చీకట్లో బెడ్‌పై అవినాష్‌ను వాటేసుకొని రొమాన్స్.. లైట్లు ఆర్పేసిన బిగ్‌బాస్.. గదిలో అలాంటి జరిగిందలేదంటూ?

బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో తుది ఘట్టానికి చేరుకొన్నది. అత్యధికంగా రేటింగ్ ఉన్న తెలుగు రియాలిటీషో 11వ వారంలోకి ప్రవేశించింది. అనేక రకాలైన ట్విస్టులతో సాగుతున్న ఈ షోలో ఎమోషన్స్, ఫన్‌తో కూడిన సన్నివేశాలు ఆవిష్కృతవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ కొనసాగుతున్న నేపథ్యంలో బిగ్‌బాస్ మరోసారి కొన్ని ట్విస్టులు ఇచ్చి అభిమానులకు కిక్కించే ప్రయత్నం చేశారు. తాజా బిగ్‌బాస్ ప్రోమోలో తమాషా సన్నివేశం గురించిన వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఇంటిలో ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఇంటిలోకి నబీల్ తల్లి, రోహిణి కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా వినోదంతోపాటు భావోద్వేగాలు కనిపించాయి. ఇక తాజాగా ఇంటిలోకి జబర్దస్త్ అవినాష్ సతీమణి ఇంటిలోకి వచ్చి షాకిచ్చింది. అయితే ఆమె ఇంట్లోకి అడుగుపెట్టిన విధానం చూసి కంటెస్టెంట్లందరూ అవాక్కయ్యారు.

Jabardasth Avinash Funny and emotional moments with Wife in Family Week in Bigg Boss Telugu 8

అయితే అర్ధరాత్రి అందరూ నిద్రలో జారుకొన్నారు. ఆ సమయంలో అవినాస్ సతీమణి మెల్లగా వచ్చి అవినాష్ పడుకొన్న బెడ్‌పైన పడుకొన్నది. మెల్లగా దుప్పటి జరిపి వెనుక నుంచి కౌగిలించుకొంది. అయితే ఎవరో తనను వెనుక నుంచి వాటేసుకొన్నారని ఫీలై.. మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే పక్కనే భార్య కనిపించింది. దాంతో అవినష్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. వెంటనే పక్కనే ఉన్న రోహిణి, టెస్టీ తేజ చూస్తే పక్కనే అమ్మాయి పడుకొని ఉండటంతో వారు కూడా షాక్ తిన్నారు.

అవినాష్ వెంటనే తేరుకొని.. ఎవరో వచ్చి హగ్ చేసుకొన్నారు అంటూ అనడంతో.. టేస్టీ తేజ లేచి.. ఎవరనుకొన్నావు? చెప్పు అంటూ పట్టుబడితే.. పక్కనే ఉన్న రోహిణి.. బ్లాక్ డ్రస్ వేసుకొన్న యష్మీ అనుకొని ఉంటాడు అనగానే కొంత సిగ్గుపడుతూ కనిపించాడు. అయితే గేమ్ ఎలా ఆడుతున్నాను అంటే.. ఓల్డ్ పీపుల్‌తో ఎంగేజ్ అయితే బాగుంటుంది అని అంటే.. అవును నేను యష్మీతో ఎంగేజ్ అవుతున్నాను అనగానే.. సున్నితంగా ఒక్కటించింది

Jabardasth Avinash Funny and emotional moments with Wife in Family Week in Bigg Boss Telugu 8

అయితే భార్యతో ఉన్న అవినాష్‌తో బిగ్‌బాస్ మాట్లాడుతూ.. లైట్స్ స్విచ్చాఫ్ చేయమని చెప్పవుగా.. నీవు వనజను తీసుకొని యాక్షన్ రూమ్‌కు రమ్మని అడిగాడు. ఆ రూమ్‌లోకి అడుగుపెట్టగానే..బెలూన్స్‌తో అలకరించిన గదిలో డైనింగ్ టేబుల్ సెటప్ చేశారు. మంచి పదార్థాలు పెట్టి భార్యతో డైనింగ్‌కు ఏర్పాట్లు చేశారు. దాంతో ఎమోషన్ అయిన అవినాష్.. నా లైఫ్‌లో ఇది అద్బుతమైన అనుభూతి. నా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంత మంచి ట్రీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు.

అయితే యాక్షన్ రూమ్‌లో భార్యతో ఉండగానే.. లైట్లు ఆర్పిస్తుంటే అవినాష్ కంగారు పడ్డాడు. ఏందిరా బాబు.. ఇలా లైట్లు ఆర్పేస్తున్నారంటూ కంగారు పడిపోయాడు.బిగ్‌బాస్ సిగ్గు ఏస్తుందంటూ అరిచాడు. అయితే ఇంటిలో నుంచి చెమటలు తుడుచుకొంటూ వస్తుంటే.. అందరూ అవినాష్‌ను ఆటపట్టించారు. అయితే అలాంటిదేమీ జరగలేదంటూ అవినాష్, ఆయన భార్య కూడా అనడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X