సీక్రెట్ ఒప్పందాలు, రెమ్యునరేషన్లను లీక్ చేసిన అవినాష్... కంటెస్టెంట్లపై బిగ్‌బాస్ సీరియస్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ విజయవంతంగా ముగిసింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన సెలబ్రిటీలు మీడియాతో ముచ్చటిస్తూ తమ అనుభవాలను పంచుకొంటున్నారు. తాజా అవినాష్ బిగ్‌బాస్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలను బయటపెట్టారు. అవినాష్ లీక్ చేసిన సీక్రెట్స్ ఏమిటంటే..

ఎప్పటికీ జబర్దస్త్ టాప్ షోనే

ఎప్పటికీ జబర్దస్త్ టాప్ షోనే

నేను బయటకు వెళ్లడం వల్ల జబర్దస్త్‌పై ప్రభావం పడే అవకాశం లేదు. ఎందుకంటే ఆ షో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో. క్రియేటివిటి పరంగా కొంత ఇబ్బంది కలుగవచ్చు. ఎవరు ఉన్న లేకపోయినా జబర్దస్త్ మాత్రం టాప్‌లోనే కొనసాగుతుంది. మళ్లీ పిలిస్తే నేను జబర్దస్త్‌కు వెళ్లడానికి రెడీ అని అవినాష్ తెలిపారు.

రెండేళ్ల కాంట్రాక్టుతో ఇబ్బందులు..

రెండేళ్ల కాంట్రాక్టుతో ఇబ్బందులు..

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు రెండేళ్ల కాంట్రాక్టు ఉన్నందున్న వారు అనుమతి ఇవ్వలేదు. నేను వెళ్లాలని నిర్ణయించుకొన్న సమయంలో రూ.10 లక్షల జరిమానా కింద కట్టి వెళ్లాలని అనుకొన్నాను. అయితే ఆ సమయంలో నా వద్ద అంత డబ్బు లేదు. కాబట్టి నా స్నేహితులు సహాయం చేయడం రూ.10 లక్షలు కట్టి బిగ్‌బాస్‌లోకి వెళ్లాను అని అవినాష్ చెప్పారు.

బిగ్‌బాస్ నాకు భారీ రెమ్యునరేషన్

బిగ్‌బాస్ నాకు భారీ రెమ్యునరేషన్

జబర్దస్త్‌కు నేను జరిమానా కట్టి వెళ్లేందుకు సిద్దపడిన నేపథ్యంలో బిగ్‌బాస్‌లో భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేశాను. నేను డిమాండ్ చేసిన మొత్తాన్ని వారు ఇచ్చారు. వారితో ముందుగానే మాట్లాడుకోని బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లాను. జబర్దస్త్ కంటే రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందనే రుజువు చేసుకొన్న తర్వాతే షోలో పాల్గొనేందుకు ఒప్పుకొన్నాను అని అవినాష్ తెలిపారు

నాగబాబు హామీ ఇవ్వలేదు..

నాగబాబు హామీ ఇవ్వలేదు..

బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందు నాగబాబు నాకు హామీ ఇచ్చారనే విషయం అవాస్తవం. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఎలాంటి హామీ ఎవరు ఇవ్వలేదు. నాగబాబు ఆఫర్ ఇస్తే తప్పకుండా తీసుకొంటాను. నాకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయంపై క్లారిటీ లేదు. మిగితా వారి రెమ్యునరేషన్లు తెలిస్తే నా పారితోషికం ఎక్కువనా తక్కువనా అనేది తెలుస్తుంది అని అవినాష్ పేర్కొన్నారు.

 ఏడాదిపాటు బిగ్‌బాస్ ఆంక్షలు

ఏడాదిపాటు బిగ్‌బాస్ ఆంక్షలు


బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లకు నిర్వాహకులు సీరియస్ ఆంక్షలు పెడుతారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంవత్సరం పాటు మరే షోలో పాల్గొనకూడదు. కాబట్టి ఇంటిలోకి వెళ్లిన వాళ్లు వేరే షోలో చేయడానికి సంవత్సరం పాటు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు నేను మరే షోలో పాల్గొనే అవకాశం లేదు అని అవినాష్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X