తొలిరోజే కెప్టెన్‌ అవినాష్ తడాఖా.. ఇంటి సభ్యులపై కొరడా.. అరియానాకు మోనాల్ షాక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 4లో 46వ రోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అప్పటికే కెప్టెన్సీకి పోటీకి ఎంపికైనా అరియానా, అవినాష్ సిద్ధమయ్యారు. బండి తోయరా బాబు టాస్క్‌ను పోటీ దారుల మధ్య ఉంచారు. కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులను బతిమాలడుకొంటూ ఆ ఇద్దరు పోటీదారులు ప్రచారం చేసుకొన్నారు. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారంటే..

ఎనిమిదో వారానికి కెప్టెన్‌గా

ఎనిమిదో వారానికి కెప్టెన్‌గా

బిగ్‌బాస్ ఇంటికి ఎనిమిదో వారానికి కెప్టెన్‌గా ఎంపిక చేసే టాస్క్ మొదలైంది. కెప్టెన్సీ రేసులో ఉన్న అరియానా, అవినాష్‌కు బిగ్‌బాస్ బండి తోయరా బాబు అనే టాస్క్‌ను ఇచ్చారు. తోపుడు బండిలో తీసుకెళ్లి తన స్టేషన్ వద్ద ఎక్కువ మందిని చేర్చుతారో వారు ఇంటి కెప్టెన్ అవుతాడు అని బిగ్‌బాస్ నియమాలు చెప్పారు. ఆ తర్వాత అరియానా, అవినాష్ మధ్య పోటీ మొదలైంది.

తోపుడు బండ్లపై టాస్క్

తోపుడు బండ్లపై టాస్క్

అరియానా, అవినాష్ తమకు కేటాయించిన తోపుడు బండ్లపై ఇంటి సభ్యులను బుజ్జగించి తమ బండిపై ఎక్కించుకొన్నారు. అలా అరియానా ఐదుగురు సభ్యులను, అలాగే అవినాష్ కూడా ఐదుగురు సభ్యులను తమ కేటాయించిన స్టేషన్‌లో దించారు. దీంతో వారి మధ్య టాస్క్ టైగా మారింది.

అవినాష్, అరియానా టాస్క్ టైగా

అవినాష్, అరియానా టాస్క్ టైగా

అవినాష్, అరియానా మధ్య టాస్క్ టైగా మారడంతో మళ్లీ టాస్క్‌ను నిర్వహించి ఎవరి స్టేషన్ వద్ద ఎక్కువ మంది ఉంటారో వారే కెప్టెన్ అవుతారని మళ్లీ రూల్ చెప్పారు. రెండోసారి టాస్క్‌లో కూడా ఓ దశలో సమానంగా సభ్యులు ఉండటంతో వారిద్దరు బతిమలాడుకొన్నారు. తొలుత అరియానాకు సపోర్ట్ చేసిన మోనాల్ ఆ తర్వాత అవినాష్ క్యాంపులోకి జారుకోవడంతో షాక్ గురిచేసింది. మోనాల్‌ను కన్విన్స్ అయి ఆమె తన బండి ఎక్కడంతో అవినాష్‌‌కు మెజారిటీ లభించింది.

రేషన్ మేనేజర్‌గా అరియానా

రేషన్ మేనేజర్‌గా అరియానా


అవినాష్ ఎక్కువగా ఆరుగురు ప్యాసింజర్లను తన స్టేషన్‌కు చేర్చగా, అరియానా నలుగురిని మాత్రమే తన స్టేషన్లో ఉంచుకోగలిగింది. దాంతో అవినాష్ ఇంటి కెప్టెన్ అయ్యాడు. నోయల్ చేతికి ఉన్న కెప్టెన్సీ బ్యాండ్‌ను తీసి అవినాష్‌ చేతికి తొడిగాడు. ఆ తర్వాత లివింగ్ రూమ్‌లో జరిగిన సమావేశంలో అరియానాను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకొన్నాడు.

అవినాష్ నిబంధనల కొరడా

అవినాష్ నిబంధనల కొరడా

ఇక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన వెంటనే అవినాష్ ఇంటి సభ్యులపై నిబంధనల కొరడా ఝులిపించారు. మైక్ ధరించడం మరిచిపోతే వందసార్లు మైక్ మరిచిపోయాను అంటూ మెడ మీద నుంచి తీసుకొని మళ్లీ వేసుకోవాలి. ఎవరైనా నిద్ర పోయిన సమయంలో కుక్క మొరిగితే రెండుసార్లు స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి అంటూ నిబంధనల చిట్టా విప్పారు. ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడితే.. ప్రతీ కెమెరా ముందుకు వెళ్లి చిన్న పిల్లాడిలా నేను మరోసారి ఇంగ్లీష్‌లో మాట్లాడను అని చెప్పాలి అని చెప్పారు. దాంతో కెప్టెన్ మనకు పనిష్‌మెంట్ ఇష్తున్నారు అంటూ లాస్య కామెంట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X