నీకు పెళ్లి కావొద్దు దేవుడా.. అరియానా శాపం, ఓసీ దొంగ ముఖం దానా... పొడిచేస్తా.. అవినాష్ తిట్లదండకం
బిగ్‌బాస్ ఇంటిలో అరియానా గ్లోరి, ముక్కు అవినాష్ మధ్య చిలిపి కయ్యాలు మరోసారి కనిపించాయి. వారిద్దరి మధ్య సున్నితమైన కెమిస్ట్రీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. హారిక, మోనాల్, అవినాష్, అరియానా కలిసి చిట్ చాట్ చేస్తుండగా.. అవినాష్ పెళ్లిపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. 82వ రోజున వారి మధ్య ఇంటిలో చాలా ఎలా జరిగిందంటే..

అవినాష్‌కు అరియానా షాక్
లాన్‌లో టిఫిన్స్ చేస్తూ కంటెస్టెంట్లు సరదాగా కబుర్లు చెప్పుకొంటున్న సమయంలో ముక్కు అవినాష్‌కు అరియానా గ్లోరి షాకిచ్చింది. నూడుల్స్ తింటున్న అరియానా తనకు తినిపించమని అవినాష్‌ను కోరింది. అయితే అలా తినిపించడం బాగుండదు. నాకే కాకుండా చూసే వాళ్లకు కూడా బాగుండదని అవినాష్ అంటే.. మరి నిన్న ఎందుకు తినిపించావు అంటూ కామెంట్ చేసింది.

అరియానా అర్ధం చేసుకోవడం లేదు
అయితే అరియానా మాటలకు అవినాష్ స్పందిస్తూ.. నేను ఇష్టంగా తినిపించలేదు. ఏదో విషయంలో అర్ధం చేసుకొని తినిపించానని అవినాష్ అంటే నీవు సరిగా అర్ధం చేసుకోవడం లేదు అంటూ హారిక జోక్యం చేసుకొన్నది. అయితే అరియానాను ఇంటిలో తాను అర్ధం చేసుకొన్నంతగా మరెవరూ అర్ధం చేసుకోలేదు అంటూ అవినాష్ జవాబిచ్చాడు. దానికి అరియానా, హారిక అవును అంటూ ఒప్పుకొన్నారు.

పోర్క్‌తో పొడిచేస్తా
అరియానాకు ఎంత సపోర్ట్ చేసినా నాపై ఏదో ఒక కామెంట్ చేస్తుంది. ఇన్ని రోజులు తినిపిస్తే.. మొన్న ఎందుకు తినిపించావని ప్రశ్నించడం సరికాదు అంటూ దొంగముఖం..పోర్క్‌తో పొడిచేస్తా అంటూ అవినాష్ తిట్లదండకం మొదలుపెట్టాడు. అయితే కొన్నిసార్లు కొన్ని విషయాలను పట్టించుకోవద్దు. అమ్మాయిలతో నిజాలు మాట్లాడవద్దు. ఇలా అయితే నీకు పెళ్లి జరిగినట్టే అంటూ అవినాష్‌ను ఉద్దేశించి హారిక కామెంట్ చేసింది.

మూడేళ్ల వరకు పెళ్లి కాదు..
హారిక మాటలకు బలం చేకూరుస్తూ.. అవినాష్‌కు రెండేళ్ల వరకు పెళ్లి కావొద్దు. ఏం మాట్లాడుతున్నావు అంటూ అవినాష్ ప్రశ్నిస్తే.. మూడేళ్ల వరకు అంటూ పెళ్లి కాదు అని అరియానా కామెంట్ చేసింది. దాంతో ఇదేం శాడిజం.. దుర్మార్గురాలా అంటూ అవినాష్ ఫైర్ అయ్యాడు. 2021లో మే నెలలోపు పెళ్లి చేసుకోకపోతే అవినాష్ అంటూ ఏదో చెప్పబోతే.. ఏదో మంత్రం జపించి అతడిపై వేయడానికి ప్రయత్నిస్తే అతడు షాక్ తిన్నాడు.
Recommended Video

అవినాష్ తిట్ల దండకం
నీకు ఇంత చేస్తే.. నాకు పెళ్లి కావొద్దని శపిస్తావా దొంగ ముఖం దానా? అంటూ అరియానాను అవినాష్ తిట్టడం మొదలు పెట్టాడు. దానికి అరియానా సమాధానం ఇస్తూ.. ఒక అమ్మాయి జీవితం కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది. అయితే నేను ఎలాంటి వాడిని ఇక్కడ అందరికి తెలుసు. నీకు కూడా నా గురించి బాగా తెలుసు. కానీ నీవు చెప్పవు. నీకు ఇగో అడ్డు వస్తుంది అంటూ ఆ సరదా చర్చను అవినాష్ ముగించాడు.


Click it and Unblock the Notifications











