సోహైల్, అవినాష్ బిగ్ ఫైట్.. ముఖం పగలకొడతానని అఖిల్ హెచ్చరిక.. ఇంటి కెప్టెన్‌గా ఎవరంటే
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా 38వ రోజు కూడా అమీ తుమీ టాస్క్‌లో భాగంగా డీల్స్ జరిగాయి. పేడ టబ్‌లో నుంచి 100 కాయిన్స్ తీయడం, ముఖానికి స్టాక్స్ ధరించి అవినాష్ అరటిపండ్లు తినడం, అలాగే కుర్చీలో నుంచి అఖిల్‌ను లేపేలా అరియానా టీమ్ చేయడంలాంటి డీల్స్‌తో ఎపిసోడ్ సాగింది. అయితే పేడ లోనుంచి కాయిన్స్ తీయడంలో దివి విఫలమైంది. అవినాష్, అఖిల్ తమ టాస్కుల్లో విజయం సాధించారు. 38వ రోజు ఏం జరిగిందంటే..

చివరి డీల్‌లో నోయల్ ఎలిమినేషన్‌కు నామినేట్
ఇంటిలో చివరి డీల్‌గా ఓ టాస్క్‌ను బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దానికి 30 కాయిన్లు డీల్ ఉంటుందని చెప్పారు. బెల్ కొట్టిన విషయంలో అఖిల్, అరియానా మధ్య చిన్న గొడవ జరిగింది. డీల్ ప్రకారం వచ్చే వారం స్వయంగా నామినేట్ కావాల్సి ఉంటుంది. అఖిల్ టీమ్ బెల్ కొట్టడంతో డీల్ చేసే అవకాశం వారికే వచ్చింది. నోయల్ సీన్ సొంతంగా తనకు తానే నామినేట్ అయ్యారు.

సోహైల్ వర్సెస్ అవినాష్ ఫైట్
ఇక సంచాలకుడిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యాడని అవినాష్ ఆరోపించారు. అయితే తన నిర్ణయమే ఫైనల్ అని సోహైల్ దురుసుగా చెప్పడంతో అవినాష్ కౌంటర్ ఇచ్చారు. చిన్న పిల్లల్ల మాట్లాడకు అంటూ అవినాష్ అన్నాడు. ఆ విషయంపై ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నాకు కోపం వస్తే ఇలానే అరుస్తా.. అవసరమైతే నవ్విస్తా.. కొపగించుకొంటా అని అవినాష్ గట్టిగా అరిచాడు.

సోహైల్‌కు అఖిల్ వార్నింగ్
అవినాష్ మాటలను భరించలేక సోహైల్ కోపంతో ఊగిపోయాడు. నరాలు బిగబట్టి వాష్ రూమ్‌లోకి వెళ్లి కోపంతో కుర్చీని గట్టిగా చేతితో కొట్టాడు. అఖిల్ వచ్చి కోపగించుకోవడంతో కాస్త తగ్గాడు. ముఖం పగలకొడుతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ వద్ద భోరుమని ఏడ్చాడు.
Recommended Video

కెప్టెన్‌గా నోయల్ సీన్, రేషన్ మేనేజర్‌గా మెహబూబ్2
అమీ తుమీ టాస్క్‌లో అఖిల్ టీమ్ విజయం సాధించడంతో కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపికయ్యారు. కెప్టెన్సీ కోసం జరిగిన గేమ్‌లో తలతో గోల్ కొట్టే ఫుట్‌బాల్ ఆటను ఆడించారు. అత్యధికంగా గోల్ కొట్టిన నోయల్ సీన్ ఇంటి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంటి రేషన్ మేనేజర్‌గా మెహబూబ్‌ను నోయల్ తీసుకొన్నాడు.


Click it and Unblock the Notifications











