట్ వదిలాడు. దాంతో అరియానా ఏంటి అవినాష్ అంటూ కంగారు పడింది. ఈ మధ్య ప్రతీ ఒక్కరు నా పెళ్లి గురించి అడుగుతున్నారు. అందరికి పెళ్లి చేసుకొందాం అంటూ చెప్పుకొంటూ వస్తున్నాను అంటూ అవినాష్ క్లారిటీ ఇచ్చారు.

అరియానాతో చిరకాలం ఫ్రెండ్‌షిప్

అరియానాతో చిరకాలం ఫ్రెండ్‌షిప్

ఇక లైవ్‌లో అవినాష్‌తో కలిసి షో చేస్తున్న వార్తలకు అరియానా చెక్ చెప్పింది. ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. ఒకవేళ భవిష్యత్‌లో ఎలాంటి ఆఫర్ వస్తే అవినాష్‌తో తప్పకుండా షో చేస్తానని అరియానా క్లారిటీ ఇచ్చింది. అవినాష్‌తో లైఫ్ లాంగ్ ఫ్రెండ్ షిప్ ఉంటుందని అరియానా అన్నారు. నీకు కోపం వచ్చినా.. నాకు కోపం వచ్చినా నేను నీతో మాట్లాడుతూనే ఉంటానని అవినాష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X