‘జబర్దస్త్ అవినాష్ కన్నింగ్.. దొంగతనాలు చేస్తాడు.. మూడుసార్లు అరెస్ట్’.. అఖిల్‌ ఫైర్

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో 5వ వారం నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది. అభిజిత్, అఖిల్ గొడవను పక్కన పెడితే.. అఖిల్‌తో జబర్దస్త్ అవినాష్‌కు భారీగానే గొడవ జరిగింది. వారిద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. అయితే అఖిల్ ప్రవర్తనతో విసిగిపోయిన అవినాష్ తనకు తానే తిట్టుకొంటూ సెటైర్లు వేశారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా వారి మధ్య జరిగిన వాగ్వాదం ఇదే..

5 వారం నామినేషన్ సందర్భంగా

5 వారం నామినేషన్ సందర్భంగా

ఐదో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన ప్రక్రియలో అఖిల్‌కు తెల్లటి ఫోమ్‌ రాసి అవినాష్ నామినేట్ చేశాడు. నామినేట్ చేయడానికి కారణం చెబుతూ... లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో అఖిల్ తీసుకొన్న నిర్ణయంపై మాకు అసంతృప్తి ఉంది. బిగ్‌బాస్ చెప్పినా వినకుండా అందరి కోసం కాకుండా కొందరి కోసం వస్తువులు తీసుకొన్నావు. దాంతో ఆకలితో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ అవినాష్ తెలిపాడు.

నీతో క్లోజ్‌గా ఉన్నవాళ్ల కోసమే అంటూ

నీతో క్లోజ్‌గా ఉన్నవాళ్ల కోసమే అంటూ

16 మంది ఇంటి సభ్యులు ఉండగా.. కేవలం నీతో క్లోజ్‌గా ఉన్నవాళ్ల కోసమే నీవు వస్తువులు తీసుకొన్నావు. మిగితా వారి గురించి పట్టించుకోలేదు. ఇంట్లో ఉన్నప్పుడు అందరూ ఒక ఫ్యామిలీలా ఉండాలి. అందరి కోసం ఆలోచించాలి. నీవు అలా ఆలోచించకుండా లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను మిస్ యూజ్ చేశావు. అందుకే నామినేట్ చేస్తున్నాను అని అఖిల్‌కు అవినాష్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

నీ వల్ల కడుపు నిండా తినలేదు

నీ వల్ల కడుపు నిండా తినలేదు


అయితే అవినాష్ చెప్పిన కారణంపై స్పందిస్తూ.. నా నిర్ణయం వల్ల పస్తులు పండుకొన్నావా? అని అఖిల్ కౌంటర్ ఇచ్చారు. అఖిల్ కౌంటర్‌కు సమాధానం ఇస్తూ.. పస్తులు ఉండలేదు కానీ కడుపు నిండా తినలేదు. ఆకలితో ఉన్న బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అని అవినాష్ అంటుండగా.. నీవు సేఫ్ గేమ్‌ అడుతున్నావు అని అఖిల్ కామెంట్ చేశాడు.

నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానా?

నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానా?


అఖిల్ సేఫ్ గేమ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తనపై తాను తీవ్రమైన ఆరోపణలు చేసుకొని అఖిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. నేను సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని నీవు అంటే బయట కన్నింగ్, దొంగతనాలు చేస్తాడు. మూడు సార్లు అరెస్ట్ అయ్యాడు అనుకొంటున్నారా? అందుకే ఇక్కడ నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానని భావిస్తున్నావా? ఒకవేళ నేను సేఫ్ గేమ్ ఆడితే నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు. నా మంచి తనాన్ని సేఫ్ అనుకొంటే.. మీరు నాతో మంచిగానే ఉంటున్నారు అంటే మీరు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారా? అంటూ అఖిల్‌కు అవినాష్ కౌంటర్ ఇచ్చారు.

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Gajjar Cried నేషనల్ చానెల్.. అందరూ చూస్తుంటారు అంటూ బోరును ఏడ్చిన మోనాల్‌!
మెనాల్‌ను నామినేట్ చేసిన అవినాష్

మెనాల్‌ను నామినేట్ చేసిన అవినాష్


ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియలో రెండో వ్యక్తిగా మోనాల్ గజ్జర్‌ను అవినాష్ నామినేట్ చేశాడు. మోనాల్‌ను నామినేట్ చేయడానికి కారణం చెబుతూ.. నన్ను సేఫ్ గేమ్ ఆడుతున్నావని అడిగారు. నేను సేఫ్ గేమ్ ఆడటం లేదనే విషయం మీకు తెలియాలి. ప్రతీ ఒక్కరితో మంచిగా ఉంటున్నాను. దానిని సేఫ్ గేమ్ అనుకొంటున్నందుకు మోనాల్‌ను నామినేట్ చేస్తున్నాను అని తెల్లటి ఫోమ్ రాసి అవినాష్ కారణాలు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X