ఛాన్స్ ఇస్తే ముద్దుల పోటీలే.. మమల్ని కొట్టే మగాడే లేడు.. జబర్దస్త్ అవినాష్‌పై పేలిన పంచులు!
తెలుగు టెలివిజన్ రంగంలో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కామెడీ షోలలో కామెడీ స్టార్స్ ఒకటి. యాంకర్ రవి హోస్టుగా శేఖర్ మాస్టర్, ప్రముఖ కమెడియన్లు పాల్గొనే ఈ షో మంచి వినోదాన్ని పంచుతున్నాయి. జబర్దస్త్, పటాస్ ఫేమ్ కమెడియన్లు తమ పంచులతో ఆలరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్‌లో ముక్కు అవినాష్‌పై పేలిన పంచులు ఎలా ఉన్నాయంటే..

బిగ్‌బాస్ తర్వాత అవినాష్‌కు
బిగ్‌బాస్ తర్వాత జబర్దస్త్ అవినాష్ పలు టెలివిజన్ ఛానెల్స్ మంచి అవకాశాలను సొంతం చేసుకొంటున్నాడు. కామెడీ స్టార్ లాంటి షో ద్వారా ముక్కు అవినాష్ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. తాజాగా కామెడీ స్టార్స్ షోలో ముక్కు అవినాష్ టీమ్ చేసిన సందడి ప్రేక్షకుల్లో నవ్వుల పూవులు పూయిస్తున్నది.

గల్లీలో మమల్ని కొట్టే మగాళ్లే లేరు..
కామెడీ స్టార్స్ షోలో భాగంగా పక్కా గల్లీలో మగాళ్లే లేరా.. భయపడ్డారా అంటూ విసిరిన పంచ్‌కు జబర్దస్త్ అవినాష్ టీమ్ బయటకు వచ్చారు. ఈ పంచ్‌కు అవినాష్ టీమ్ మెంబర్స్ స్పందిస్తూ.. మా గల్లీలో మమల్ని కొట్టే మగాడే లేడురా అంటే.. ఊరంతా కొట్టిన తర్వాత గల్లీలో కొడితే ఎంత.. కొట్టకపోతే ఎంతా అంటూ జబర్దస్త్ పంచ్ వేయడంతో అవినాష్ టీమ్ షాక్‌లో ఉండిపోయింది.

కొడితే రక్తం పడుతుంది అంటూ కౌంటర్
తమ ప్రత్యర్థి టీమ్ సభ్యులు వేసిన పంచ్‌కు అవినాష్ టీమ్ మెంబర్ సమాధానం ఇస్తూ.. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.. మా గల్లీ వాళ్లకు ఎదురుపడితే సుస్సు పడుతది.. కొడితే రక్తం పడుతుంది అంటూ కౌంటర్ ఇచ్చారు. దాంతో ఇక రెండు జోకులు చెప్పు లాస్య అక్క సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అంటూ మరో కమెడియన్ పంచ్ ఇచ్చారు.

మా అన్న ముద్దుల పోటీలో...
అవినాష్ టీమ్ మెంబర్లకు మరో జట్టు కౌంటర్ ఇస్తూ మాకు కనుక ఛాన్స్ ఇస్తే.. మా గల్లీలో ముగ్గుల పోటీల పెడుతాం అంటూ పంచ్ వేస్తే.. అదే మా అన్నకు ఛాన్స్ ఇస్తే ముద్దుల పోటీల పెడుతాడు అంటూ అవినాష్ వైపు చూస్తూ ఆయన టీమ్ సభ్యుడు పంచ్ వేశాడు. దాంతో అవినాష్ కుంగుతిన్నాడు.
Recommended Video

వినోదంలో మునిగి తేలిన టీమ్
జబర్దస్త్ అవినాష్ టీమ్, ఇతర టీమ్ మధ్య జరిగిన సంభాషణ మంచి వినోదాన్ని పండించింది. యాంకర్ రవి, లాస్య ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. హోస్టులు శేఖర్ మాస్టర్, శ్రీదేవి పడిపడి నవ్వారు. కరోనా విషాద సమయంలో పంచులతో సాగే ఈ షో జబర్దస్త్ వినోదాన్ని పంచుతున్నది.


Click it and Unblock the Notifications











